Posts

Showing posts from 2019

బృంద పాకం

Image
నాకు వంట చేయడం చాలా ఇష్టం. కొత్త రెసిపీలు ట్రై చేయడం ఇంకా ఇష్టం. ఎప్పుడైనా బాగా స్ట్రెస్ గా ఉంటే వంట చేస్తే హాయి గా అనిపిస్తుంది.  నేను నాకు తెలిసినంత వరకూ శాకాహారిని. (నాకు తెలియకుండా నేను తిన్న ఆహరం లో, దినుసుల్లో ఏవైనా ingredients ఉండి ఉంటే మరి .. నాకు తెలియదు). చిన్నప్పుడు ఇంట్లో సంప్రదాయం వల్ల అయినా పెద్దయ్యాక మాత్రం బై ఛాయిస్ శాకాహారిని. వెజిటేరియన్ లో ఎన్ని వెరైటీలు ఉన్నాయంటే నాకు కుతూహలం కూడా కలగలేదు నాన్ వెజ్ వైపు! ఇలా అంటే నాకు తెలిసిన చాలా మంది నాన్ వెజ్ తినే మిత్రులు నవ్వుకుంటారనుకోండి. అయినా ఫర్వాలేదు. 😄 వేగన్ అని ఇంకో జాతి ఉన్నారు .. అసలు వీళ్ళు పాల ఉత్పత్తులు ముట్టరు. నేను అంత గొప్ప కాదండి! వీళ్ళ వల్లే నాన్ వెజిటేరియన్లని నేను ఎక్కువగా అర్ధం చేసుకోగలిగాను. నన్ను పాల ఉత్పత్తులు మానెయ్యమంటే నేను ఎలా ఫీలవుతానో వాళ్ళు మాంసాహారం వదిలెయ్యమంటే అలాగే ఫీలవుతారు కదా!  ఫుడీలకి వంట వచ్చేస్తూ ఉంటుంది ఏవిటో ... ఆహారం అంటే అభిరుచి ఉన్న చాలా మందిని చూసాను ... వారి లో దాదాపు అందరూ వంటకారులే!  వంట లో నాకు అమ్మ మొదటి గురువు. ఇంటర్నెట్ రెండో గురువు.  అమ్మ బ్రహ్మాండంగా

నా టీవీ

Image
టీవీ లో మన దేశం, రాష్ట్రాల కి చెందినవే కాక అంతర్జాతీయ ప్రోగ్రామ్స్ చూడటం నాకు  అలవాటు ... చిన్నప్పుడు దూరదర్శన్  ప్రసారం చేసిన జపాన్ దేశపు సీరియల్  'ఓషీన్'  లాంటి వాటి తో పాటు నేటి అమెరికన్ టీవీ షోల వరకూ. బిబిసి వాళ్ళ షెర్లాక్ హోమ్స్, ప్రైడ్ అండ్ ప్రెజుడీస్, అగాథా క్రిస్టీ 'పాయిరో' (Poirot) సీరియళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను!  కాకపోతే ఇప్పుడు అమెరికన్ టీవీ షోలు టీవీ లో కాక అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటివాటి లో నే చూస్తుంటాను. కమర్షియల్ బ్రేక్స్ లేకుండా .. ఎన్ని ఎపిసోడ్లు ఏక బిగిన చూడగలిగితే అన్ని ఎపిసోడ్లు (దీన్నే ఇంగ్లీష్ లో binge watching (బిన్జ్ వాచింగ్) అంటారు!)  అంతర్జాతీయ టీవీ.... (అమెరికన్ టీవీ, బ్రిటిష్ టీవీ) .. ముఖ్యంగా అక్కడి సిట్ కామ్స్ (సిట్యుయేషనల్ కామెడీలని కుదించి ఆ పేరు పెట్టారు) నాకు చాలా ఇష్టం. డిటెక్టివ్, క్రైమ్, పీరియడ్, హిస్టారికల్ .. ఇలా చాలా రకాల షోలు ఉంటాయి వాళ్ళవి. అక్కడ టీవీ సినిమా కంటే పెద్దది. టీవీ లోనే వినూత్నమైన ప్రయోగాలు మొదట చేయబడతాయి.  అక్కడ షో క్రియేటర్స్ అని వేరే రకం వాళ్ళు ఉంటారు.  వాళ్ళ పని ఓ కొత్త షోలో పాత్రల్ని, వాళ్

నుమాయిషీవైభవం

Image
హైదరాబాద్ లో ఉంటూ నుమాయిష్ కి వెళ్ళకపోతే ఈ నగరానికి ద్రోహం చేసినట్టే.  రోడ్డు మీద, బిల్డింగ్ మెట్ల మీద జర్దా ఉమ్ములు ఉమ్మే వాళ్ళ పాపం కంటే పెద్దది ఇది.  పాప భీతి తో కాకపోయినా షాపింగ్ ప్రీతి తో ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరుల్లో నాంపల్లి లో జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఉరఫ్ ఎగ్జిబిషన్ అని పిలుచుకోబడే నుమాయిష్ కి నేను తప్పనిసరిగా వెళ్తాను.  గత 20 ఏళ్ళు గా ఏదో ఒకటో రెండో సంవత్సరాలు మిస్ అయ్యుంటానేమో.  నాకు ఆ వాతావరణం చాలా నచ్చుతుంది. (పైగా మా ఇంటికి దగ్గర.) మాల్స్ రాక దశాబ్దాల మునుపే ప్రారంభమైన షాపింగ్ కల్చర్ ఇది!  నగరం లో జరిగే ఈ జాతర సజావు గా సాగడానికి పోలీసులు చాలా కష్టపడతారు!  ఏసీ లేకపోయినా చలికాలం అవ్వడం వాళ్ళ ఆహ్లాదకరమైన వాతావరణం. అంత మంది జనం... అన్ని లైట్ల వల్లనో ఏమో చలి అనిపించదు.  నుమాయిష్ లో నాకు అత్యంత ప్రీతికరమైన విషయం... పాత హిందీ పాటలు నిరంతరాయంగా స్పీకర్లలో వస్తూ ఉండటం! అంత కన్నా ఇష్టం .. మన చుట్టూ ఉన్న కొంత మంది వాటి తో పాడుతూ ఉండటం! నిన్న కిషోర్ కుమార్ పాట వస్తోంది 'తేరీ దునియా సే ... హోకే మజ్బూర్ చలా .... మే బహుత్ దూర్ .

వ్యసనానికి మందు

వ్యసనాల గురించి మనందరికీ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి.  వ్యసనపరుల్ని అసహ్యించుకుంటాం. బలహీనులు గా చూస్తాం. డిసిప్లిన్ లేని వాళ్ళు అని చులకన చేస్తాం. వాళ్ళు మారనందుకు కోప్పడతాం... విసిగిపోయి వాళ్ళని వెలేస్తాం.   అలాగే వ్యసనం అనే హెడ్డింగ్ కింద కొన్ని పేర్లే రాస్తాం ... తాగుడు, డ్రగ్స్, జూదం... ఇలా.  నేను చదివిన, చూసిన, అనుభవించిన విషయాలని పరిశీలిస్తే ఇది పూర్తి నిజం కాదు అని తెలిసింది.  వ్యసనాలని ఈ మధ్య ఓ వ్యాధి గా పరిగణించడం మొదలు పెట్టారు. ('మహానటి' సినిమా లో డైలాగ్ గుర్తుందా?) నాకు ఇది సబబు గా అనిపించింది.  ఇది కూడా ఓ వ్యాధే అని తెలిస్తే మన కటువైన దృష్టి కోణం మారుతుంది. (తలనొప్పి వచ్చినవాడ్ని చూసి జాలి పడతాం, సహాయపడతాం కానీ అసహ్యించుకోము కదా) ఇది జబ్బే. దీనికి చికిత్స కావాలి. అది కూడా ప్రొఫెషనల్ చికిత్స.  తాగనని పెళ్ళాం బిడ్డల మీద, దేవుళ్ళ మీద ఒట్టేయించుకోవడం లాంటివి కాదు దీనికి మందు.  వ్యసనానికి ఓ కారణం పలాయనవాదం. నిజ జీవితం భరింపరానిది గా మారినప్పుడు, ఎదుర్కొనే శక్తి లేనప్పుడు.. ఏదో ఎస్కేప్ వెతుక్కుంటాం.  మనకి తోచిన వ్యసనాన్ని మనం ఎంచు

దిల్ మే ఏక్ లెహెర్ సీ ఉఠీ హై అభీ...

Image
సముద్రమంటే ఇష్టమైన వారిలో నేనూ ఒకదాన్ని. మొదటి సారి వైజాగ్ లో ఉండే మావయ్య తీసుకెళ్లాడు... దూరం నుంచి 'అదిగో అదే సముద్రం' అన్నాడు.  నాకు ఆకాశం తప్ప యేమ్ కనబడదే! అప్పుడు మా మావయ్య  'ఆకాశం అని నువ్వు అనుకుంటున్న చోటు ని జాగ్రత్త గా గమనించు...ఓ సన్నటి లైన్ కింద నించి నీలం రంగు కొంచెం ముదురు గా కనిపించట్లేదు? అదే సముద్రం' అన్నాడు ... నేను థ్రిల్ల్ అయిపోయాను ....అప్పుడు ... I fell in love  పిల్లల తో ఎవరైనా అదే పని గా ఆడలేరు .... అలిసిపోతారు .... ఒక్క ప్రకృతే పిల్లలు అలిసిపోయే వరకూ ఎంటెర్టైన్ చెయ్యగలదు అనిపిస్తుంది! ఆ ఘోష .... ఎడతెరిపి లేని అలలు .... ఇసక... గవ్వలు ... ఆల్చిప్ప లు... వాటిలో ముత్యాలు ఉండచ్చేమో అనే వెర్రి ఆశ ... ఇష్టం లేకుండా ఉండేందుకు యేమీ లేదు సముద్రం లో  నాకు అలల తో కబడ్డీ ఆడటం ఇష్టం.... మొన్న  వచ్చిన ఓ హిందీ సినిమా లో ఈ సీన్ చూసి అందరికీ ఈ ఆట తెలుసన్నమాట అనుకున్నా ☺ ఇంత ఇష్టమైన సముద్రాన్ని ఎక్కువ సార్లు చూసే అవకాశం కలగలేదు నాకు. .. విధి చేసే వింత కాకపొతే భూమి మీద మూడొంతులు నిండిన సముద్రాన్ని చూడటం అంత కష్టమా?  ఆ విధే ఇంకో వింత చేసింది. ప