Posts

Showing posts from December 2, 2018

'చలన' చిత్రాలు

Image
పోయిన వారం రెండు అద్భుతమైన సినిమాలు చూసాను. (లీగల్ గా .. హాట్ స్టార్ లో)  కోకో, ఫెర్డినాండ్ .. రెండూ యానిమేటెడ్ సినిమాలే.  ఈ సినిమాల గురించి మాట్లాడుకునే ముందు నాకూ యానిమేటెడ్ సినిమాలకూ ఉన్న అనుబంధం గురించి చెప్పాలి.  జీవితం లో కొన్ని గొప్ప విలువలని, ప్రపంచాన్ని గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలని, మానవత్వం, మనిషి చరిత్ర, నైజం, ప్రకృతి, వన్యప్రాణులు, ప్రేమ, పెళ్లి.. వీటిని ఎలా అర్ధం చేసుకోవాలి అనే విషయాలని నాకు యానిమేటెడ్ సినిమాలే నేర్పించాయి.  ఈ సినిమాలు ఆల్రెడీ చూసే అలవాటు ఉన్నవాళ్లు ఇవి పిల్లలకి మాత్రమే కాదని ఒప్పుకుంటారు, నాలాగా.  ఒక్కొక్క సినిమా ఒక్కొక్క భ్రమ/హింసాత్మకత/ముతక అలవాటు ని పటాపంచలు చేసే విధంగా ఉంటుంది. ఒక్కొక్క సినిమా కథ ది ఒక్కొక్క దేశం. ఆ దేశ భాష, సంస్కృతి ని పరిచయం చేసే విధంగా ఉంటాయి ఇవి. అన్నిటిలోకి కామన్ .... మంచి సంగీతం, సరదా జోకులు, బోల్డు wisdom!  జెనరల్ గా యానిమేటెడ్ సినిమా అంటే ఫెయిరీ టేల్స్ అంటే పాత కాలం నాటి జానపద కథలు తీసేవాళ్ళు. తర్వాత రకరకాల నేపథ్యాల తో కేవలం ఈ సినిమాలకే కథ రాసుకొని తీస్తున్నారు. కొన్ని పిల్లల పుస్తకాలని కూడా సినిమాలు గా తీశారు.