నా 'పాఠ్య'పుస్తకప్రేమ
ఈ మధ్య ఇంగ్లీష్ బ్లాగు లో రెండు భాగాలు గా రాసిన ఓ టాపిక్ ఇక్కడ కూడా పంచుకుందామని ఈ పోస్టు రాస్తున్నాను. మీరు ఇంగ్లీష్ లో చదవాలనుకుంటే ఇదిగోండి లింకులు ... https://sowmyaticlife.blogspot.com/2024/10/the-textbooklover-part-1.html https://sowmyaticlife.blogspot.com/2024/10/the-textbooklover-part-2.html నేనేదో నా మానాన నేనున్నా. సండే హిందూ పేపర్ గురువారం రోజు తాపీగా చదువుతున్నా. అందులో శ్రీ కేకీ దారువాలా అనే రచయిత కి నివాళి అర్పిస్తూ ఓ ఆర్టికల్ రాశారు. ఈయన పేరు ఎక్కడో విన్నాను అనిపించింది. కానీ వెంటనే గుర్తు రాలేదు. అలా అని వదిలెయ్యబుద్ది కాలేదు. అదిగో అక్కడ మొదలైంది ఈ యవ్వారమంతా. మనం జ్ఞాపకాలు నీట్ గా సద్ది ఉన్న అలమార లాగా ఉండవు. కేబుల్ బాక్స్ లో చిక్కు పడిపోయిన వైర్లలాగా ఉంటాయి ఏంటో. ఒకటి లాగితే రాదు, ఇంకోటి వస్తుంది. ఆ వచ్చిందానికీ దీనికీ సంబంధం ఉండదు. ఒక్కోసారి ఒకటి లాగితే చిక్కుపడిపోయిన వైర్లన్నీ దానితోనే వచ్చేస్తాయి. అలా అని వదిలేస్తే ఆ బైటికొచ్చిన జ్ఞాపకం ఏ పంటిలో ఇరుక్కుందో తెలీని ఆహార పదార్ధం లాగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది .. ఓ ఛాలెంజ్ గా వెక్కిరిస్తుంటుంది. ఓపికగా ఒకే వైర్ ని గ