స్వాభినందన మందార మాల
కొందరి మాటలు వింటున్నప్పుడు .... చెవి లోపల నొప్పి కాదు కానీ బయట కి కనిపించే చెవి దొప్పలు నొప్పి రావడం ఎప్పుడైనా అనుభవించారా? అది ఎవరూ ఎప్పుడూ అనుభవించకూడదనే ఆశిస్తాను. ఇలాంటి అనుభవాలు అయ్యాయి నాకు. అన్ని సార్లూ ఒకే కామన్ పాయింట్... ఎవరు మాట్లాడగా అయితే నేను వింటున్నానో వారు ఒకటే స్వోత్కర్ష! గంటల తరబడి!
ముందు పావు గంట "అలాగా! భలే! చాలా మంచి విషయం" అని మనస్ఫూర్తి గానే అభినందించాను. అది అగ్ని లో ఆజ్యం పోసినట్టయింది. ఇంక వారు ఆపే ప్రయత్నం చెయ్యలేదు.
రెండో సారి అయితే మరీ అన్యాయం ... ఓ పర్సనల్ ట్రాజెడీ మధ్య మొదలెట్టేసారో వ్యక్తి ఈ ధోరణి!
ఈ వ్యక్తులు చిన్న పిల్లలేమీ కారు ..
ఒక వ్యక్తి తాను ఎంత అదృష్టవంతులో .... అన్నీ తనకి ఎలా కలిసొచ్చేసాయో ... సొంతిల్లు జేబులో వంద రూపాయలుండగా ఎలా కొనగలిగారో ఇలా చెప్పుకొస్తే ... ఇంకొక వ్యక్తి తాను ఆఫీసులో ఎంత బాగా పని చేస్తానో ... అందరూ తనని ఎలా పొగుడుతారో చెప్పుకుంటూనే ఉన్నారు.
ముందే చెప్పినట్టు, నా వయసు వాళ్ళు, ఒకే చోట కూర్చొని జీవితం లో విజయాలు షేర్ చేసుకొనే సందర్భం అయితే ఎందుకు వినం ... ఎందుకు ఆనందించం? కానీ సమయం, సందర్భం చూస్కోకుండా ... మంచి మర్యాద ఎంచకుండా ... వింటున్నారు కదా అని (ఒక్కో సారి అది పట్టించుకొనే పరిస్థితి కూడా లేదు... వినాల్సి వచ్చే పరిస్థితి లో పట్టేసుకోవడం ... బస్సులో కలిసి ప్రయాణించే అప్పుడో .. అలా అన్నమాట .. దిగి పారిపోలేనట్టుగా!)... మన కంటే అనుభవం లో, వయసు లో చిన్న వారితో మన గొప్పలు చెప్పేసుకుంటూ పోవడం ఎంత అన్యాయం!
విని అనుభవించిన పిల్ల గా నేను వారిని క్షమిస్తానో లేదో తెలియదు కానీ ఈ ప్రవర్తన, ఈ నైజం చాలా మందిలో చాలా సార్లు చూసాక ఓ అనధికారిక మానవ ప్రవర్తనా విశ్లేషకురాలి గా నా బుర్ర లో కొన్ని చక్రాలు తిరిగాయి.
ముందు వీరి లిస్టు లోంచి ఇగోయిస్టులని తీసేద్దాం ... వారికెలాగూ వారే ప్రపంచం .... ఈ కాంతి మండలం సూర్యుడి చుట్టూ కాక వారి చుట్టే తిరుగుతుందని వారి ప్రబల విశ్వాసం. వారు నోరు తెరిచినప్పుడల్లా వారి గురించే మాట్లాడుకుంటారు. వారిని విశ్లేషిస్తే ... అసలు ఇగోయిస్టులు గా వారెందుకు అయ్యారు అనే దోవ లో పోవాలి. అది మన ప్రస్తుత విషయానికి అప్రస్తుతం.
సహజంగా ఇగోయిస్టులు కాని వారు మనిషి కనిపిస్తే పట్టుకొని తమ డబ్బా కొట్టేసుకుంటున్నారు... పైగా ఎందరికి తమ గురించి చెప్పినా తనివి తీరట్లేదు. ఎందుకు?
వీరి లో కష్టసుఖాలు రెండూ పంచుకొనే వారిని తీసేద్దాం ... అసలు వీరికి పాపం మాట వినేవారే కరువయిపోయారన్నమాట. అందుకే ఎవరు దొరుకుతారా మాట్లాడటానికి అని చూస్తున్నారు. హమ్మయ్య వీళ్ళని కూడా విశ్లేషించేసాం.
ఇంక మిగిలింది .. కేవలం తమ ప్రతిభా పాటవాలని, ఘనకార్యాలని, తాము చేశామనుకుంటున్న గొప్ప పనులని గురించి మాత్రమే మాట్లాడేవారు.... అది కూడా సేమ్ మ్యాటర్ మళ్ళీ మళ్ళీ అందరితో (కేవలం నాతోనే కాకుండా అన్నమాట.)
నా చెవి దొప్పలు నొప్పి పుట్టక ముందు నేను విన్నంత వరకూ వీరు అబద్ధాలు చెప్పట్లేదు ... వీరి ఘనకార్యాలు రోజూ వారీ జీవితం లో జరిగేవే ... ఓ కస్టమర్ వస్తే ఎవరూ హెల్ప్ చెయ్యకపోతే తాను ముందుకెళ్లి హెల్ప్ చేసి అతనికి ఆనందం కలిగించారొకరు. ఇంట్లో పెద్దగా సరుకులు లేకపోయినా హఠాత్తుగా వచ్చిన అతిథులకు కడుపు, మనసు నిండా భోజనం పెట్టి పంపించారొకరు, తమ చిట్టి జీతం తో ఉద్యోగం వచ్చిన కొత్తలో చేసిన ఓ గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఫలాలు నేడు అనుభవిస్తున్నారొకరు ...
అసత్యాలు కావు. అతిశయోక్తులు కూడా కావు. అసందర్భాలు.. అననుగుణాలు (inappropriate అనే మాట కి తెలుగు ఇదేనా?) అంతే.
భూకంపానికి ఓ కేంద్ర బిందువు ఉన్నట్టే వీరి స్వోత్కర్ష కి ఓ మూలం ఉందని నాకనిపించింది. మనోవ్యాధులు వేరు, మనోవికారాలు వేరు. మనోవ్యాధులు లోతైనవి .. ఒక్కోసారి పుట్టుకతో సంక్రమించేస్తాయి. కానీ మనోవికారాలు మన పెంపకం, మన చుట్టూ ఉన్న సమాజం, దాని ప్రభావం .. కుటుంబం ... వీటి వల్ల కలుగుతాయి. కొంత మంది ఎడతెగని స్వోత్కర్ష మనోవికారమే అయితే దాని మూలం - మెచ్చుకోలు లేకపోవడం.
మనందరం పెద్దోళ్ల లా నటిస్తున్న చిన్నపిల్లలం అన్నారొక గొప్ప వ్యక్తి. అది నిజం అనిపిస్తుంది వీళ్ళని చూస్తే.
అరవై ఏళ్ళ కి కూడా తను జీవితం లో సాధించిన ఎన్నో చిన్న, పెద్ద ఘనకార్యాలు ఎవరికి చెప్పుకోవాలి .. ఎలా ప్రశంస పొందాలి అని ఆరాట పడేవారిని చూసి ఇంకేమంటాం చెప్పండి?
చిన్నప్పుడైతే ఓ పిచ్చి బొమ్మ వేసి అమ్మ కి పరిగెత్తికెళ్ళి చూపిస్తే 'మా బాబే! ఎంత బాగా వేసావురా!!!' అని ఆవిడ ఆనందపడిపోయి .. ఇప్పటి తల్లయితే ఇన్స్టా గ్రామ్ లో పెట్టేసి హాష్ టాగ్ మా చిన్నారి పికాసో అని రాసేసి ఆ బొమ్మ కి ఓ పటం కట్టించి ఇంట్లో గోడ మీద తగిలించేసేది! ఆ వయసు లో అనుభవించిన సత్కారం, గుర్తింపు, మెచ్చుకోలు ఇంక జన్మలో దొరకదు ... మూడు దాటి నాలుగు వయసు వచ్చిందా .. 'ఇంత పెద్దదానివయ్యావు .. ఇది చెయ్యలేవా' అనే మాటలే వింటూ పెరుగుతాం. ఈ నాలుగేళ్ళ చంటి వాడికో చంటి దానికో చెల్లో తమ్ముడా పుడితే బాల్యం ముగిసి పేరెంట్ హుడ్ మొదలైపోతుంది పాపం వీళ్ళకి!
కానీ జీవితం లో మనం సాధించేవి ఆ వయసు తో ముగిసిపోవు. మొదటి అడుగు, మొదటి అక్షరం, మొదటి 'మొదటి ప్రయిజు' ... ఇవి దాటాక ఇంకా ఎన్నో ఉంటాయి .. మొదటి ఉద్యోగం ... మొదటి విదేశీ ప్రయాణం.. మొదటి దీర్ఘకాలిక అప్పు తీర్చడం .. మొదటి ఐదు/ఆరంకెల సంపాదన ... ప్రేమ ని గెలిపించుకుని జీవిత భాగస్వామి ని ఎంచుకోవడం ... అనుకున్న కొన్ని నిర్ణయాలకు కట్టుబడి ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ ఉండటం ... కుటుంబ శాంతి కోసం చిన్న చిన్న త్యాగాలు, పెద్ద పెద్ద త్యాగాలు, ఇంట్లో ఆరోగ్యం బాగాలేని పెద్దవారిని కంటికి రెప్ప లా చూసుకోవడం, కాన్సర్ లాంటి రోగాలని జయించడం, పిల్లల జీవితం లో తాము తీసుకున్న మంచి నిర్ణయాలు, ఉద్యోగస్తులు గా, గృహిణి /గృహస్థు గా .. గుప్తదానాలు చేసే మంచి మానవుడిగా .. కులమత భేదం మనసులోకి రానివ్వని మంచి మనిషి గా .. మిత్రుల మధ్య వివాదాలు తీర్చి దానికి క్రెడిట్ కూడా తీస్కోని మంచి స్నేహితులు గా ... తనకి ఒక్కో సారి చిన్న నష్టం కలిగినా దేశ ప్రయోజనాల దృష్ట్యా పట్టించుకోని మంచి పౌరులు గా ... ఎన్ని సాధించట్లేదు రోజూ మనం!
మన లోని చిన్నారి ఈ విజయాలకు గుర్తింపు లేక చిన్నబోతోందేమో .. అందుకే వయసు తో వచ్చే గాంభీర్యాన్ని, మెచ్యూరిటీ ని పక్కన పడేసి బాల్య చాపల్యం చూపిస్తోందేమో...
కానీ ఆ చిన్నారి కి తెలియని విషయాలేంటంటే ఇందాక చెప్పినట్టు కొన్ని విజయాలు మనం బయటికి చెప్పుకోలేం... ఎవరైనా గమనించి మెచ్చుకుంటే బాగుండు అనిపిస్తుంది కానీ మన వెన్నంటి ఉండే ఇంట్లో వాళ్ళకి కూడా ఇంత సునిశితమైన దృష్టి ఉండదు ... ఉన్నా గమనించే టైం, ఓపిక ఉండవు. కొంత మందికి ఉద్దేశం కూడా ఉండదనుకోండి... అలాగే ప్రపంచ శాంతికి నోబెల్ ఉన్నట్టు కుటుంబ శాంతికి ఏ అవార్డూ లేదు ... లేకపోతే ఎంత మంది ఆ సత్కారం పొందే వారున్నారో కదా! కళాకారులకి వేదిక మీద బిరుదులు ప్రదానం చేసి శాలువా కప్పుతారు కానీ ఓ కుటుంబాన్ని నిలబెట్టిన కుటుంబ పెద్ద కి ఇవేవీ ఇవ్వరే ... పైగా 'నీ కుటుంబం నువ్వు నిలబెట్టుకోవడం కూడా పెద్ద ఘనకార్యం ఏవిటి' అనే ఎత్తిపొడుపులు ... ఏ? కాదా? అలా చెయ్యకుండా బాధ్యతారహితంగా ఎంతమంది లేరు? ఆడవారి విషయానికొస్తే 'ఆడవారు - గుర్తింపు' అనే విషయం మీద గ్రంథాలే రాసేయచ్చు ... అయినా సరిపోదు.
ఇంకా ఎన్నో వ్యక్తిగత యుద్ధాలు చేసి వీరులుగా నిలిచిన వారికి గుర్తింపు ఏది?
కొన్నేళ్ళు ఇలా మన వ్యక్తిగత విజయాలు గుర్తింపు లేకుండా పోయినప్పుడు ఎన్నో వికారాలు పుడతాయి .. స్వోత్కర్ష ఒకటైతే, నైరాశ్యం ఇంకొకటి .. నిష్కారణమైన కోపం, చికాకు కూడా (నిష్కారణం ఏముంది లెండి ... ఇంత చేసి మెచ్చుకోకపోతే రాదా కోపం) ...
మరి ఏం చెయ్యాలి?
ఓ చాలా మంచి కిటుకుంది.
ఓ కొత్త పుస్తకం, పెన్ను కొనుక్కోండి.
ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు డేట్ వేయండి.
నెంబరు వేస్తూ ఆ రోజు మీరు సాధించా అనుకున్న విషయాలు రాసుకోండి.
'పాలు పొంగక ముందే కట్టేసా' దగ్గర నుంచి 'తమ్ముడి ఇంటి కరెంటు బిల్లు కట్టేసా' వరకూ రాసుకోవచ్చు.
డిప్రెషన్ లాంటి మనోవ్యాధులతో బాధపడుతున్న వాళ్ళైతే 'నేను ఇవ్వాళ నిద్ర లేచి స్నానం చేశా' అని కూడా రాసుకోవచ్చు... ఆ రోజు కి మీరు సాధించగలిగిన అతి గొప్ప ఘనకార్యం అదే కదా!
ఇంకొక చిన్న పని చేసి చూడండి. ఏ రోజుకి ఆరోజు మళ్ళీ మొదటి నెంబరు వెయ్యకుండా ముందు రోజు విజయాల నెంబరు నుంచి సంఖ్య కంటిన్యూ చేయండి .... మీ విజయాలు సెంచరీ ఎన్ని రోజులకి కొట్టాయో తెలిసిపోతుంది!
ఈ పుస్తకం మీ వ్యక్తిగతం కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చిన విజయం రాసుకోవచ్చు ... మీకు మీరే ఏదైనా బిరుదు కూడా ఇచ్చుకోవచ్చు ... తప్పేం ఉంది? ఫామిలీస్టార్ <మీ పేరు> .. డైనమిక్ గృహిణి /గృహస్థు <మీ పేరు> , వజ్రోద్యోగి <మీ పేరు> ... పుత్రరత్న <మీ పేరు>, పుత్రికాశిరోమణి <మీ పేరు> ...
మీ ఇష్టం అండి! ఇంకా నేను బోల్డు కేటగిరి లు మర్చిపోతున్నానేమో ... కొన్ని ఇక్కడ పొందుపరచలేకపోతున్నానేమో ... అయినా విజయం విజయమే! ఆ విజయానికి గుర్తింపు ఉండాల్సిందే.
ఆమ్మో ... ఇలా రోజూ మనని మనమే పొగిడేస్కుంటే ఈగో వచ్చెయ్యదూ? అనే ప్రశ్న మీకు తడితే అసలు మీకు ఈగో వచ్చే సమస్య లేదన్నమాట. అహంకారం లేదనుకోవడమే అహంకారం అంటారు కదా .. అలాగే అహంకారం వచ్చేస్తుందేమో అని భయపడటమే నిరహంకారం. అదే ఇగోయిస్టు అనుకోండి .. 'పుస్తకం లో రాస్తే ఎవరికీ తెలుస్తుంది' అని రాయరు ... పైగా 'నాకు ఓ పుస్తకం ఏం సరిపోతుంది' అని జోకులేస్తారు. వీళ్ళకి ఈ సలహా వర్తించదు అని నా సవినయ మనవి.
కొన్ని రోజుల తర్వాత మీకు ఈ పుస్తకం అవసరం పడకపోవచ్చు కూడా. ఎందుకంటే మీకు మీరున్నారు... ఎవరు గమనించినా గమనించకపోయినా మిమ్మల్ని మీరు గమనించుకొని చప్పట్లు కొట్టుకుంటున్నారు అని మీకు నమ్మకం కుదురుతుంది కాబట్టి.
ఇంగ్లీష్ లో అప్ప్రీసియేషన్ అనే మాట ఉంది కదా ... దానికి రెండు అర్ధాలు .. ఒకటి మెచ్చుకోలు.. ఒకటి పెరుగుదల ... ఈ రెండు పదాలు ఇక్కడ వర్తిస్తాయి. మనని మనం ముందు గుర్తించుకుంటే, మెచ్చుకుంటే .. మనం ఎదుగుతాం, వ్యక్తిత్వం లో పెరుగుతాం అన్న మాట నిజం.
తెలుగు లో కూడా 'స్వ' తీసేస్తే ఉత్కర్ష ఎంత మంచి పదం .. దానికి కూడా ఇంచుమించు పెరుగుదల అనే అర్ధం వస్తుంది అనుకుంటాను .. సరైన చోట చేసుకొనే స్వోత్కర్ష .. ఉత్కర్ష గా ఉపయోగిస్తుంది.
అప్పుడు గుర్తింపు కోసం బయటికి చూడటం ఆపేస్తాం ... ఆ ఆరాటం బాగా తగ్గుతుంది. ఎందుకంటే మనలోని చిన్నారికి ముందు కావాల్సింది మనం పట్టించుకోవడమే కదా. డబ్బు డబ్బుని ఆకర్షిస్తుంది అంటారు. రెండు నెలలు జీతం బ్యాంకు లో పడగానే మేము అప్పిస్తాం అంటే మేము అప్పిస్తాం అంటూ వచ్చేస్తారు! అలాగే డబ్బుల్లేని వాళ్ళకి చెప్పని ఎన్నో స్కీమ్ లు ఇంటికొచ్చి మరీ చెప్తారు.
గుర్తింపు విషయం లో ఒకంత వరకూ అది వర్తిస్తుంది. ఆరాటం మానేసి, మనని మనమే అభినందించుకుంటున్నందుకు తృప్తి గా ఉండటం మొదలవ్వగానే బయట నుంచి కాంప్లిమెంట్స్ అవే మొదలవుతాయి!
పోనీ ఆలా జరగక .. ఎవరూ మనని మెచ్చి మేక తోలు కప్పకపోయినా .. మన మెడ లో మనమే అల్లి వేసుకున్న అభినందన మందార మాల ఉండనే ఉంది! ఈ మందారాలకి గుబాళింపు ఉంటుందండోయ్ ... అది మన పరిపూర్ణ వ్యక్తిత్వం తాలూకు సువాసన!

అసలే కరోనా కాలం ఇన్ని నిజాలు చెప్పేస్తే....
ReplyDeleteఎవరో ఒకరు తమని గుర్తించాలి, మెచ్చుకోవాలి అనే కోరిక మనిషిని పూర్తిగా వదిలి పోదేమో.
ReplyDeleteWe want others to appreciate or at least acknowledge the good work or services rendered by us. It may be a driving force for continuity.
A pat on the back , sense of gratitude , praise do motivate us.
Very nicely written Soumya Garu.
అది సహజం. జేమ్స్ బాండ్ సినిమాల్లో విలన్ ఏం చేస్తాడు?
Deleteప్రపంచం తో సంబంధం లేని ప్లేస్ లో కూర్చుని ప్రపంచాన్ని వణికించే ప్లాన్ తో ఎదో యంత్రమో మరొకటో తయారు చేయిస్తాడు. కానీ దాన్ని గురించి ఎవరికో ఒకరికి చెప్పాలని మనసు దురద పెడుతూ ఉంటుంది. ఎవ్వరూ దొరకనట్లు హీరోని బోల్డంత ఖర్చు పెట్టి కిడ్నాప్ చేసి మొత్తం వివరంగా వివరిస్తాడు. ఇంకేముంది? చివరికి మొత్తం ప్లాన్ ఓం నమశివాయ!
Ha ha. బలే ఉదాహరణ ఇచ్చారు సూర్య. తాను చేసిన పని తన మనసులో మాట తన ప్రత్యేకత ఎక్కడో ఒక చోట వెలిబుచ్చాలి నలుగురికి తెలియాలి అనుకుంటాడు మనిషి. సరిగ్గా ఈ బలహీనతని Facebook Instagram etc. చక్కగా వాడుకుంటాయి.
Deleteఅయితే పదిమందికి ఉపయోగ పడాలి అన్న తపన తో పంచుకునే వాళ్ళు కూడా ఉంటారు.
మొత్తానికి ప్రతి ఒక్కరికీ గుర్తింపు , మెచ్చుకోలు పంచుకోలు కోరిక ఉంటుంది.