(ఈ విషయం లో) అందరం ఒకటే!
చిన్నప్పటి నుంచి భిన్న సంస్కృతుల్ని పరిచయం చేస్కోవడం నాకు చాలా ఇష్టం.
నేను పెరిగిన వాతావరణం కూడా నాకు అలాంటి అవకాశాలు కల్పించడం నా అదృష్టం.
హైద్రాబాద్ లో ఉండటం వల్ల కలిగిన అలాంటి ఓ మంచి అవకాశం - ముస్లిం సంస్కృతి కి దగ్గరగా ఉండటం.
మూడో క్లాసు నుంచి ఇంటర్మీడియేట్, డిగ్రీ, మళ్ళీ నేను లెక్చరర్ అయ్యే దాకా బోల్డు మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉండేవారు నాకు. (చిన్నప్పటి స్నేహాల లాగే వీరి తో కొంచెం టచ్ పోయింది ... కానీ మనసులో స్నేహం అలాగే ఉంది).
మా ఇంట్లో అమ్మా, నాన్నల నుంచి కూడా 'వీరి తో మాట్లాడద్దు, వీరి ని అక్కడే ఉంచు' .. ఇలాంటి ప్రెషర్ ఉండేది కాదు.... ఇది ఇంకో అదృష్టం గా భావిస్తాను.
ఎన్ని పోరాటాలు, ఏ బిల్లులు, ఏ పరిస్థితులు, ఏ మహానుభావుల మానవతా స్పృహ - అందరూ కలిసి చదువుకొనే స్వాతంత్రాన్ని కలిగించాయో వాటికి/వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను.
ఎందుకంటే గిరి గీసుకొని మనలాంటి వాళ్ళే కలిసి ఉండాలి, కలిసి చదువుకోవాలి అంటే వారి ప్రపంచం మనకి తెలిసే అవకాశం ఉండదు... దీని వల్ల దూరాలు పెరుగుతాయి కానీ తగ్గవు .. ఇంకో ప్రాబ్లమ్ ... మనం గీసుకున్న గిరి అక్కడే ఆగదు ... సబ్ - కేటగిరీ లు పెరిగి ఇంకా ఇంకా చిన్నది అయిపోతుంది.
నా మొదటి ముస్లిం ఫ్రెండ్ నాకు బాగా గుర్తు. నాలుగో తరగతి లో ఆసియా. మొదటి సారి మాట్లాడటం లోనే అప్పటి హిట్ అయిన చిరంజీవి గారి పాట స్టెప్ వేసి చూపించింది! ఆమెకి తెలిసిన తెలుగు ఆ పాట వరకే. అక్కడ చదువుకున్నంత కాలం మంచి ఫ్రెండ్స్ మేము.
ఆ తర్వాత ఎంతో మంది ఫ్రెండ్స్ ఏర్పడ్డారు.
అసలు స్కూల్ లో ముస్లిం ఫ్రెండ్స్ ఇంత మంది, హిందూ ఫ్రెండ్స్ ఇంత మంది అని లెక్క పెట్టం కదా ... అలాగే మైనారిటీ రిజర్వేషన్ సిస్టం స్నేహాలకి వర్తించదు కదా... ఇవి లెక్కల్ని మించిన అపురూప బంధాలు.
స్కూల్ లో నన్ను సినిమాల్లో లాగా 'మూ బోలి బెహెన్' అంటే 'మాట పిలుపు వల్ల అయిన చెల్లి' అని పిలిచే వాడు ఓ ఫ్రెండు. అలా నాకు రాజకీయ నాయకులు అన్నట్టు అక్షరాలా ఓ 'ముస్లిం సోదరుడు' సంభవించాడు. ఎన్నేళ్ళైనా నన్ను మర్చిపోకుండా మళ్ళీ ఈ మధ్యే నన్ను వెతికి పట్టుకున్నాడు ఎఫ్ బి లో.
ఇంటర్ నుంచి నేను గర్ల్స్ కాలేజీల్లో నే చదువుకున్నాను. అప్పుడు నా స్నేహితుల్లో బోల్డు మంది ముస్లిం అమ్మాయిలు ఉండేవారు. అప్పుడు నాకు అనిపించింది ... అసలు అమ్మాయిలు ఎక్కడ పుట్టినా కష్టసుఖాలు ఒకటే అని. ఆ అమ్మాయిలు కూడా మిడిల్ క్లాస్ (ఒక్కో సారి అంత కన్నా తక్కువ ఆర్ధిక స్థాయి) లో పుట్టిన వారే. వారి కి కూడా తెలివి, పట్టుదల, ఆంబిషన్, కష్టపడే తత్వం అందరిలాగే ఉండేవి. వారి లో కూడా సిగ్గరులు, చలాకీ పిల్లలు, అల్లరి పిడుగులు ఉండేవారు. మరీ ముఖ్యంగా 'మా అమ్మాయి కూడా చదువుకోవాలి' అని వారి తల్లిదండ్రులు కూడా భావించి, కష్టపడి, ఒక్కో సారి చుట్టాల ప్రెషర్ ని తట్టుకొని, ఆర్ధిక ఇబ్బందులు అనుభవిస్తూ అయినా సరే చదివించేవారు.
నేను లెక్చరర్ గా ఓ రెండేళ్లు పని చేశాను .. నేను డిగ్రీ చేసిన కాలేజీ లోనే. అప్పుడు నా క్లాసు లో ఫస్ట్ ర్యాంకర్ ఓ ముస్లిం పిల్లే.
కాలేజీ గెట్ టుగెదర్స్ లో ఓ సారి 'పాట్ లక్' పార్టీ చేసుకున్నాం. అందరం వారి ఇంటి నుంచి ఓ డిష్ చేసి తీసుకు రావాలి. నేను సాంబారు తీసుకెళ్లా. పార్టీ లో ఖర్చవగా సగం మిగిలితే వంతులేస్కోని బాటిల్స్ లో నింపుకొని మరీ తీసుకెళ్లిపోయారు మా ముస్లిం ఫ్రెండ్స్. నేను వాళ్ళ లౌకీ కా ఖీర్, డబుల్ కా మీఠా అలాగే తీసేస్కున్నా మరి!
ముఖ్యంగా ఆ లౌకీ కా ఖీర్ (ఆనపకాయ పాయసం) గురించి చెప్పుకోవాలి ... మా ఫ్రెండ్స్ వాళ్ళమ్మ గారి స్పెషాలిటీ అట అది ... నేను అలాంటి రుచి పెళ్ళిళ్ళల్లో కూడా తినలేదు!
రోజూ వారీ మాటల్లో మీ సంప్రదాయాలు ఎలా ఉంటాయి .. మావి ఇలా ఉంటాయి అనే మాటలొచ్చేవి. పెద్దవాళ్ళ ప్రెజుడీస్ లు కొన్ని మా మాటల్లో కూడా తొంగి చూసేవి. కానీ అవి మా బంధాన్ని ఎన్నడూ బలహీనం చేయలేకపోయాయి.
నాకు ఉర్దూ అంటే వల్లమాలిన అభిమానం. సంస్కృతం అంటే ఎంత ఇష్టమో అంత. నాకు వారి పేర్ల అర్ధాలు తెలుసుకోవడం ఇష్టంగా ఉండేది. నేను విన్న గజల్స్ లో మాటల అర్ధాలు వాళ్ళని అడిగి తెలుసుకొనే దాన్ని.
మా డిగ్రీ కాలేజీ లో గీతా శ్లోకాలే ప్రేయర్. ఆ శ్లోకాలు వాళ్ళు కూడా చెప్పే వారు.
డిగ్రీ లో నే ఇర్ఫానా బానో అని ఓ మంచి స్నేహితురాలు ఉండేది. చాలా మంచి పిల్ల. బాగా చదువుకొనేది. అందమైన పిల్ల. ఇంగ్లీష్ బాగా మాట్లాడేది. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. నేను చేరిన కొత్త లో తనంతట తానే పరిచయం చేసుకుంది నన్ను.
తనకి డిగ్రీ ఫైనల్ ఇయర్ లో పెళ్లయ్యింది.
వాళ్ళ ఇల్లు కాలేజీ నుంచి మా ఇంటి కి వెళ్ళే దారే.
నేను లెక్చరర్ అయ్యాక ఓ రోజు అలా వెళ్తుంటే వాళ్ళ నాన్నగారు కనిపించారు. ఆయన అంతకు ముందు నా తో మాట్లాడింది లేదు. స్కూటర్ ఆపి ఇర్ఫానా పురిటికి ఇంటికి వచ్చింది ... ఒక సారి వస్తావా అమ్మా అని అడిగారు .... నేను చాలా ఆనందించాను.. వెళ్ళాను అప్పుడే ఆయన తోటి.
ఇర్ఫానా, నేనూ చాలా సేపు మాట్లాడుకున్నాం ...పాత జోకులు గుర్తు చేసుకొని నవ్వుకున్నాం ... ఇంక నేను ఇంటికి వెళ్ళే టైం వచ్చినప్పుడు తెలిసింది. తను కొంచెం వీక్ గా ఉందని ... డాక్టర్లు జాగ్రత్త గా ఉండమన్నారని. వాళ్ళ నాన్నగారి కి నన్ను చూసి ప్రాణం లేచొచ్చినట్టయి వాళ్ళమ్మాయి నా తో అయితే కొంచెం సేపు అన్నీ మర్చిపోయి నవ్వుతుంది, హాయి గా ఉంటుంది అనే తాపత్రయం తో నన్ను తీసుకెళ్లారని.
ఇన్నేళ్లకి ఈ సంఘటన గుర్తు చేసుకుంటే నాకు అనిపిస్తుంది ... ఏ తండ్రికైనా బిడ్డ బిడ్డే ... తాపత్రయం తాపత్రయమే ... ఇందులో మతాల ప్రసక్తి ఎక్కడుంది?
(తర్వాత అంతా బాగానే జరిగింది అని తెలిసింది. మా స్నేహితురాలు ఆరోగ్యంగా ఉంది, పిల్లా పాపలతో)
ఇంకో ఫ్రెండ్ షబానా అని ... గోరింటాకు అద్భుతంగా పెట్టేది. కాలేజీ పోటీలో పాల్గొనాలంటే సిగ్గు. నా చేతి మీద అయితే పెడతా అంది. నాకు డబుల్ ఆనందం. నా అర చేతిలో అందమైన అరబిక్ డిజైన్ .. మా స్నేహితురాలి చేతిలో బహుమతి!
నా స్నేహం మనుషుల తో నే కాక ఉర్దూ సాహిత్యం, సంస్కృతి తో కూడా.
(గజల్స్ తో నా అనుబంధం, నేను రాసిన గజల్స్ ఇదే బ్లాగ్ లో ఇది వరకూ పోస్ట్ చేశాను ..
1. ఆజ్ .. కుఛ్ టూటీ ఫూటీ సీ హూ మేఁ ....
2. నేను రాసిన ఓ ఉర్దూ ఘజల్ )
హైద్రాబాద్ లో ఉంటూ వారి చరిత్ర, సంస్కృతి అంటక పోవడం కష్టం. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లో మెంబర్షిప్ తీసుకున్నప్పుడు ఆ భవంతి చూసి భలే అనిపించింది. నాకసలు చారిత్రక కట్టడాలంటే ఓ రకమైన అభిమానం! చౌ మహల్లా ప్యాలెస్, తారామతి బారాదరీ చూసినప్పుడూ అలాగే అనిపించింది.
ఇంత అనుబంధం ఉండీ రంజాన్ నెలలో చార్మినార్ దగ్గర జరిగే ఈద్ బజార్ కి వెళ్ళడానికి నాకు బోల్డు సంవత్సరాలు పట్టింది! 2017 లో మొదటి సారి వెళ్లాను ... అక్కడికి అర్ధరాత్రి వెళ్తేనే థ్రిల్లు.
(అమ్మాయిలు అర్ధరాత్రి బయటికెళ్లాలంటే ఇంత వేడుక జరగాలో ఏంటో మరి!)
మామూలుగా ఎక్కడా దొరకనివి అక్కడ దొరుకుతాయి లాంటివేమీ ఆ ఉత్సాహానికి కారణాలు కావు. చార్మినార్ లోగిలి లో ... అర్ధరాత్రి అనే తలపే రాని మిరిమిట్లు గొలిపే వెలుగులతో, వారికున్న అతి పెద్ద పండగ సమయం లో కుటుంబాలతో వచ్చి వారు చేసే షాపింగ్ తో కళకళలాడిపోయే ఆ వాతావరణం చాలా ముచ్చటగా ఉంటుంది. అది చూడటానికే వెళ్ళేది.
నేను అక్కడ మొత్తం కొనుక్కున్నవాటి వెల వెయ్యి రూపాయలు దాటి ఉండదు .. (చిరు తిండి తో సహా!) ... వంద రూపాయల గాజులు, యాభై రూపాయలకి మన ఆయుర్వేద కాటుక ని పోలిన సుర్మా (ఇది పెట్టుకుంటే కళ్ళు మండుతాయి కానీ కళ్ళకి మంచిది అట!), ఓ చిన్న అత్తరు సీసా, బాదుషా లాంటి ఏదో స్వీటు, మెరుపుల చెప్పులు ఓ జత, గాజు తో చేసిన రంగు రంగుల ఉంగరాలు (ఒక్కోటి ఐదు రూపాయలు) ... అన్నీ ఇలాంటివే. కానీ ఆ experience విలువ చాలా ఎక్కువ.
ఈ సారి రంజాన్ ఇలా సందడి లేకుండా జరుపుకోవలసి రావడం మా ఫ్రెండ్స్ ఏమో కానీ నేను తెగ బాధపడిపోతున్నాను. ఈద్ కి వారి పెద్దలు 'ఈదీ' అని పిల్లల చేతిలో బహుమతో, డబ్బో పెడతారు. నాకు ఈ సంప్రదాయం అంటే భలే ఇష్టం! రంజాన్ మాసాంతం లోపు అంతా బాగయిపోవాలనే కోరుకుంటాను.
నేను ఇప్పటి వరకూ రాసిన అనుభవాలు అమాయకమైనవే అయ్యుండొచ్చు.
మన మధ్య ఎన్నో చారిత్రక, రాజకీయ వైషమ్యాలు ఉండి ఉండవచ్చు. జీవన శైలి లో, చట్టాల్లో భేదాలు ఉండవచ్చు. ఒకరి ప్రపంచం ఇంకొకరికి అర్ధం అవ్వక పోవచ్చు.
నానా పాటేకర్ హిందీ సినిమా లో ఆవేశంగా ఓ ముస్లిం ఆయన చేతి వేలు, తన చేతి వేలు చితక్కొట్టేసుకొని, ఇద్దరి రక్తాలు కలిపేసి 'చెప్పు ... ముస్లిం రక్తమేదో .. హిందూ రక్తమేదో' లాంటి ఆవేశపూరితమైన డైలాగులు చెప్పడం వల్ల ఏ మార్పూ రాకపోవచ్చు.
కానీ చరిత్ర కొన్ని పాఠాలు నేర్పుతుంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఘోరాలు జాతి వివక్ష తోనే మొదలయ్యాయి అని గుర్తుంచుకోవాలి. మనుషులన్న వారందరికీ చెరగని మచ్చ - అప్పుడు జరిగిన అన్యాయాలు, హింస. ఎన్ని సినిమాలు, డాక్యుమెంటరీలు తీసినా, నవలలు, కథలు, కవితలు రాసుకున్నా తీరని పాపం అది.
ఆనీ ఫ్రాన్క్ డైరీ, ది బాయ్ ఇన్ స్ట్రైప్డ్ పైజామాస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (ఇటాలియన్ సినిమా) లాంటి వి చదివినప్పుడు, చూసినప్పుడు అసలు మామూలు మనుషులం కాలేం కొన్ని రోజుల వరకూ. అంత మనసు ని కలచి వేస్తాయి అవి. అదంతా కల్పనా కాదు నిజంగా జరిగిందే అనే ఆలోచనే నిద్రపట్టనివ్వదు ఎలాంటి వారికైనా.
ఇదే చరిత్ర ఇంకో పాఠం నేర్పుతుంది. ఇది నేను పర్సనల్ గా తెలుసుకోవలసినది. శాంతి శాంతి అన్న వాళ్ళనే ఎక్కువ హింస పెట్టేసారేంటో మనుషులు గతం లో. కేవలం 'కలిసుండండండ్రా బాబు' అన్నందుకు చంపేయబడిన వాళ్ళు బానే ఉన్నారు.
నాకేమో ఇంకొంత కాలం బ్రతకాలని ఉంది. ఆ విషయం ఇదంతా రాసే ముందే ఆలోచించుకోవలసింది అంటారా? ఏం చేస్తాం .. ఈ విషయం లో అందరం ఒకటే! మనమెవ్వరం చరిత్ర నుంచి ఏవీ నేర్చుకోము! 😄
రంజాన్ శుభాకాంక్షలు!

చార్మినార్ ఎదురుగా పాత కొత్తలకి కాంట్రాస్ట్ గా ఓ కెఫె కాఫీ డే ఉంటుంది .. అక్కడి నుంచి వ్యూ ఇది (2017 నాటి పిక్) |

బాగా రాశారు మేడం . మీ అనుభవాలు నుండి మీరు రాశారు . నిజం చెప్పాలంటే ,నా లాంటి సామాన్యులకి ముస్లిమ్స్ మీద , చంపేయాలి అనే అంత కక్షలు లేవు , కలిసిపోవాలి అనే అంత ప్రేమలు కూడా లేవు . ఈ దేశపు పౌరులే కదా . మన దేశం లో భిన్న కులాలు ఉన్నాయి కులం వేరని జనం కొట్టేసుకోవడం లేదు కదా , అలానే ఇది కూడా. హైదరాబాద్ ఎప్పుడు చూడని మా అనుభవాలని ఒకసారి ఊహించండి . దైనందిన జీవితం లో ఈ "వేరు " అనేది ఎక్కడో ఓచోట వస్తుంది , ఎంత ఒరేయ్ అనుకున్నా, అన్నయ్య, వదిన అని పిలుచుకున్న మీరు మేము వేరు అనేది ఖఛ్చితంగా వస్తుంది , కులాలు వేరు , మతాలు వేరు అనే స్పృహ వస్తుంది , ఇదేమి ఆశ్చర్యపోయే, ఖిన్నులైపోయే అంత విషయమేమి కాదు , ఊళ్లలో ఇది మాములు విషయం . మీరు మేము అనే మాట్లాడతారు . కోపం తో కాదు , అత్యంత మాములుగా ...
ReplyDelete:venkat
చక్కటి వ్యాసం.
ReplyDeleteనగర, రాష్ట్ర, దేశ, ప్రపంచ సమస్త మానవాళికి రమదాన్ శుభాకాంక్షలు. ఈద్ వరకు సంక్లిష్టం తొలిగిపోవాలని ఆశిద్దాం.