Posts

Showing posts from 2022

2023 నుంచి నేను ....

2022 సంవత్సరం ఇంకో పక్షం రోజుల్లో అయిపోతోంది. కొత్త సంవత్సరం రాబోతోంది.  ఈ టైం లో రెండు రకాల వ్యక్తులు కనిపిస్తారు. కాలెండర్ మారడం తప్పించి ఇందులో ఏముంది అని లైట్ తీసుకొనే వారు.  రెండో రకం వ్యక్తులు కొత్త సంవత్సరం అంటే ఏదో కొత్త ఉత్సాహం ఫీల్ అవుతారు లేదా ఏదో ఒకటి కొత్తగా చెయ్యాలి ఈ సంవత్సరం అనుకుంటారు ... ఓ  హోప్, రానున్న సంవత్సరం పట్ల బోలెడు ఆశలు, ఎలా ఉండబోతోంది అనే కుతూహలం ఉన్న వారు వీరు. సరిగ్గా ఇలాంటి వారే న్యూ ఇయర్ రెసొల్యూషన్స్ .. నూతన సంవత్సరం కోసం కొన్ని తీర్మానాలు తీసుకుంటారు.  నేను రెండో టైపు అని చెప్పడం నా కర్తవ్యం గా భావిస్తున్నాను.... ఎవరూ అడగకపోయినా.  కాలమహిమ లో మనం చెప్పుకున్నట్టు ఇంగ్లీష్ కాలెండర్ ని ఇష్టం వచ్చేసినట్టు మార్చేసిన చరిత్ర ఉంది. దాని దృష్ట్యా అసలు ఇప్పుడు వచ్చే జనవరి ఒకటి 2023 అసలు ఆ తేదీ ఏ నా అంటే కాదు మరి. రోడ్డు మీద పానీపూరి ఇష్టంగా తింటుంటే "ఇది అసలు ఎలా తయారు చేస్తారు తెలుసా" అని వీడియోలు చూపిస్తే ఏమంటాం? ఒక్కోసారి కఠినమైన ... లేదా ఆ టైం కి అనవసరమైన నిజం కంటే భ్రమే బాగుంటుంది .. అది కూడా ప్రపంచం అంతా మనతో పంచుకొనే భ్రమ అయితే మరీనూ! అసలు ఈ ప్

నాలుగు కళ్ళు రెండయినాయి ...

... రెండు మనసులు ఒకటయినాయి .. ఈ పాట గుర్తుందా? ఈ పోస్టు ఆ పాట గురించి కాదు.  విషయం ఏంటంటే నాకు కళ్ళజోడు ఉంది.   మనకి తెలిసి కళ్లజోడు తలనొప్పికి గాని, సైట్ కి గాని పెట్టుకుంటారు. సైట్ అన్నప్పుడు మనం ఉద్దేశం సైట్ ప్రాబ్లమ్ అని. సైట్ అంటే చూపు. అదే ఉంటే కళ్ళజోడు ఎందుకు? వాషింగ్ పౌడర్ ని సర్ఫ్ అనేసినట్టు, మధు అనే రాక్షసుడిని చంపి మధుసూదనుడైన విష్ణువు పేరు పెట్టుకున్న వ్యక్తి ని ఆ రాక్షసుడి పేరు తో మధు అని పిలిచినట్టు, కర్ణాటక సంగీతాన్ని కర్ణాటక రాష్ట్రానికి చెందిన సంగీతం అనుకున్నట్టు ... సైట్ ని కూడా అలా వేరే అర్ధం (పై పెచ్చు వ్యతిరేక అర్ధం) లో వాడటం మనకి అలవాటైపోయింది.  ఎలా వాడితే ఏం .. నాకు సైట్. అదే సైట్ ప్రాబ్లమ్.  చిన్న విషయం గా అనిపిస్తుంది కానీ, అద్దాలు ఉండటం వల్ల దైనందిన జీవితం వేరే వారి లా ఉండదు. ఇది అద్దాలు వాడే వారికే తెలుస్తుంది.  వేడి కాఫీ/టీ తాగే అప్పుడు ఉఫ్ అని ఊదగానే కళ్ళజోడు మీద ఆవిరి వచ్చేస్తుంది. కొన్ని రకాల మాస్క్ పెట్టుకుంటే కూడా కళ్ళజోడు మీద ఫాగ్ వచ్చేస్తుంది ఊపిరి వదిలినప్పుడల్లా. అదో న్యూసెన్స్. త్రీ డీ సినిమాలు చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు త్రీ డీ గ్లాసెస్ ఇస్తార

కానుకా శాస్త్రం

నాకు పుట్టినరోజులంటే ఎంత ఇష్టమో 'నేను పుట్టాను' అనే పోస్టు లో వెళ్లబోసుకున్నాను ... గుర్తుందా?  పిచ్చి ముదిరి నా పుట్టినరోజులే కాక పక్క వాళ్ళ పుట్టినరోజులంటే కూడా బాగా ఉత్సాహం పెరిగిపోయింది అది రాసినప్పటి నుంచీ.  నాకంటే చిన్న పిల్లలకి 'నేను మూడు పుట్టినరోజులు జరుపుకుంటాను... నువ్వు కూడా జరుపుకోవచ్చు' అని బాగా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నాను. వాళ్ళ తల్లితండ్రులు నన్ను బాగా తిట్టుకున్నా సరే. అయితే నేను ఇచ్చే ట్విస్ట్ ఏంటంటే ఈ తరం పిల్లల కి మూడు పుట్టిన రోజుల ఆశ చూపించి వారు పుట్టిన తిథి, నక్షత్రం, తెలుగు మాసం, తెలుగు సంవత్సరం పేరు తెలుసుకుని గుర్తుంచుకునేలా చేస్తున్నాను. ఐటం సాంగ్ లో మెసేజ్ ఓరియెంటెడ్ లిరిక్స్ పెట్టినట్టు అన్నమాట.  పిల్లలు ఆల్రెడీ పుట్టినరోజులంటే excited గా ఉంటారు కాబట్టి అక్కడ నా పని సులువు.  కానీ ఈ పెద్దవాళ్ళున్నారే ... అబ్బా.. ఎందుకో వీళ్ళకి పుట్టినరోజులంటే అంత నీరసం.  మీరు ఏమైనా అనుకోండి.  బాగా డబ్బులు సంపాదించుకుంటూ, మంచి పొజిషన్ లో ఉన్నవాళ్లు పుట్టినరోజు జరుపుకోపోతే నాకు మహా చికాకు. ఏ... అంత కష్టం ఏం వచ్చిందని? త్రివిక్రమ్ గారు చెప్పినట్టు డబ్బున్న వాళ

కవి హృదయం - 1

Image
 గిరీశం ఫక్కీ లో చెప్పాలంటే ఈ మధ్య పోయెట్రీ భలే చదివేస్తున్నానండోయ్!  ఇంగ్లీష్ పోయెట్రీ .  చిన్నప్పుడు పద్యాలంటే చాలా బోర్ ఫీల్ అయ్యేదాన్ని. ఎం ఏ ఇంగ్లీష్ చేసే అప్పుడు కూడా నవలలు ఇష్టంగా చదివే దాన్ని కానీ షేక్స్పియర్ పద్య నాటకాలు, కీట్స్  ... వీళ్ళ దగ్గరకి వచ్చేసరికి ముక్కున పట్టి ఏదో అయిందనిపించేసాను.  ఈ మధ్య ఇంస్టాగ్రామ్ లో పోయెట్రీ అకౌంట్స్ కనబడ్డాయి కొన్ని. కవి ఫోటో వేసి మరీ వారు రాసిన కొన్ని లైన్లు ఉంచుతారు పోస్టు లో.  ఏవో కొన్ని లైన్లు అనుకుంటాం కానీ ... అమ్మో! చాలా లోతుంది వాటిలో. అలాగే ప్రపంచాన్ని ఓ కవి ఎలా చూస్తాడో తెలుసుకోవచ్చు. భిన్న ఆలోచనా ధోరణులు తెలిసాయి కూడా నాకు. కొన్ని అయితే, భలే ఇలా కూడా ఆలోచించచ్చా అనిపించేలా ఉన్నాయి! నచ్చినవి, భలే అనిపించినవి సేవ్ చేసుకుంటాను ఇంస్టా లో. లేదంటే స్క్రీన్ షాట్ తీస్కొని పెట్టుకుంటాను.  మా అమ్మ గారు అన్నట్టు ఏదైనా మంచి చూస్తే అందరికీ చెప్పేయాలి అనే పిచ్చి ఉంది కాబట్టి, నేను చదివిన మంచి పోయెట్రీ లో కొన్ని మీకోసం ఈ రోజు. :)  రెండు తలల దూడ  లారా గిల్పిన్    ఈ కవిత లో శీర్షిక ఎంత ఆశ్చర్యకరంగా ఉందో, ఆఖరు లైన్ అంతే తమాషా గా ఉంది! ఆ ఆఖరు లైన్ న

హ్యాపీ వెయిటింగ్

Image
తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన ఈ కలువ నిరీక్షణ... ఎదురుచూడడం, వెయిటింగ్ .... వీటి గురించి రాద్దామనుకోగానే నాకు 'కలువ నిరీక్షణ' అనే సాహిత్యమే గుర్తొచ్చింది ఎందుకో.  తుషార శీతల సరోవరం లాంటి అందమైన సెట్టింగ్ లో ఎవరైనా బానే ఎదురుచూస్తారు. కానీ విషయం విషమం అయిపోయి, పరిస్థితులు పీకల మీదకి వచ్చేసినప్పుడు, అలా వచ్చిన రాకపోయినా మనం వచ్చేసినట్టే ఆందోళన పడిపోతున్నప్పుడు ఏం చేయాలి? అసలు ఎదురుచూడటం అంటేనే విసుగు ఉన్న వారు ఏం చేయాలి?  ఇష్టం ఉన్నా లేకపోయినా జీవితం లో ఎదురుచూపులు తప్పవు కదా.  బస్సు కోసం, డొమెస్టిక్ హెల్ప్ కోసం, ఓ మంచి అవకాశం కోసం, ప్రేమ ప్రతిపాదన చేసాక ఎదుటి వ్యక్తి సమాధానం కోసం, మెడికల్ రిపోర్ట్స్ కోసం, అవి పుచ్చుకొని డాక్టర్ దగ్గర మన వంతు కోసం, సమాజం లో మార్పు కోసం, ఓ సినిమా లో ఎప్పటికీ మొదలవ్వని కథ కోసం, సంతానం కోసం, ప్రొమోషన్ కోసం, లక్ తిరగడం కోసం, రివెంజ్ కోసం, అప్పు కోసం, ఆ అప్పు తీర్చడం కోసం, సొంత ఇంటి కోసం, కలల జీవితం కోసం, పుట్టినరోజు కోసం, బరువు తగ్గడం కోసం.... చివరికి మరణం కోసం... ఎదురుచూపులు తప్పవు కదా. (పైన పేరా అనుకోకుండా దండకం ఛందస్సు లో వచ్చిందేమో అని అ

"యాక్షన్ హీరో"

Image
లేటెస్ట్ సినిమాలు చూసి రివ్యూ లు పెట్టడం అలవాటు లేదు నాకు. కానీ ' జయేష్ భాయ్ జోర్దార్'  సినిమా గురించి తప్పకుండా రాయాలనిపించింది.  దీని ట్రైలర్ చూసి థియేటర్ లో చూద్దామనుకున్నా. కుదర్లేదు. ఇంట్లో అమెజాన్ లో చూసాను.  ఇది అంత హిట్ సినిమా కాదు .....  కానీ ఈ కాలానికి చాలా అవసరమైన సినిమా.  ఎప్పుడూ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లని విమర్శిస్తాం కదా .... మీరు కోట్లలో బిజినెస్ చేస్తారు .. పెద్ద స్టార్లందరూ మీ గుప్పెట్లో ఉంటారు .. మంచి సినిమా తీయచ్చు కదా అని. ఈ సినిమా అలంటి విమర్శల కి యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళ జవాబు అనిపిస్తుంది. (యష్ రాజ్ కి నాకూ ఏ సంబంధం లేదండి బాబు ... నిజంగా నచ్చే చెప్తున్నా).  ఈ సినిమా హీరో రణ్వీర్ సింగ్. హీరోయిన్ అర్జున్ రెడ్డి లో హీరోయిన్ అయిన షాలినీ పాండే. రత్నా పాఠక్ షా, బోమన్ ఇరానీ ల తో పాటు కొత్త వాళ్ళు మంచి నటులు కనిపించారు ఇందులో.  కథ ఏంటంటే బోమన్ ఇరానీ గుజరాత్ లో ఓ పల్లెటూరి సర్పంచ్. కరడు గట్టిన పురుషాహంకారం, లింగ వివక్ష, పితృస్వామ్యం లో ఉన్న చెత్త అంతా మూర్తీభవించిన వాడు. స్కూల్ ముందు మందు దుకాణం మూయించండి, తాగి ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారు అంటే 'ఆడపిల్లలు వాసన

పన్నీటి జల్లు

Image
మొన్న ఇనార్బిట్ మాల్ కి వెళ్ళినప్పుడు ఒక చిన్న షాపు కనిపించింది. 'మేక్ యువర్ ఓన్ పెర్ఫ్యూమ్' ...  మీ అత్తరు మీరే తయారు చేస్కోండి అని. అక్కడ ఉన్న పెర్ఫ్యూమర్ (పెర్ఫ్యూమ్ అమ్మే వారిని అలా పిలుస్తారని ఇప్పుడే తెలిసింది) రకరకాల వాసనలు ఒక దళసరి పేపర్ ముక్క మీద జల్లి చూపించాడు. అన్ని వాసనలు వరసగా చూసి confuse అవ్వకుండా మధ్య మధ్య లో కాఫీ గింజలు వాసన చూపిస్తారు. అది మళ్ళీ మన ముక్కు ని రీసెట్ చేస్తుందన్నమాట! వాటిలో మనకి నచ్చింది ఒకటి కానీ, రెండిటి మిశ్రమం కానీ తయారు చేస్కోవచ్చు. వాటిని తగు పాళ్ళలో ఓ బాటిల్ లో వేసి ఇస్తాడు. అంతే. అదే మన కోసం మనం ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్న పెర్ఫ్యూమ్ అన్నమాట. ధర 2500 రూపాయల నుంచి మొదలవుతుంది. మనం ఎంచుకున్న అత్తరు బట్టీ. నేను కొనలేదు కానీ ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది అనిపించింది.  నేనసలు పెర్ఫ్యూమ్ వాడే దాన్ని కాదు ....  ఒకటి...  మధ్య తరగతి ఇళ్లలో ఇలాంటి విషయాల్లో  ఇంట్రస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తప్పించి ఇవి అలవాటు అవ్వవు.  నెలసరి బడ్జెట్ లో రెండు, మూడు వేల రూపాయలు లేదా అంత కంటే ఖరీదు చేసే వస్తువు ... ముఖ్యంగా ప్రాక్టికల్ యూజ్ లేనిది అస్సలు

ప్రకృతి మాత నన్ను వెక్కిరించిన గాధ (యాభయ్యో పోస్టు!)

Image
బ్లాగు మొదలు పెట్టిన చాలా రోజులకి ఈ తరుణం వచ్చినా ... మైలు స్టోన్ మైలు స్టోనే కదా! అసలు యాభై ఇన్నేళ్లకి వస్తుందనుకోలేదు. అసలు యాభై వస్తుందనీ అనుకోలేదు. ఈ రెండు కారణాల పరంగా ఇది చాలా గుర్తుండిపోయే పోస్టు.  అయితే ఈ సందర్భంగా ఏ విజయ గాధో, మంచి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడమో చెయ్యాలి కానీ ఇలా ఒకరి చేత పరాభవం చెందిన విషయం తలుచుకోవడం ఏంటి అనుకోవచ్చు.  కానీ పరాభవించింది ప్రకృతి. ఇంకెవరో అయితే  నేను ఎందుకు పట్టించుకుంటాను .. పట్టించుకుని ఫీల్ అయినా ఇలా ఎందుకు అందరి ముందు చెప్పుకుంటాను?  సంగతేంటంటే ... నాకొక నమ్మకం ఉంది .... నాకూ ప్రకృతికి అంత మంచి స్నేహం లేదని.  నేను పల్లెటూరి లో పెరగలేదు. కొన్ని ఊళ్ళు కొండల పక్కన, వాగుల పక్కన, సముద్రం పక్కన ఉంటాయి చూడండి ... అలాంటి ఊళ్ల లో అసలే పెరగలేదు. అంత పెద్ద ట్రావెలింగ్ కూడా చేసెయ్యలేదు.  కొంత మంది బాగా మొక్కలు పెంచుతారు. లేదా పెంపుడు జంతువులు ఉంటాయి. వాటి తో మంచి బంధం ఉన్నందువల్ల సిటీల్లో ఉండి కూడా ప్రకృతి తో టచ్ లో ఉంటారు.  నేను పువ్వులు, మబ్బులు, ఆవులు, చెట్లు... వీటిని చూసి ఆనందించగలను, పులకించగలను, వాటి గురించి వర్ణించి రాయగలను, పాడగలను, కెమెరా లో చూప

మూడు పాటల కథ

Image
అనగనగా నేను.  ఘజళ్ళ పిచ్చి దాన్ని.  నాకు జరిగిన కథే ఇది.  ఎన్నో మలుపులు, మిస్టరీ, నవలల్లో లాగా సంఘటనలు వెంటవెంటనే అవ్వకుండా ... మధ్యలో కొన్ని సంవత్సరాల గాప్ .... ఊహాతీతంగా, థ్రిల్ కలిగించిన కథ ఇది.  పైన వర్ణించిన అనుభూతులన్నీ మీకు కూడా కలగుతాయి ఈ కథ మీరు చదివితే. మీరు సంగీత ప్రియులవ్వాలి అంతే.  కథా క్రమం లో ముందుగా 2007-2008 ప్రాంతం ...  మా అక్క సుష్మ వరల్డ్ స్పేస్ రేడియో లో రేడియో జాకీ, ప్రోగ్రాం డైరెక్టర్ (అసిస్టెంట్) గా చేస్తూ ఉండేది.  లలిత సంగీత సామ్రాట్ చిత్తరంజన్ గారు ఆ రేడియో కి ఓ సంగీత పరమైన షో చేసేవారు.  నేను అక్కడ పని చెయ్యకపోయినా మా అక్క ని పికప్ చేసుకోడానికి వెళ్లేదాన్ని. రచయిత్రి మృణాళిని గారు అప్పుడు అక్కడ ప్రోగ్రాం డైరెక్టర్. మా మధ్య చాలా సాహితీ, సంగీత చర్చలు జరుగుతూ ఉండేవి.  ఒక సారి నేను వెళ్ళినప్పుడు చిత్తరంజన్ గారు వచ్చి ఉన్నారు. ఆయన ఓ తెలుగు సినిమా పాట  కి ఒరిజినల్ ఓ ఘజల్ అని ... ఆ ఘజల్ గుర్తు రావట్లేదు అని అన్నారు. నా ఘజళ్ళ పిచ్చి తెలిసిన మృణాళిని గారు ... ఇదిగో ఈ అమ్మాయి ని అడుగుదాం అన్నారు.  ఆయన తెలుగు పాట పాడారు. అది చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఫేవరేట్ పాట! మా అమ్

సెలవు చీటీ.. రెండేళ్లు లేటు గా

 రెండేళ్లు  2020 జులై నాలుగో తారీఖు న అమెరికా మీద బ్లాగు రాసినప్పుడు నేను ఊహించలేదు ..  ఇంత పెద్ద గాప్ వస్తుంది అని. దీని వెనక అమెరికా కుట్ర కూడా ఉండి ఉండవచ్చు  ఎందుకు రాయలేదు అని అడిగితే ... నిజమే చెప్తాను. అది కొంత వ్యక్తిగతమైనా.  ప్రొఫెషనల్ గా చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చిందండి. ప్రశాంతంగా రాసే మానసిక స్థితి లేదు.  నా పని సినిమా. నేను అష్టా చెమ్మా, మిథునం సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి అవార్డులు అందుకున్నాను. రైటర్ డైరెక్టర్ గా మూడు సార్లు సినిమా సైన్ చేసాను కానీ అవి ముందుకు కదల్లేదు. ఈ లోపు కరోనా. చాలా నిరాశలోకి వెళ్ళిపోయాను.  ఇప్పుడు రాయడం మొదలు పెడుతున్నాను అంటే సినిమా సైన్ చేసేసాను అని కాదు. పరిస్థితి ని accept చేసాను అని.  ఆ మధ్య నలభయ్యో పుట్టిన రోజు జరుపుకున్నాను. కొంత పరిపక్వత వచ్చి పడిపోయింది. జీవితం లో దేని దారి దానిదే అనిపించింది.  ఈ బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు నాకేం కావాలి అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక ఆలోచన వచ్చింది.. ఫ్రీ ప్లాట్ఫారం ఉంది కదా అని రాసేసాను. అలా 48 వారాలు రాసాను.  తెలుగు బ్లాగింగ్ కమ్యూనిటీ ఇంత బాగుంది అని అప్పుడ