మన 'చేతిలో' పని
అబద్ధానికి అనంతమైన అవతారాలు ఉన్నాయి. వాటిలో ఒకటి 'ఫేక్ న్యూస్' .. నకిలీ వార్త.
సాంప్రదాయ వార్తా మాధ్యమాల లో నకిలీ వార్తల గురించి నేను మాట్లాడను.
మన ఇన్వాల్వ్ మెంట్ ఉన్న, మన అదుపు లో ఉన్న సామాజిక మాధ్యమాల గురించే మాట్లాడతాను. అది కూడా మన దైనందిన జీవితానికి సంబంధించిన, మన సామరస్యాన్ని, శాంతిని, మనశ్శాంతి ని ప్రభావితం చేసే విషయాలు... వీటి గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాను. వెరిఫై చేసుకోకుండా వారు నమ్మి .. పక్క వారికి సరఫరా చేస్తున్న ఈ తప్పుడు సమాచారవాహిని ని విని, కంగారు పడి.. రీసెర్చ్ చేసి .. కాదని తెలుసుకొని .. చివరికి వారిని బ్లాక్ చేసిన అనుభవం తో ఇది రాస్తున్నాను.
మనం రోజూ చదువుతున్న, ఫార్వార్డ్ చేస్తున్న సమాచారం లో ఫేక్ న్యూస్ ల ఉధృతి నన్ను ఆశ్చర్యపరిచింది.
బ్యాంకు, ఏటీఎం వ్యవహారాలు, ఆధార్ కార్డు ఈ ఫేక్ న్యూస్ ఫేవరేట్ టాపిక్స్. మొన్న జరిగిన నోట్ల రద్దు అప్పుడు అయితే ఈ ఫేక్ న్యూస్ లకి పండగే పండగ! (రెండు వేల రూపాయల్లో చిప్పు వార్త గుర్తుందా?)
కొన్ని ఫేక్ న్యూస్ అంత ప్రమాదకరమైన వి కావు.
ఫేస్ బుక్ మీ డేటా అంతా వాడేయబోతోంది... అలా వాడకుండా ఉండాలి అంటే 'ఏయ్ .. నువ్వు వాడద్దు' (exactly ఈ మాటల్లో కాదు .. ఏదో ఇంగ్లీష్ లో మేటర్ ఇచ్చార్లెండి) అని స్టేటస్ లో పెట్టండి అని ఆ మధ్య ఓ పోస్టు వైరల్ అయింది. నేను కూడా నా స్టేటస్ మార్చాను ఇది చదివి. తర్వాత గూగుల్ చేస్తే ఇది ఫేక్ అని తేలింది. నేను ఎంబరాస్ అయ్యాను. చదువు, వివేకం ఉండీ అలా ఎలా నమ్మేశా అని! (ఆ తర్వాత ఎవరైనా నాకు ఇలాంటివి ఫార్వర్డ్ చేస్తే వాళ్లకి దీని గురించి చెప్తూ ఉంటాను.)
మన జాతీయ గీతాన్ని అన్ని దేశాల జాతీయ గీతాలలోకి బెస్టు గా పరిగణించి యునెస్కో అవార్డు ఇచ్చింది అని ఇంకో ఫేక్ న్యూస్. మనోళ్లు చాలా మంది ఇది విని గర్వపడిపోయేసారు... అనవసరంగా.
ముందే చెప్పినట్టు గా ఇవన్నీ అంత ప్రమాదకరమైనవి కావు. మహా అయితే మన ఈగో హర్ట్ అవుతుంది అంతే.
కానీ కొన్ని న్యూస్ లు జనాల్లో భయాన్ని, ద్వేషాన్ని, హింస ని రగిలించేలా ఉంటాయి. కొన్ని అవమానజనకంగా ఉంటాయి. (ఒక్క సారి ఫేక్ న్యూస్ గురించి గూగుల్ చెయ్యండి .. ఇది ఎంత పెద్ద సమస్యో తెలుస్తుంది!)
నిజం చెప్పులేసుకొనే లోపు అబద్ధం ప్రపంచం చుట్టొచ్చేస్తుందనే ఓ సామెత ఉంది. ఇదే జరుగుతుంది. అసలైన వార్త 'నేనే నిజమైన వార్త'నని పాపం గొంతు చించుకొని చెప్పాల్సి వస్తుంది. అదీ ఏ కొద్దిమందికో వినిపిస్తుంది. ఒక్కోసారి అప్పటికే జరగకూడని అనర్ధాలు జరిగిపోతుంటాయి.
ఇప్పుడు సామజిక మాధ్యమాల యజమాన్యాలన్నీ ఈ విషయం లో మేల్కొంటున్నాయి.
ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో వాట్సాప్ గ్రూప్ పెట్టాలంటే పోలీసు అధికారి దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి అనే రూల్ పెట్టారు. అలాగే మధ్యప్రదేశ్ లోని భిండ్ ప్రాంతం లో కేవలం పాత్రికేయులు పెట్టే వాట్సాప్ గ్రూపులు రిజిస్టర్ చేసుకోవాలని మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారు. ఈ ఫార్వార్డ్ ఆ రాష్ట్రంతో ఆగకుండా దేశం అంతా వ్యాప్తి అయిపోయి మా ఇంటిక్కూడా వచ్చేసింది. అది కూడా అక్టోబర్ పదిహేను లోపు అనే లాస్ట్ డేట్ తో సహా. అలాంటిదేమీ లేదని క్లారిఫై చెయ్యాల్సి వచ్చింది!
నాకనిపిస్తుంది ఈ నకిలీ వార్తలు సృష్టించేవారు మన సైకాలజీ మీదే ఆడుకుంటారని.
మనందరి లో లుప్తంగా ఉండే భయాలు, డబ్బాశ, మతోన్మాదం, జాత్యహంకారం, prejudices, కామోద్రేకాలు, ఒకడు పడిపోతే ఆనందించే సేడిజం... civic illiteracy ... చదువు రాకపోవడం కాదు .. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఓ డెమోక్రసీ లో ఎలా మెలగాలో తెలియనితనం ... ఇవి ఫేక్ న్యూస్ బీజాలకి సారవంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి.
ఈ ఫేక్ న్యూస్ లకి మనం కేవలం బాధితులం మాత్రమే కాదు. వాట్సాప్, ఫేస్ బుక్ లు వచ్చాక మనందరం ఈ క్రైమ్ లో భాగస్వాములం అవుతున్నాం.
ఇది క్రైమే. డౌట్ లేదు. ఒక అబద్ధం ఎంత హాని చేస్తుందో అనే స్పృహ లేకుండా ఆ అబద్ధాన్ని వ్యాప్తి చెయ్యడం నేరమే కదా?
అది చిన్నదైనా, పెద్దదైనా.
డెమోక్రసీ లో అతి బలవంతమైన శక్తి జనమే. మనమే.
మన చైతన్యం చాలా మార్పులు తీసుకొస్తుంది.
ఇది అక్షరాలా మన 'చేతిలో' పని.
పొద్దున్న లేస్తే మనకి వచ్చే వాట్సాప్/ ఫేస్బుక్ ఫార్వార్డ్ లు మనం ఇంకొకరికి ఫార్వార్డ్ చేసే ముందు 'ఇది నిజమేనా' అని రూఢి చేస్కోవడం. దీనికి గూగుల్ ఉండనే ఉంది.
అంత టైం లేకపోతే అసలు ఇంకొకరికి మన వైపు నుంచి ఫార్వార్డ్ చెయ్యకపోవడం. మరిన్ని వివరాలకి పై బొమ్మ చూడుడి.

వాట్సాప్ సంస్థ పత్రికలకి విడుదల చేసిన ప్రకటన |

మా అమ్మాయికూడా మీ టైపేనండి. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటే, రేపటినుంచి తర్వాతి పుట్టినరోజుకోసం కౌంట్ డౌన్ మొదలుపెడుతుంది. మీ పోస్టులు, శైలి బాగున్నాయి, హాస్యస్ఫోరకంగా ఉన్నాయి. BTW, belated HBD wishes!
ReplyDelete