Posts

Showing posts from August 26, 2018

స్రష్టకష్టాలు

అష్టకష్టాల గురించి మనందరికీ తెలుసు ..  కష్టాల బ్యూటీ కాంటెస్ట్ లో అష్టకష్టాలకే కిరీటం తొడగబడుతుంది.  కానీ వాటిని మించిన కష్టాలు కొన్ని ఉన్నాయి .. అవే కళాకారుల కష్టాలు .. కళను సృష్టించే కళా స్రష్టల కష్టాలు .. స్రష్టకష్టాలు. (అసలు కళ ఎందుకు అనేవారు చివరి పేరాగ్రాఫ్ చదివి మళ్ళీ ఇక్కడికి రావచ్చు)  కళ ని జీవనశైలి గా, భుక్తి-ముక్తి మార్గంగా ఎంచుకొన్న వారి గురించే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. (వీకెండ్స్ లో కథక్  క్లాసెస్ కి వెళ్తున్న వారు, చిన్నప్పుడు ఎప్పుడో సంగీతం నేర్చుకుని ఇప్పుడు మర్చిపోయిన వాళ్ళు, ఇంట్లో ఏదో ఒక musical instrument/డాన్స్ గజ్జెలు ఉన్నవారు, సరదా కి అప్పుడప్పుడూ బొమ్మలు వేసుకొనే వారు...  వీళ్ళని hobbyists అంటారు.) స్రష్టకష్టాలు  = అష్టకష్టాలు  + ఇంకొన్ని కష్టాలు  కష్టాల గురించి మాట్లాడుకొనే ముందు క్లుప్తంగా సుఖాల గురించి కూడా మాట్లాడుకుందాం (క్లుప్తంగా ఎందుకంటే కొన్నే ఉంటాయి కాబట్టి 😉) కళ వల్ల తోటివారిలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది. ఆ అమ్మాయి పాటలు బాగా పడుతుంది అనో, వాడు బాగా బొమ్మలు వ...