Posts

Showing posts from October 9, 2022

కానుకా శాస్త్రం

నాకు పుట్టినరోజులంటే ఎంత ఇష్టమో 'నేను పుట్టాను' అనే పోస్టు లో వెళ్లబోసుకున్నాను ... గుర్తుందా?  పిచ్చి ముదిరి నా పుట్టినరోజులే కాక పక్క వాళ్ళ పుట్టినరోజులంటే కూడా బాగా ఉత్సాహం పెరిగిపోయింది అది రాసినప్పటి నుంచీ.  నాకంటే చిన్న పిల్లలకి 'నేను మూడు పుట్టినరోజులు జరుపుకుంటాను... నువ్వు కూడా జరుపుకోవచ్చు' అని బాగా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నాను. వాళ్ళ తల్లితండ్రులు నన్ను బాగా తిట్టుకున్నా సరే. అయితే నేను ఇచ్చే ట్విస్ట్ ఏంటంటే ఈ తరం పిల్లల కి మూడు పుట్టిన రోజుల ఆశ చూపించి వారు పుట్టిన తిథి, నక్షత్రం, తెలుగు మాసం, తెలుగు సంవత్సరం పేరు తెలుసుకుని గుర్తుంచుకునేలా చేస్తున్నాను. ఐటం సాంగ్ లో మెసేజ్ ఓరియెంటెడ్ లిరిక్స్ పెట్టినట్టు అన్నమాట.  పిల్లలు ఆల్రెడీ పుట్టినరోజులంటే excited గా ఉంటారు కాబట్టి అక్కడ నా పని సులువు.  కానీ ఈ పెద్దవాళ్ళున్నారే ... అబ్బా.. ఎందుకో వీళ్ళకి పుట్టినరోజులంటే అంత నీరసం.  మీరు ఏమైనా అనుకోండి.  బాగా డబ్బులు సంపాదించుకుంటూ, మంచి పొజిషన్ లో ఉన్నవాళ్లు పుట్టినరోజు జరుపుకోపోతే నాకు మహా చికాకు. ఏ... అంత కష్టం ఏం వచ్చిందని? త్రివిక్రమ్ గారు చెప్పినట్టు డబ్బున్న వాళ