రొటీన్ కి భిన్నం గా ...
నేనేంటో సరదాగా సినిమా చూడలేను ...
ఏ స్టైల్ బట్టలు వేసుకోవాలో ముందే ఆలోచించుకొని అలాంటివి ఎక్కడ దొరుకుతాయో రీసెర్చ్ చేసి, వీలైతే ట్రై చేసి, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని, బడ్జెట్ కి కరెక్ట్ గా ఫిట్ అయ్యేవే ఎలా సెలెక్ట్ చేస్కుంటానో సినిమాల కి కూడా అంతే ప్రాసెస్ ఫాలో అవుతాను. (నోట్ టు సెల్ఫ్: నేను అసలు ఏ పనైనా సరదాగా, లైట్ గా చేస్తానా? ఆలోచించాలి.)
దీన్ని పర్ఫెక్షనిజం అనచ్చు, చాదస్తం అనచ్చు... కానీ నిజం ఏంటంటే నాకు నచ్చని సినిమాలు భరించే/సహించే శక్తి తక్కువ. కొంతమంది లైట్ గా ఏదైనా చూసి వచ్చెయ్యగలరు. ఇదో సూపర్ పవర్ నా ఉద్దేశం లో. నాకది లేదు కాబట్టి, ముందు ఆ సినిమా ట్రైలర్ చూసి, కథ తెలుసుకొని, ఇంటర్వ్యూలు చూసి, ఒక్కోసారి నేను ఎవరి అభిప్రాయాలని గౌరవిస్తానో వాళ్ళు కూడా స్టాంప్ వేసాక గానీ నేను ఓ సినిమా చూడను. ఈ లోగా కొత్త సినిమా అయితే థియేటర్ లోంచి వెళ్ళిపోతుంది అనే భయం అక్కర్లేదు .. ఇన్ని ఫిల్టర్ లు దాటిన సినిమా ఆడుతూ ఉంటుంది ఇంకా థియేటర్ల లో. అప్పుడు వెళ్లి చూస్తాను. పాత సినిమా అయితే అది వెబ్ ప్లాట్ఫారం లో వచ్చాక చూస్తూ ఉంటాను. ఇలా చూసిన సినిమాలన్నీ పూర్తిగా ఎంజాయ్ చేసాన్నేను.
ఒకటి రెండు సందర్భాల లో మొహమాటం కోసం సినిమాలు చూడాల్సి వచ్చింది. అందులో ఒకటి మంచిదే కానీ నాకు థియేటర్ లో నచ్చలేదు ఆ సినిమా.. తర్వాత మళ్ళీ చూసా .. పర్సనల్ గా .. అప్పుడు చాలా నచ్చింది. ఇంకో సినిమా నా సహనానికి పరీక్ష పెట్టింది. ఇంకేం చెయ్యడానికి తోచక ఆ రోజు థియేటర్ లో ఎప్పుడూ తిననంత పాపకార్న్, ఎప్పుడూ తాగనంత కోక్ తాగేసాను .. అదే ఆఖరు ... ఇంకెప్పుడూ మొహమాటానికి సినిమా చూడలేదు.
సినిమా ఎంత మాస్ మీడియమో అంతే పర్సనల్ మీడియం అని అనిపిస్తుంది నాకు. అందరూ సినిమా ఒకేలా చూడరు. వాళ్ళకి అందులో ఏదో ఒక పాయింట్ నచ్చుతుంది .. అది వాళ్ళు అనుభవించింది అయ్యుండచ్చు, ఇంకేదైనా విధంగా వారిని తాకి ఉండచ్చు. అప్పుడే ఓ సినిమా ఒకరి ఫేవరేట్ సినిమా అవుతుంది.
అలాంటి సినిమాల లిస్ట్ మనందరి దగ్గరా ఒకటి ఉంటుంది. నా లిస్ట్ లో ఓ సినిమా గురించి ఈ రోజు.
1993 లో ఓ ఇంగ్లీష్ సినిమా వచ్చింది.... దాని పేరు 'గ్రౌండ్ హాగ్ డే' Groundhog Day
నేను చూసింది మాత్రం 2012 తర్వాత ఎప్పుడో. ఎప్పుడు, ఎక్కడ, ఏ మాధ్యమం లో చూశానో గుర్తులేదు కానీ సినిమా మాత్రం గుర్తుండిపోయింది. దాని కథ అలాంటిది!
(ఆ సినిమా డైరెక్టర్ (Harold Ramis), రచయిత (Danny Rubin) ... వీళ్ళ సినిమాలు నాకు అంతగా పరిచయం లేవు. ప్రధాన తారాగణం అయిన బిల్ మర్రే (Bill Murray), ఆండీ మెక్ డవెల్ (Andie McDowell) వి ఒకటి రెండు సినిమాలు చూసా అంతే.)
ఇదో ఫాంటసీ కామెడీ.
'ఫిల్' అనే వ్యక్తి అమెరికా లో పెన్సిల్వేనియా రాష్ట్రం, పిట్స్ బర్గ్ లో ఓ న్యూస్ ఛానల్ లో వెదర్ మాన్ (వాతావరణ నిపుణుడు). పొగరు, సుపీరియారిటీ కాంప్లెక్స్, పని చేస్తున్న ఛానెల్ అన్నా, కొలీగ్స్ అన్నా చులకన. సినిమా ప్రారంభం లోనే ఓ మంచు తుఫాను వారి రాష్ట్రం తాకకుండా వెళ్ళిపోతుంది అని ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పేస్తాడు.
అదే రోజు ఆ రాష్ట్రం లో ఉన్న 'పక్సిటానీ' అనే చిన్న ఊరికి అతను, అతని ప్రొడ్యూసర్ 'రీటా', కెమెరామన్ 'లారీ' ముగ్గురూ ఓ ఈవెంట్ కవర్ చెయ్యడానికి బయల్దేరతారు.
ఆ మర్నాడే అంటే ఫిబ్రవరి 2 - గ్రౌండ్ హాగ్ డే. గ్రౌండ్ హాగ్ అంటే ఉడత జాతికి చెందిన ఓ జంతువు .. ఉడత కంటే పెద్దది గా ఉంటుంది. గ్రౌండ్ హాగ్ డే నాడు ఆ పల్లె వారందరూ ఒక చోట చేరతారు. వారి ఊరి ఉడత అయిన 'ఫిల్' (ఉడత పేరు కూడా ఫిల్ ఏ) ఆ రోజు తన కలుగు లోంచి బయటికి వస్తుంది. ఈ ఉడత తన నీడ తను చూస్కుంటే శీతాకాలం ఇంకో ఆరు వారలు కొనసాగుతుంది ... నీడ కనిపించక అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే వసంత ఋతువు త్వరగా రాబోతోందన్నమాట. ఇది అక్కడి వారి నమ్మకం.
ఇదంతా కల్పితం కాదు. పెన్సిల్వేనియా లో ఈ ఊరు ఉంది ... ఈ సంప్రదాయం ఉంది ... ఈ సినిమా తీసే ముందు మహా అయితే 2000 మంది ఈ వేడుక లో పాల్గొనేవారట ... సినిమా తర్వాత ఇదొక పర్యాటక కేంద్రం అయిందట!
ఇంతకీ ఫిల్ కి ఆ ఊరన్నా, ఈ సంప్రదాయం అన్నా చులకన. వాళ్ళని పల్లెటూరి బైతులంటాడు. అప్పటికే కొన్నేళ్లు నుంచి అతను ఇదే రోజున ఇదే ఈవెంట్ రిపోర్ట్ చేస్తూ ఉండటం అతనికి ఇంకా విసుగు పుట్టిస్తుంది. అతని ప్రొడ్యూసర్ రీటా చాలా మంచమ్మాయి. ఆ అమ్మాయి కి ఈ వేడుక అంత తమాషా గా అనిపిస్తుంది.
పొద్దున్న ఈ పని చూసేస్కోని ఇంకొక్క క్షణం ఆ పల్లెటూరు లో ఉండకుండా మళ్ళీ పిట్స్ బర్గ్ వెళ్లిపోవాలని ఫిల్ తాపత్రయం. సాయంత్రం వరకూ ఉండి మిగిలిన చిన్న చిన్న ఈవెంట్స్ కూడా కవర్ చేద్దామనే ఉత్సాహం లో ఉంటుంది రీటా.
ఫిల్ కి రీటా అంటే గౌరవం ఏ మాత్రం లేదు. పైగా అభ్యంతరకరంగా మాట్లాడుతుంటాడు కూడా. ఇతని గురించి బాగా తెలిసిన ఆమె మాత్రం అతని వెకిలి మాటలు భరిస్తూ, అతని పొగరు సహిస్తూ ప్రొఫెషనల్ గా ఉంటుంది.
సరే, తెల్లారుతుంది .. ఫిబ్రవరి 2, గ్రౌండ్ హాగ్ డే ... అలారం మోగుతుంది .. ఎఫ్ ఎం రేడియో మొదలవుతుంది ... ఆ రోజు విశేషం గురించి ఇద్దరు ఆర్జే లు మాట్లాడుతుంటారు, ఫిల్ లేచి తయారయి ఈవెంట్ జరిగే చోటుకి బయల్దేరతాడు ... దారి లో ఇద్దరు ముగ్గురు తటస్థ పడతారు .. రూమ్ బయట ఒకాయన సరదాగా ఏదో అంటాడు, హోటల్ హోస్టెస్ ఆత్మీయంగా ఏదో మాట్లాడుతుంది ... ఓ చిన్నప్పటి ఫ్రెండ్ కలుస్తాడు (ఇతను గుర్తుపట్టడు అతన్ని), ఓ బిచ్చగాడు కనిపిస్తాడు (అతనికి ఇతనేం ఇవ్వడు) ... ఈవెంట్ జరిగే చోటుకి వెళ్లి వ్యంగ్యం గా ఓ రెండు మాటలు చెప్పి రిపోర్ట్ పూర్తి చేస్తాడు. వెంటనే తిరిగి వెళ్లిపోవాలని బయల్దేరతారు కానీ ఏ మంచు తుఫాను తమ రాష్ట్రాన్ని తాకదని చెప్పాడో దాని వల్ల హైవేలు మూసివేయబడతాయి. మళ్ళీ పల్లెటూరి కి తిరిగి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇతని ఆటిట్యూడ్ ఇంకా పెంకి గా ఉంటుంది ఆ పరిస్థితిలో.
మొత్తానికి ఆ రోజు అయిందనిపిస్తాడు. మర్నాడు అలారం మోగుతుంది. ఎఫ్ ఎం రేడియో మొదలవుతుంది ...ముందు రోజు విన్న మాటలే మళ్ళీ వస్తూ ఉంటాయి .. నిన్నటి టేప్ ప్లే చేస్తున్నారేమో అనుకుంటాడు ... అన్నీ సరిగ్గా ముందు రోజు జరిగినట్టే జరుగుతాయి. మళ్ళీ ఆ వ్యక్తులే తటస్థ పడతారు ... అవే పలకరింపులు ... అవే మాటలు ... కలగంటున్నాడా లేక ఇదంతా నిజమా అనే అయోమయం లో ఆ రోజు గడిచిపోతుంది. తెల్లవారుతుంది. అలారం మోగుతుంది. మళ్ళీ అవే మాటలు రేడియో లోంచి.
ఇలా అతను గ్రౌండ్ హాగ్ డే ని లెక్కలేనన్ని సార్లు గడుపుతూ ఉంటాడు.
ముందు కొన్ని రోజులు అయోమయం లో ఉంటాడు. తర్వాత అతనికి అనిపిస్తుంది ... రోజు రీసెట్ అయిపోతోంది అంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని. దొంగతనాలు చేస్తాడు, అరెస్ట్ అవుతాడు, ఓ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ ఓ సారి కనుక్కుంటాడు .. ఇంకోసారి రోజు రీప్లే అయిపోయినప్పుడు ఆ అమ్మాయి తనకి ఎప్పటినుంచో తెలిసినట్టుగా మాట్లాడి ఆమెని బుట్టలో పడేస్తాడు.
ఇదే టాక్టిక్ రీటా మీద కూడా ఉపయోగిస్తాడు .. ఆమెని డేట్ కి తీసుకెళ్లి ఒక్కోసారి ఒక్కో తప్పు చేసి మళ్ళీ డే రీప్లే అయినప్పుడు ఆ తప్పు సవరించుకొని స్టెప్ బై స్టెప్ ఆమె కి దగ్గరవుదామనుకుంటాడు. ఒక స్టేజి వరకూ ఈ పన్నాగం పారుతుంది కానీ ఆ అమ్మాయి కి ఇతనిది ప్రేమ కాదు అని తెలిసిపోతూ ఉంటుంది.... ప్రతి సారి. ఆమె చేతిలో కొన్ని వందల చెంప దెబ్బలు తింటాడు. ఆమె కి నిజం చెప్తాడు ఓ రోజు .. తను చిక్కుకున్న టైం లూప్ (సమయ వలయం) గురించి .. ఆమె అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తుంది కానీ మళ్ళీ మర్నాడు అంతా మామూలే. కానీ ఆమె వ్యక్తితం పూర్తిగా తెలుసుకున్న అతనికి ఆమె అంటే ప్రేమ ఏర్పడుతుంది.
ఇక్కడి నుంచి అతనికి అలుపొచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ అదే రోజు .. అదే ఊరు, అవే సంఘటనలు .. ఇలా కాదని ఓ సారి ఆ ఉడత ని తీస్కొని కారు ని ఓ కొండ మీదనుంచి కిందకి క్రాష్ చేసేస్తాడు. కారు నిప్పంటుకొని కాలిపోతుంది. అతను చనిపోతాడు. కానీ మళ్ళీ మర్నాడు అలారం మోగే అప్పటికి మళ్ళీ బతుకుతూ ఉంటాడు.
చాలా సార్లు ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నిస్తాడు. కానీ మళ్ళీ మర్నాడు బ్రతికే ఉంటాడు.
ఇంక ఆత్మహత్య పనికి రాదని తెలిసి అతనిలో ఏదో మార్పు మొదలవుతుంది. ఓ పియానో టీచర్ దగ్గరకి వెళ్లి పియానో లెసన్స్ నేర్చుకోవడం మొదలుపెడతాడు, మంచు శిల్పాలు చేయడం నేర్చుకుంటూ ఉంటాడు, తనకి ఇన్ని రోజుల్లో తెలిసిన సమాచారాన్ని మంచి కి ఉపయోగించడం మొదలుపెడతాడు .. వృద్ధ మహిళల కారు టైర్ రిపేర్ చేస్తాడు, ఒక పిల్లవాడు చెట్టు మీద నుంచి పడిపోయే సమయానికి కింద ఉండి పట్టుకుంటూ ఉంటాడు, ఒకాయన కి హార్ట్ అటాక్ రాబోతోందని ముందే తెలుసు కాబట్టి అతని ప్రాణం కాపాడతాడు ...
అతని చిన్న నాటి మిత్రుడి తో మునుపటి లాగా కాక ఆత్మీయంగా మాట్లాడతాడు ... అతను ఇన్సూరెన్స్ ఏజెంట్ అని తెలిసి అన్ని ఇన్షురెన్సులు కొనేస్తాడు... పియానో అద్భుతంగా వాయించేస్తూ ఉంటాడు, మంచు శిల్పాలు చేయడం లో కూడా చేయి తిరిగిపోతూ ఉంటుంది అతనికి .... అదే రోజు మళ్ళీ మళ్ళీ జీవించినా దాన్ని ఎంత బాగా జీవించవచ్చో తెలుసుకుంటాడు.
కాకపోతే ఇన్ని పనులలో రెండు అతను కంట్రోల్ చెయ్యలేకపోతాడు. ఒకటి, రీటా తనని ప్రేమించేలా చేయలేకపోతాడు. తను డబ్బులివ్వని బిచ్చగాడి మరణం ఆపలేకపోతాడు ... అప్పటికీ అతన్ని ఓ సారి ఆసుపత్రి లో జాయిన్ చేస్తాడు, తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తాడు, హోటల్ కి తీసుకెళ్లి కడుపు నిండా వేడి వేడి ఆహరం పెట్టిస్తాడు.... ఎన్ని చేసినా ఆ బిచ్చగాడు ఆ రాత్రి మరణిస్తూనే ఉంటాడు.
తన అదుపు లో లేని సమయం అతనికి acceptance, వినయం నేర్పిస్తుంది. కళ సహనం నేర్పిస్తుంది. ఆ బిచ్చగాడి మరణం జీవితం గురించి నేర్పిస్తుంది.
ఇప్పుడు ఫిల్ పూర్తిగా మారిన మనిషి. ఈ సారి రిపోర్టింగ్ కి వెళ్ళే అప్పుడు లారీ కి, రీటా కి వేడి వేడి కాఫీ (వాళ్ళకి నచ్చినది), స్నాక్స్ తీసుకెళ్తాడు. అదే రిపోర్ట్ ఎంతో భావుకత్వం తో చెప్తాడు. రీటా, లారీ ల తో గౌరవం గా మాట్లాడతాడు. 24 గంటల్లో ఈ మార్పు ఏంటని ఇద్దరూ ఆశ్చర్యపోతారు.
రీటా అతని తో రోజంతా గడుపుతుంది. అతను ఆమె ని ఇంప్రెస్ చెయ్యడానికి ప్రయాస పడడు. ఆమె రూపం తో ఓ మంచు శిల్పం చేస్తాడు. 'రేపు ఎలా ఉన్నా, ఈ రోజు నేను ఆనందంగా ఉన్నాను ... ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాను' అంటాడు. అతని లో మొదటి సారి నిజాయితీ చూస్తుంది రీటా. ఇద్దరూ ఫిల్ హోటల్ రూమ్ కి వెళ్తారు. కబుర్ల తో నే రాత్రి గడిచిపోతుంది. అతను అలిసిపోయి నిద్రపోతాడు.
తెల్లవారుతుంది ... అలారం మోగుతుంది .. ఈ సారి ఆర్జే మాటలు మారతాయి .. అతను పక్కన చూస్తే రీటా పడుకొని ఉంటుంది .. అతనికి అర్ధం అవుతుంది ... తాను ఆ వలయం నుంచి బయటికి వచ్చేసా అని. ఆ పల్లెటూరి లో నే ఆమె తో ఉండిపోవాలని ఉంది అని ఫిల్ చెప్పడం తో సినిమా ముగుస్తుంది.
నాకు ఇష్టమైన సినిమాల టాప్ టెన్ లో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా చూసే నాటికి నేను కూడా ఓ టైం లూప్ లో ఉన్నా అనిపించేది నాకు. అసలు టైం లూప్ అంటూ ఒకటి ఉంటుందని ... జీవితం నిస్సారమైనప్పుడు అలా అందరికీ అనిపిస్తుందని ... అలాంటప్పుడు జీవితం లో మళ్ళీ సారం నింపడం మన చేతిలోనే ఉందని ఈ సినిమా చెప్పింది నాకు. నన్ను పూర్తిగా ఇంప్రెస్ చేసిన పాయింట్ మాత్రం ఫిల్ పియానో, శిల్ప కళ నేర్చుకోవడం ... కళలు సాధన చేసిన వారికే తెలుస్తుంది ఈ పాయింట్.
జీవితం లో ఖాళీ ని కళ చాలా బాగా పూరిస్తుంది .. ఓ కళ ని సాధన చెయ్యాలంటే కొన్ని గంటల సమయం అవసరం ... పైగా ఆ సమయం భారీ గా కాక తన లో పూర్తి గా లీనమయ్యే లా, ప్రపంచాన్ని, చుట్టూ ఉన్న దుర్భర పరిస్థితులని మర్చిపోయేలా చేయగలదు కళ.
అలాగే పక్కవారికి సాయపడటం .. ఇది కూడా కళ లాంటిదే ... మన జీవితానికి మనకే తెలియని సార్ధకత చేకూరుస్తుందిది.
చివరికి అతను 'నేడు' లోనే జీవించాలని తెలుసుకుంటాడు ... అది ఇంకో అందమైన కోణం.
ఈ సినిమా తర్వాత ఈ పేరు నే రొటీన్ లైఫ్ కి మారుపేరు గా ఉపయోగించడం మొదలుపెట్టారట!
బోర్ కొడుతున్న జీవితాలన్నీ గ్రౌండ్ హాగ్ డేస్ ఏ అయితే, ఆ వలయం నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలో తెలుసు కదా?

No copyright infringement intended |

ఇంగ్లీష్ సినిమా లు ఆన్లైన్ లో ఎక్కడ చూడాలి మేడం ? ఉచితంగా లేదా కాస్త తక్కువ ఛార్జ్ లతో ఉండే వెబ్ ప్లాట్ఫామ్ ఏమైనా ఉన్నదా ?
ReplyDeleteఉచితంగా లేదా కాస్త తక్కువ ఛార్జ్ లతో ఉండే వెబ్ సైట్లు
ReplyDeleteudu.com and imdb.com
మీరు ఒక పని చేయండి. https://archive.org/details/movies అనే సైట్‍కు వెళ్ళండి. అక్కడ బోలెడన్ని సినిమాలు - ఇంగ్లీషువి ఉన్నాయి. మీకు కావలసిన వాటిని డౌన్‍లోడ్ చేసుకొని చక్కగా చూడండి. మీకు వీలుగా ఉంటే తిన్నగా అక్కడే play చేసుకొని చూడవచ్చును.
Delete