Posts

Showing posts from August 5, 2018

అంట్లు తోమడం - ఓ అధ్యయనం

ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు నేను అంట్లు తోమాలి. మా ఇంట్లో అంట్లే. మా డొమెస్టిక్ హెల్ప్ పెళ్లి కి వెళ్ళింది. అందుకని. First things first, నాకు పనిమనిషి అనే పదం కంటే డొమెస్టిక్ హెల్ప్ అనటమే ఇష్టం (ఈ టాపిక్ మీద తర్వాత మాట్లాడుకుందాం) మా 'హెల్ప్' రాకపోవటం వల్ల ఆమె చేసే ఇంటెడు పని ని మాలో మేమే పంచుకోవడం లో - నేను ఇష్టం గా తీసుకున్న పని అంట్లు తోమడం. ఎందుకు ఇష్టమో .. చివర్లో చెప్తాను. ఏ పని చేసినా నా షరతుల మీద చెయ్యటం నాకు అలవాటు. 1. నేను రోజుకి ఒక్క సారే తోముతాను. ఎన్ని పడినా ఫర్వాలేదు. 2. పెద్ద కుక్కర్ తోమను. అది తోమాలంటే నీరసం... తోమాక ఆయాసం. అందుకే. 3. నేను తోముతుంటే మధ్యమధ్య లో కొత్త అంట్లు వెయ్యకూడదు. అన్నీ ఒకే సారి వేసేయాలి. 4. మధ్యమధ్యలో ఆ గరిట కావాలి, ఈ ప్లేట్ కావాలి అని అడగకూడదు. అన్నీ అయ్యాకే వాడుకోవాలి. ఇంట్లో వాళ్ళు కాబట్టి ఇన్ని షరతులకీ ఒప్పుకొని పని చేయించుకుంటారు పాపం. ఒక్కోసారి మా 'హెల్ప్' వచ్చే వరకూ కంచాలు, టిఫిన్ ప్లేట్లు throw-out వి వాడటం కూడా కద్దు! మా వాళ్ళు అంత దయార్ద్రహృదయులు 😊 నేను అంట్లు తోమాలంటే పీచు, విమ్ సరిపోవు. Laptop, blue tooth earp

'ఫ్రెలసీ'

ఫ్రెండ్షిప్ డే అయింది కదా కొన్ని రోజుల క్రితం ...  అసలు ఈ ఫ్రెండ్షిప్ డే ఎందుకొచ్చింది లాంటివి నేను చెప్పాల్సిన అవసరం లేదు ..  ఇక్కడ చదువుకోవచ్చు ...  ప్రతి 'రోజు' లాగానే ఎఫ్ ఎం రేడియోల ప్రోగ్రామ్స్..... మాల్స్ లో డిస్కౌంట్స్, వాట్సాప్ లో అవే అవే మెసేజులు ... ఈ టాపిక్ మీద సినిమాల్లో అవే అవే పాటలు ....  సెలెబ్రిటీ స్నేహాల మీద ఆర్టికల్స్ ...   ఇంకో వైపు 'ఈ దినాలు ఏవిటండీ?' అంటూ అవే అవే వాపోవడాలు ...  అందుకే 'హ్యాపీ ఫ్రెండ్షిప్ డే' లోంచి 'డే' తీసేస్తున్నాను నేను ..  హ్యాపీ ఫ్రెండ్షిప్ గురించి మాత్రం మాట్లాడుకుందాం  ఫ్రెండ్షిప్ కి హ్యాపీ గా ఉండే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ అడుగడుగునా స్వేఛ్చ ఉంది. (ఈ గూగుల్ లో చ కి ఛ వత్తు ఇచ్చుకునే స్వేఛ్చ మాత్రం లేదు 😞)   1. స్నేహితుడ్ని ఎంచుకోవడం లో స్వేఛ్చ.. (బలవంతంగా మన మీద పడేసిన రక్తసంబంధాల్లా కాక)  2. ఆ స్నేహం ఎలా ఉండాలో నిర్ణయించుకునే స్వేఛ్చ ... (మా మావయ్య ఫ్రెండ్ ఆదివారాలు ఇంటి కొచ్చి ఒక్క మాట మాట్లాడకుండా న్యూస్ పేపర్ మొత్తం చదువుకుని, కాఫీ తాగి వెళ్ళిపోయేవారు. ఇది వాళ్ళ ఫ్రెండ్షిప