Posts

Showing posts from July 10, 2022

ప్రకృతి మాత నన్ను వెక్కిరించిన గాధ (యాభయ్యో పోస్టు!)

Image
బ్లాగు మొదలు పెట్టిన చాలా రోజులకి ఈ తరుణం వచ్చినా ... మైలు స్టోన్ మైలు స్టోనే కదా! అసలు యాభై ఇన్నేళ్లకి వస్తుందనుకోలేదు. అసలు యాభై వస్తుందనీ అనుకోలేదు. ఈ రెండు కారణాల పరంగా ఇది చాలా గుర్తుండిపోయే పోస్టు.  అయితే ఈ సందర్భంగా ఏ విజయ గాధో, మంచి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడమో చెయ్యాలి కానీ ఇలా ఒకరి చేత పరాభవం చెందిన విషయం తలుచుకోవడం ఏంటి అనుకోవచ్చు.  కానీ పరాభవించింది ప్రకృతి. ఇంకెవరో అయితే  నేను ఎందుకు పట్టించుకుంటాను .. పట్టించుకుని ఫీల్ అయినా ఇలా ఎందుకు అందరి ముందు చెప్పుకుంటాను?  సంగతేంటంటే ... నాకొక నమ్మకం ఉంది .... నాకూ ప్రకృతికి అంత మంచి స్నేహం లేదని.  నేను పల్లెటూరి లో పెరగలేదు. కొన్ని ఊళ్ళు కొండల పక్కన, వాగుల పక్కన, సముద్రం పక్కన ఉంటాయి చూడండి ... అలాంటి ఊళ్ల లో అసలే పెరగలేదు. అంత పెద్ద ట్రావెలింగ్ కూడా చేసెయ్యలేదు.  కొంత మంది బాగా మొక్కలు పెంచుతారు. లేదా పెంపుడు జంతువులు ఉంటాయి. వాటి తో మంచి బంధం ఉన్నందువల్ల సిటీల్లో ఉండి కూడా ప్రకృతి తో టచ్ లో ఉంటారు.  నేను పువ్వులు, మబ్బులు, ఆవులు, చెట్లు... వీటిని చూసి ఆనందించగలను, పులకించగలను, వాటి గురించి వర్ణించి రాయగలను, పాడగలను, కెమెరా లో చూప