28, డిసెంబర్ 2018, శుక్రవారం

కథాలాపం

స్కూల్ లో కొత్త సంవత్సరం టెక్స్ట్ బుక్స్ రాగానే హిందీ, ఇంగ్లీష్, తెలుగు టెక్స్ట్ లు  వరస పెట్టి చదివేసే దాన్ని నేను. (సైన్స్, మ్యాథ్స్  పుస్తకాలు సంవత్సరం చివరికి కూడా కొన్నప్పటి లాగే కొత్తగానే ఉండేవి ... అది వేరే సంగతి. ) ఫస్ట్ క్లాస్ నుంచి ఇదే అలవాటు.  

ముఖ్యంగా ఇంగ్లీషు టెక్స్ట్ లు. నావి చదవడం అయిపోయాక అక్కవి. అక్క దాని టెక్స్ట్ లో కథలు చదివి explain చేసేది... నన్నూ అమ్మని కూర్చోబెట్టి! 'ప్రైడ్ అండ్ ప్రెజుడీస్' గురించి అక్క ద్వారానే ఫస్ట్ విన్నాను నేను. 

పోయెట్రీ కంటే ఫిక్షన్ వైపే ఎక్కువ ఇంట్రస్ట్ ఉండేది. 

అలాగే షార్ట్ స్టోరీస్ .. చిన్న కథలనే రచనా ప్రక్రియ ని పరిచయం చేసినవి కూడా స్కూల్ పుస్తకాలే! 

ఇప్పటికీ నేను వదలలేని రచయితలని మొదట పరిచయం చేసింది స్కూల్ టెక్స్ట్ బుక్కులే ... డికెన్స్, టాల్స్టాయ్, జేన్ ఆస్టెన్, ఓ హెన్రీ, ఆస్కార్ వైల్డ్, ఆర్థర్ కానన్ డోయల్, మపాసా... 

నాకు ఓ ప్రాబ్లెమ్ ఉంది. కథ ని కథ లాగా చదవలేను. బాగా మనసుకి పట్టించేస్కుంటూ ఉంటాను. 

అలా నా జీవితం లో పెద్ద మార్పుల్ని తీసుకొచ్చిన చిన్న కథలని ఈ రోజు గుర్తుచేసుకుంటున్నాను. 

1. God sees the truth, but waits - లియో టాల్స్టాయ్ కథ ఇది. బాబోయ్ ... ఇది నెంబర్ వన్ స్థానం లో ఊరికే రాయలేదు ... ఇది చదివాక నేను కొన్నేళ్ళు దేవుడ్ని నమ్మడం మానేసాను. ఈ కథ లో హీరో కి తాగుడు అలవాటు ఉంటుంది కానీ మానేస్తాడు ఫామిలీ కోసం. ఇతనున్న దగ్గరే ఓ హత్య జరిగితే ఇతనికున్న హిస్టరీ వల్ల ఇతనే చేసాడని జైల్లో పెడతారు. కాదని ఎంత చెప్పినా వినరు. యవ్వనం లో జైలు కెళ్లిన హీరో కి వృద్ధాప్యం వచ్చేస్తుంది. 26 ఏళ్ళు! యవ్వనం లో లైవ్లీ గా ఉండే వాడు ఇప్పుడు సాధు జీవి అయిపోతాడు.  ఇంతలోపు ఆ హత్య నిజంగా చేసిన వాడు ఈ జైలు కే  వచ్చి పడతాడు. వాడు పారిపోడానికి ట్రై చేస్తూ పట్టుబడతాడు. హీరో ని జైలరు అడిగితే 'ఈ విషయం లో నేను మాట్లాడకూడదు' అని గుంభనంగా ఉంటాడు. హత్య చేసిన వాడు పశ్చాత్తాపపడి తన నేరాన్ని ఒప్పుకుంటాడు. హీరో ని క్షమాపణ కోరుకుంటాడు. హీరో క్షమించేస్తాడు. హీరో ని రిలీజ్ చేసే ప్రాసెస్ మొదలు పెడతారు జైలర్లు. కానీ రిలీజ్ చేసే రోజే హీరో చనిపోయి ఉంటాడు. నా లాంటి వాళ్ళు తిట్టి పోయకుండా 'ప్రశాంతంగా మరణించాడు' అని రాసాడు టాల్స్టాయ్. ఏవిటండీ ఈ కథ? నాకు పదిహేనేళ్ళప్పుడు ఇది చదివాను. ఓ పదేళ్ల పాటు దేవుడ్ని నమ్మలేదు. 

2. The Necklace - ఈ కథ కూడా అంతే దారుణం. హీరోయిన్ ఓ అందమైన కానీ అంతగా డబ్బులేని కుటుంబం లో పుట్టిన అమ్మాయి. ఓ క్లర్క్ ని పెళ్ళి చేసుకుంటుంది. ఆమె కలలన్నీ తన భర్త తాహతు కి మించినవే. ఓ సారి భర్త ఆఫీసులో ఓ పార్టీ కి పిలుపొస్తుంది. వేసుకోడానికి ఏమీ మంచి బట్టలు, నగలు లేవు అని వెళ్లనంటుంది. భర్త కొత్త డ్రెస్ కొనిస్తాడు. కానీ నగ? తన రిచ్ ఫ్రెండ్ దగ్గరికెళ్తుంది హీరోయిన్. ఆమె దగ్గర అన్ని రకాల నగలుంటాయి. నీకిష్టమొచ్చింది తీస్కో అని అలమార తలుపులు బార్లా తెరుస్తుంది ఫ్రెండ్. ఈమె కి కళ్ళు తిరిగిపోతాయి! అన్నిటిలోకి ఓ రవ్వల నెక్లెస్ నచ్చుతుంది. అది ఇవ్వదేమో అని సంశయంగా అడుగుతుంది. 'ఓస్ అంతేనా .. తీస్కో' అని ఇచ్చేస్తుంది ఫ్రెండు. పార్టీ రోజు అందంగా తయారవుతుంది హీరోయిన్. పార్టీ లో భర్త బాస్ తో సహా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈమెవరో అని అచ్చెరువొందుతూ ఈమె తో డాన్స్ చెయ్యడానికి వరుస కట్టేస్తారు! అంత గొప్పగా పార్టీ జరిగాక ఇంటికొచ్చి చూస్కుంటే మెడలో నెక్లెస్ లేదు... అంతా వెతుకుతారు. కనపడదు. అంత ఖరీదైన నెక్లెస్ పోగొట్టానని ఫ్రెండు కి చెప్పడం ఇష్టం లేక నగల దుకాణం లో అలాంటి నగ వెతికి నలభై  వేల ఫ్రాన్కు లు అప్పు చేసి నగ కొని ఫ్రెండు కి ఇచ్చేస్తారు. అప్పటి నుంచి మొదలవుతుంది అప్పు తీర్చే ప్రక్రియ ... చిన్న ఇంట్లోకి మారిపోతారు .. సున్నితంగా ఉండే ఈమె వేళ్ళు అంట్లు తోమి తోమి కరుకుగా అయిపోతాయి. హుందాగా ఉండే అమ్మాయి పైసా పైసా కీ రోడ్డు మీద గొడవలు! ఈ అప్పులు తీరడానికి పదేళ్లు పడుతుంది. ఈ అమ్మాయి అందమంతా పోతుంది. ఓ సారి మార్కెట్ లో రిచ్ ఫ్రెండ్ కనపడుతుంది... ఆమె పదేళ్ల క్రితం లానే ఉండటం ఈమె కి బాధ కలిగిస్తుంది. నెక్లెస్ విషయం లో నిజం చెప్పి 'నీకు తెలియలేదు కదూ' అని నవ్వుతుంది. 'ఓసి పిచ్చి దానా ... ఆ నెక్లెస్ నకిలీదే .... ఐదువందల కంటే చెయ్యద'ని రిచ్ ఫ్రెండు చెప్పడం తో కథ ముగిసిపోతుంది. మపాసా అనే ఆయన రాసిన చెత్త పిచ్చి కథ ఇది.  

3. Tin Soldier and the paper Ballerina - ఓ పిల్లవాడికి కొన్ని బొమ్మలు బహుమతి గా వస్తాయి. అందులో టిన్ను తో చేసిన కొంత మంది సైనికుల బొమ్మలుంటాయి. అందులో ఆఖరు సైనికుడికి ఒకే కాలు ఉంటుంది .... టిన్ను సరిపోక అలా చేశారు. అతను పక్కనే ఉన్న కాగితపు డాన్సర్ బొమ్మని ప్రేమిస్తాడు. ఈ బొమ్మల్లోనే ఓ విలన్ నానా రకాలు గా వీళ్ళని విడదీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ ఒంటి కాలు సైనికుడు ఎక్కడెక్కడో పారవేయబడి చివరికి ఓ చేప మింగితే ఆ చేప ని ఓ జాలరి పడితే ఈ ఇంటికే వచ్చి చేరుతుంది. చేపని చీరితే టిన్ను సోల్జరుడు! మళ్ళీ బొమ్మలల్లో స్థానం సంపాదిస్తాడు. ఇక్కడితో కథ ఆపేయచ్చు కదా... లేదు. నన్ను ఏడిపించనిదే హన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ నిద్రపోడు కదా. టిన్ను సైనికుడు విలన్ వల్ల నిప్పు లో పడతాడు .... అతని ప్రేయసి పేపర్ నర్తకి కూడా నిప్పుల్లోకి దూకేస్తుంది. మర్నాడు గది తుడిచే వాళ్ళకి కాలి మసైన పేపర్ పక్కన ఓ ఇనప గుండె కనిపిస్తుంది. 


ఈ కథలు చదివి బెంగెట్టేసుకొని కలలు కంటే ఇంతే .. ప్రేమిస్తే ఇంతే .. ఇలాంటి భయాలన్నీ పట్టుకున్నాయి అప్పట్లో నాకు. 


కొన్ని హాపీ కథలు కూడా ఉన్నాయి. 

4. The New Blue Dress - ఒక స్లమ్స్ లాంటి ఏరియా నుంచి వచ్చే అమ్మాయి కి ఒక టీచర్ కొత్త నీలం రంగు డ్రెస్ ప్రెసెంట్ చేస్తుంది. ఈ ఒక్క పని ఓ చెయిన్ ఆఫ్ ఈవెంట్స్ కి కారణం అవుతుంది. ఆ పాప కొత్త డ్రెస్ వేసుకుందని ఆ పాప తల్లి ఇల్లు సద్ది నీట్ గా పెడుతుంది. పాప తండ్రి ఇంటి బయట శుభ్రం చేసి తోట వేస్తాడు. ఇది చూసిన పక్కింటి వాళ్ళు కూడా మారతారు .. ఇలా కొంత మంది కుటుంబాలు మారతారు .. అటే వెళ్తున్న ఓ చర్చి ఫాదర్ ఇది చూసి వాళ్ళకి పై అధికారుల సహాయం తీసుకొస్తాడు .. చూస్తూ చూస్తుండగానే ఆ వీధి రూపు రేఖలు మారిపోతాయి .. అంతా ఓ పాప కొత్త డ్రెస్ వల్ల! ఇది క్లీవ్ ల్యాండ్ ఓహైయో లో జరిగిన నిజం కథ అట! 

5. In Celebration of Being Alive - ప్రపంచం లో మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసిన డా. క్రిస్టియన్ బెర్నార్డ్ రాసిన వ్యాసం లోది ఈ కథ. డాక్టర్ గారికే ఓ ఆక్సిడెంట్ జరుగుతుంది. ఎంత డాక్టర్ అయినా పేషేంట్ పడే అన్ని బాధలు పడతారు ఈయన. భయం, డిప్రెషన్, ఆక్సిడెంట్ తాలూకు భౌతిక బాధ ... ఇలా ఉండగా పిల్లల వార్డు లో ఓ రోజు గోల గోల గా ఉంటుంది. ఓ కళ్ళు పోయిన పిల్లాడు, ఓ చెయ్యి, కాలు కోల్పోయిన పిల్లాడు ఓ ఫుడ్ ట్రాలీ ని దొరకబుచ్చుకొని హాస్పిటల్ వార్డు లో రేస్ చెయ్యడం మొదలు పెడతారు. పేషేంట్లందరూ వాళ్ళని ఛీర్ చెయ్యడం .. వాళ్ళు ఫుల్ స్పీడ్ లో ట్రాలీ నడపడం! చివరికి ఓ గోడ తగిలి అందులో సామాననంతా కిందపడి నర్సులు వచ్చి ఈ పిల్లల్ని తిట్టి మళ్ళీ పడుకోబెట్టే దగ్గర వీళ్ళ అల్లరి ఆగుతుంది. డాక్టర్ గారికి ఈ ఇద్దరు పిల్లలూ తెలుసు. ఒకడి తల్లి తాగొచ్చిన భర్త మీద కి లాంతరు విసిరితే వీడికి తగిలి కళ్ళు పోయాయి. ఇంకొకడికి హార్ట్ లో హోల్ డాక్టర్ గారే మూసారు .. కానీ వాడికి కాన్సర్ వల్ల కాలు చేయి తీసేయాల్సి వచ్చింది. వాళ్ళు మాత్రం డాక్టరు గారు కనపడగానే 'భలే రేస్ చేసాం కదండీ' అని మురిసిపోవడం డాక్టర్ గారికి బ్రతుకు పాఠం నేర్పింది .. 'జీవించి ఉండటమే ఓ వేడుక అని తెలిపింది' అని రాస్కున్నారాయన!

6. Snapshot of a Dog - జేమ్స్ థర్బర్ రాసిన కథ ఇది. ఓ పాత ఫోటో కంటబడి పాతికేళ్ల క్రితం చనిపోయిన తన పెంపుడు కుక్క 'రెక్స్' గురించి నెమరువేసుకొనే ఓ వ్యక్తి కథ ఇది. కుక్కల్ని పెంచుకున్న వాళ్ళకి ఈ కథ బాగా హత్తుకుంటుంది. ఈ మధ్యే కుక్కల్ని ముట్టుకొనే ధైర్యం చేసి, ఫేస్ బుక్ లో 'ది డోడో' పేజీ లో వీడియోలు తెగ చూసేస్తూ కుక్క ని అడాప్ట్ చేసుకోవాలని భయం భయం గా ... సంకోచంగా కల కంటున్న నాలాంటి వాళ్ళకి కూడా ఈ కథ బాగా నచ్చుతుంది. 

ఇప్పటికీ ప్రయత్నిస్తుంటాను .. కథ కథ లాగా చదవాలని.. మనసుకి పట్టించుకోకూడదని. 

ఎంత వరకూ సక్సెస్ అయ్యాను? 

అది వేరే కథ! 

లేబుళ్లు: , , , , ,

13 కామెంట్‌లు:

29 డిసెంబర్, 2018 12:00 AMకి వద్ద, Blogger విన్నకోట నరసింహా రావు చెప్పారు...

షార్ట్ స్టోరీస్ గురించి పైన మీరు చేసిన పరిచయం బాగుంది. The Necklace అనే కథ నాకు నచ్చింది. మీరు అదొక “చెత్త పిచ్చి కథ” అన్నారు. పోన్లెండి, ఎవరి అభిరుచి వారిది.

చిన్న కథలను అద్భుతంగా వ్రాసిన అమెరికన్ రచయిత O.Henry గారి కథలు కూడా బాగుంటాయి. చదివారా? ముఖ్యంగా The Gift of the Magi అనే కథ. క్రిస్మస్ సందర్భంగా ఒకరికొకరికి ఇవ్వడానికి ... ఎదుటి వారికి తెలియకుండా ... బహుమతులు కొనాలని అనుకుంటారు ఒక భార్యాభర్తల జంట. కావలసినంత డబ్బు లేకపోవడంతో ఆ బహుమతుల్ని ఏరకంగా కొన్నారు అన్నది కథ సారాంశం. రమ్యమైన కథ.

సరే, మాస్టర్ స్టోరీటెల్లర్ అనిపించుకున్న సమర్సెట్ మామ్ (Somerset Maugham) కథలు చెప్పక్కర్లేదు. మీరు చదివే ఉంటారనుకుంటాను.

 
29 డిసెంబర్, 2018 12:05 AMకి వద్ద, Blogger Sowmya చెప్పారు...

Chettha picchi katha anadam ninda sthuthi andi. Context lo humour padavakoodadani vivarana ivvaledu.
Gift of Magi chadivanandi. Maugham rachanalu kooda. :)

 
29 డిసెంబర్, 2018 5:17 AMకి వద్ద, Blogger Pavan Kumar Reddy Rendeddula చెప్పారు...

షార్ట్ స్టోరీస్ అదీ ఇంగ్లీష్ లో చదవలేదు, ఇకపైన చదవడం అలవాటు చేసుకుంటాను. మంచి పోస్ట్ Sowmya గారు.
స్కూల్ లో ఇంగ్లీష్ ఏదో ముక్కుబడిగా చదివి పాస్ అవడం అలవాటు

 
29 డిసెంబర్, 2018 6:49 AMకి వద్ద, Blogger Sowmya చెప్పారు...

Konni subjects nenu kooda alaaga ayindanipincha lendi. .hehe... with ur sense of humour, u will enjoy English short stories of Wodehouse, mark twain, oscar wilde etc: )

 
30 డిసెంబర్, 2018 3:08 PMకి వద్ద, Blogger నీహారిక చెప్పారు...

మొదటి కధలో తాగుబోతు హీరో మారిపోయినా జనాలు నమ్మరు. ఒక మంచివాడు చెడ్డవాడయే చాన్స్ ఉన్నా జనాలు నమ్మరు. మన బ్రెయిన్ కండిషనల్ అయిపోయాక ఏదీ నమ్మబుద్దికాదు. అన్నీ స్వయంగా అనుభవిస్తేనే నమ్ముతాము అంటే జీవితం అయిపోతుంది. తను నిర్దోషి అనే నిజం నిర్ధారణకి వచ్చాక ప్రశాంతంగా కన్నుమూసాడు. తప్పుచేయనపుడు దేవుడైనా ఓపికగా వెయిట్ చేయవలసిందేగా ?

 
31 డిసెంబర్, 2018 8:54 PMకి వద్ద, Blogger Sowmya చెప్పారు...

Mee perspective kooda bagundandi :)

 
2 జనవరి, 2019 6:31 PMకి వద్ద, Blogger unknown చెప్పారు...

కథ లో లీనమై పోయి అయ్యో అయ్యయ్యో అని ఏడ్పులు పెడబొబ్బలు పెట్టె ఆ పిచ్చ్చి అలవాటు నాకు కూడా ఉంది .
నాకున్న ఆ sensitiveness భరించలేక , చదవడమే మానేశా . ఓన్లీ కామెడీ ఇప్పుడు. ఒక్కోసారి పిచ్ఛ్ కోపం వస్తుంది కూడా ఈ రీడింగ్ అలవాటు మీద , ఎవరైనా జాలి తో మోసం చేసినప్పుడు .

 
2 జనవరి, 2019 10:58 PMకి వద్ద, Blogger Sowmya చెప్పారు...

Hahha! Jaali tho mosam...bhale!

 
3 జనవరి, 2019 9:00 AMకి వద్ద, Blogger విన్నకోట నరసింహా రావు చెప్పారు...

“unknown” గారూ, నమ్మించి మోసం చెయ్యడం అన్నది విన్నాను గానీ “జాలి తో మోసం” అంటే నాలాంటి వాడికి అర్థం కావడంలేదు (కారుణ్య మరణం లాగా ఉంది). కాస్త విడమర్చి చెప్పగలరా ప్లీజ్?

 
3 జనవరి, 2019 11:33 PMకి వద్ద, Blogger unknown చెప్పారు...

Meeru cheppinde sir. jaali kaliginche kathalu cheppi panulu cheyinchukovadam.

 
4 జనవరి, 2019 12:45 AMకి వద్ద, Blogger విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఓహో, అర్థమైంది "unknown" గారూ, థాంక్స్. sob story వినిపించడం లాగా అన్నమాట. నేనూ రెండు మూడు సార్లు బలి అయ్యాను 🙁.

 
5 జనవరి, 2019 9:22 AMకి వద్ద, Blogger Lalitha చెప్పారు...

Wodehouse is my all-time-fav. Nice to see his name in your list.

 
5 జనవరి, 2019 4:20 PMకి వద్ద, Blogger Sowmya చెప్పారు...

Aayanadi trademark humour kada!

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్