Posts

Showing posts from October 14, 2018

అమ్మ కావాలి

Image
తెలుగు ని 'ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్'  అని నికోలో డి కాంటి (Niccolò de' Conti) అనే ఓ ఇటాలియన్ పదహారో శతాబ్దం లో అన్నాడు. ఇతను ఒక వర్తకుడు. సాహితీవేత్త కాదు. ఆ మాట కూడా కాంప్లిమెంట్ ఏమీ కాదు. అది ఒక ఫాక్ట్ మాత్రమే.  ఇటాలియన్ పదాలు కూడా మన భాషలో పదాల లాగా అచ్చులతో ముగుస్తాయి అని ఉద్దేశం. మనోళ్లు దాన్ని ఓ కాంప్లిమెంట్ గా భాషా పరిరక్షణ వ్యాసాలలో, ఆవేశంగా వేదికల మీద ప్రసంగాల్లో వాడేస్తూ ఉంటారు. నిజానికి ఇలా అచ్చులతో ముగిసే పదాలున్న భాషలు చాలా ఉన్నాయి ప్రపంచం లో. విజయనగర సామ్రాజ్యం లో వాణిజ్యం నిమిత్తం వచ్చి 'మీ భాష కూడా మా భాషలానే ఉందిరోయ్' అన్నాడు అంతే.  మనం 'ఒక తెల్ల వాడు మనని భలే పొగిడేసాడు' అనుకొనేసాం. ఇప్పుడు మనం భాష ని మర్చిపోయినట్టు అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ని మర్చిపోయాం. అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ మర్చిపోయాం కాబట్టే భాష ని కూడా వదిలేసుకుంటున్నాం అనిపిస్తుంది నాకు.  అసలు ఒక భాష ని ఇంకో భాష తో పోలిస్తే దానికి విలువ రావడమేంటి ఖర్మ!  తెలుగు భాష - ప్రపంచం లో ఉన్న భాషలన్నిటిలోకి గొప్పది, అందమైనది, శ్రావ్యమైనదేమీ కాదు. అన్ని భాషలూ తెలియకుండా ఈ స్టేట