ఈనాడు ఆదివారం లో నా కథ - సతీ సావి 'త్రి' సూత్రాలు

ఓ రాత్రి రేడియో లో 'ఉమ్మడి కుటుంబం' సినిమా లోని సతీ సావిత్రి స్టేజీ నాటకం సీన్, పాట వినపడింది. అది వింటుండగా సతీ సావిత్రి కథ మీద దృష్టి పడింది. నాకనిపించింది ఏంటంటే, సావిత్రి లాంటి స్త్రీ ఏది నమ్మితే దానికి అదే విధంగా నుంచుంటుంది అని. అక్కడ భర్త ప్రాణం ఆమె ఆశయం. ఇంకో ఆశయం ఉంటే అక్కడ కూడా ఆమె వ్యక్తిత్వం అలాగే గుబాళించేది! మనసు చివుక్కుమనే విషయం ఇంకోటేంటంటే సతీ సావిత్రి ని ఓ ఎగతాళి ధ్వని లోనే వాడటం. ఆ దృష్టి కోణం కూడా మారాలనిపించింది. ఈ సబ్జెక్ట్ మీద కథ రాయాలనిపించింది. అదే ఈ కథ. 

కామెంట్‌లు

  1. రిప్లయిలు
    1. It is a wonderfully written story. Realistic and inspiring story. I will put this story on my table ( below the glass ) for constant inspiration. Thanks a lot to the writer.

      తొలగించండి
  2. I have read ur haunting 👌👍 ✍️story 'satee saavi _tri_' in eenadu sunday magazine today, 13 apr., 2025. U r laudable for ur creative amalgamation of mythology and logical rea soning with melodrama 👌👏. Hearty congratulations for ur sensible modern story, ma'am 🙏🏻💐 .

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగుంది అండి. చాలా మందికి inspiration మీ కథ. పాత కథలని ఇలా కూడా ఆలోచించచు అని చెప్పారు మీరు.

    రిప్లయితొలగించండి
  4. మనసులో తెలియని ఆనందరేఖను అనుభవింపచేసిన మీ కథకూ, కథనానికీ వందనములు. మీ కాలము నుండి మరిన్ని భావస్ఫోరకమైన, రసనిష్ఠమైన రచనలు రావాలని ఆకాంక్షిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  5. Excellent. New Thought Process. now a days, eenadu stories became pale and boring. you gave Fresh Breath. Danke.

    రిప్లయితొలగించండి
  6. This story which was published in Eenadu, for the first time made me search for the author in Google.will surely use your 3 sutras in life

    రిప్లయితొలగించండి
  7. గత 30 సంవత్సరాలుగా ప్రతి వారం ఈనాడు వారపత్రిక కథలు చదివే నేను, మొదటి సారి ఇంత గొప్ప (సతీ సావిత్రి) కథ ఎవరు రాశారు అని రచయిత పేరు చూశాను. మీ గురించి వెతికి మీ ఇతర కథలు కూడా చదివి మా కుటుంబ సభ్యులకు చెప్పాను. నా పిల్లలు మరియు ఆఖరి మైలు చాలా బాగున్నాయి. మద్య తరగతి కుటుంబాల సమస్యలు ఎంచుకొని, కొత్త కోణంలో ఆలోచించడం ద్వారా వాటిని పరిష్కరించడం సులువు అని మీ వినూత్న ప్రయత్నం బాగుంది. ఇలాంటి కథలు ఎంతో మందికి స్ఫూర్తిని నింపి , కొత్త కోణంలో ఆలోచింప చేస్తాయి.

    రిప్లయితొలగించండి
  8. స్టోరీ డిఫరెంట్ గా రాసారు మేడం.. రొటీన్ కి భిన్నంగా. ఇంకా మీ స్టోరీస్ కి ఆల్మోస్ట్ బొమ్మలు నేనే వేసా.


    tq from

    king సీతు

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి