Posts

Showing posts from September 4, 2022

హ్యాపీ వెయిటింగ్

Image
తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన ఈ కలువ నిరీక్షణ... ఎదురుచూడడం, వెయిటింగ్ .... వీటి గురించి రాద్దామనుకోగానే నాకు 'కలువ నిరీక్షణ' అనే సాహిత్యమే గుర్తొచ్చింది ఎందుకో.  తుషార శీతల సరోవరం లాంటి అందమైన సెట్టింగ్ లో ఎవరైనా బానే ఎదురుచూస్తారు. కానీ విషయం విషమం అయిపోయి, పరిస్థితులు పీకల మీదకి వచ్చేసినప్పుడు, అలా వచ్చిన రాకపోయినా మనం వచ్చేసినట్టే ఆందోళన పడిపోతున్నప్పుడు ఏం చేయాలి? అసలు ఎదురుచూడటం అంటేనే విసుగు ఉన్న వారు ఏం చేయాలి?  ఇష్టం ఉన్నా లేకపోయినా జీవితం లో ఎదురుచూపులు తప్పవు కదా.  బస్సు కోసం, డొమెస్టిక్ హెల్ప్ కోసం, ఓ మంచి అవకాశం కోసం, ప్రేమ ప్రతిపాదన చేసాక ఎదుటి వ్యక్తి సమాధానం కోసం, మెడికల్ రిపోర్ట్స్ కోసం, అవి పుచ్చుకొని డాక్టర్ దగ్గర మన వంతు కోసం, సమాజం లో మార్పు కోసం, ఓ సినిమా లో ఎప్పటికీ మొదలవ్వని కథ కోసం, సంతానం కోసం, ప్రొమోషన్ కోసం, లక్ తిరగడం కోసం, రివెంజ్ కోసం, అప్పు కోసం, ఆ అప్పు తీర్చడం కోసం, సొంత ఇంటి కోసం, కలల జీవితం కోసం, పుట్టినరోజు కోసం, బరువు తగ్గడం కోసం.... చివరికి మరణం కోసం... ఎదురుచూపులు తప్పవు కదా. (పైన పేరా అనుకోకుండా దండకం ఛందస్సు లో వచ్చిందేమో అని అ