Posts

Showing posts from September 30, 2018

ఎవరు చేసిన ఖర్మ ...

Image
మనోళ్ళకి ఆధ్యాత్మిక IQ ఎక్కువ. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత లాంటివి పనికట్టుకు చదవకపోయినా కర్మ సిద్ధాంతాలు, స్థితప్రజ్ఞత్వాలు, పూర్వ జన్మ సుకృతాలు, సంచిత పాపాలు ఇలాంటివి తెలుసు. ఇవి మన డి ఎన్ ఏ లో ఉన్నాయేమో!  మన జీవితం లో ట్రాజెడీ లని ప్రాసెస్ చేసే విషయం లో మన లోని ఈ ఆధ్యాత్మికత బాగా పనికొస్తుంది అనుకుంటాను. ఏదైనా దొరకకపోయినా, చేజారి పోయినా, బాధ కలిగినా, ఎవరైనా పోయినా ... ఎటువంటి ప్రతికూల పరిస్థితి అయినా సరే .. ఆధ్యాత్మికత, వేదాంతం, తాత్వికత లు  సందు చివర దొరికే అరటి పళ్ళలాగా అన్ని సీజన్లలో పెద్ద ఖర్చు పెట్టకుండా అందుబాటులో ఉంటూ ఉంటాయి.  మనం జీర్ణం చేసుకున్న ఈ ఆధ్యాత్మికత లో చాలా ముఖ్యమైనది - కర్మ సిద్ధాంతం. మన దేశం లో పుట్టిన పదేళ్ల వాడిని కర్మ సిద్ధాంతం గురించి అడిగితే చెప్తాడని నాకో గుడ్డి నమ్మకం. అయితే ఎవరి దగ్గర ఏది ఎక్కువ ఉంటుందో, వాళ్ళు ఆ ఆస్తిని విచ్చలవిడిగా విచక్షణ లేకుండా వాడేస్తారని మనిషి చరిత్ర చెప్తుంది.  అమెరికా తన అధికారాన్ని ఇలాగే వాడుతుంది. మనం మనం ఆధ్యాత్మికత ని అలాగే వాడతాం.  అన్నిటికంటే నాకు ironical గా అనిపించేది ... ఎంతో ఉన్నతమైన ఈ ఆధ్యాత్మికత ని తోటి