ట్రిబ్యూట్ టు అవర్ డాడ్

డిసెంబర్ పదిహేనో తారీఖున మా నాన్న గారు వెళ్లిపోయారు. 

గత కొన్ని మాసాలుగా అస్వస్థులుగా ఉన్నారు. 

ఇక్కడి నా కమ్యూనిటీ కి ఈ విషయం షేర్ చేస్కోవాలనిపించి రాస్తున్నాను. 

మా నాన్న గారికి ఓ చిన్న ట్రిబ్యూట్ ని మా 'సా పా సా' ఛానెల్ లో అప్లోడ్ చేసాం. అదే ఇక్కడ కూడా పోస్టు చేస్తున్నాను. 





మా నాన్న గారి కి మెలోడ్రామా అస్సలు ఇష్టం ఉండదు... ఉండేది కాదు (నాన్న గారి విషయం లో past tense వాడటం ఇప్పుడిప్పుడే అలవాటవుతోంది). ఎంత పెద్ద కష్టమైనా మూవ్ ఆన్ అయిపోవడమే కరెక్ట్ అనేవారు. ఆ స్ఫూర్తి తోనే మళ్ళీ రొటీన్ లో పడటానికి ప్రయత్నిస్తున్నాం మేము. 

నా ప్రతి బ్లాగ్ పోస్టు చదివేవారు డాడ్. 

కవి హృదయం  పోస్టు లో రెండు తలల దూడ కవిత కి ఆయన వాట్సాప్ లో నాకు కామెంట్ పంపించారు. ఆ దూడని బతికుండగా చూడలేని లోకం museum లో పెడితే మాత్రం చూడటానికి వెళ్తుంది మరి ... అని అన్నారు. నాకు నిజమే కదా అనిపించింది. 

ఆఖరి పోస్టు ఆయన పోయిన రోజు రాసాను  .. కొన్ని గంటల ముందు. అదొక్కటే చదవలేకపోయారు. 

వచ్చే పోస్టు త్వరలో రాస్తాను. నార్మల్సి కి మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తుంది అప్పుడు.  



Comments

  1. అరరే, విషాదకరమైన వార్త. అస్వస్థత అని మీరు పైన వ్రాశారు గానీ ఎక్కువ suffer అవలేదని ఆశిస్తాను.

    అవును, మీ బ్లాగ్ పోస్టుల క్రింద అప్పుడప్పుడు కామెంట్లు పెడుతుండేవారు. నాకు గుర్తుంది. నిట్టల రామ్మూర్తి గారే కదా?

    వారిని, వారి రాగమాలికను జ్ఞాపకం చేసుకుంటూ విడియో రూపంలో చక్కటి నివాళి సమర్పించారు మీరు.

    మీకందరకూ నా సంతాపం. మీ తండ్రిగారి ఆత్మకు సద్గతులు తప్పక లభిస్తాయి 🙏.

    ReplyDelete
  2. చక్కని నివాళి 🙏

    ReplyDelete
  3. నానాటి బ్రతుకు పాట చక్కగా పాడారు...ఫుల్ వీడియో ఉందా ? మీ వెబ్ సిరీస్ ఇపుడే చూసాను. మొదలు పెట్టి 7సంవత్సరాలకు పైగా అయినట్లుంది. కొన్ని tributes చాలా బాగా చేసారు. వీడియో క్వాలిటీ చాలా బాగుంది. మీ చానెల్ underrating ఉంది.కొన్ని షార్ట్స్ చేయండి. మీరు కూడా పాప్యులర్ అవుతారు.

    ReplyDelete
  4. aayanki aatmasanti kalagaali, Om Shanti..

    ReplyDelete
  5. మీ నాన్నగారికి ఇష్టమైన పాటలన్నీ నేనెంతో ఇష్టంగా పాడుకునేవి - నాకు నచ్చిన ట్యూన్‌లో, నాకు మాత్రమే వచ్చిన ట్యూన్‌లో.

    మీ ట్రిబ్యూట్లో పాటలూ, మీ నాన్నగారి గురించిన మాటలూ విన్న తర్వాత - ఈ మాటలన్నీ మీ నాన్నగారు చదవగలిగి, వినగలిగి వుంటే ఆయన ఎంత ఆనందించి వుండేవారో కదా అనిపించింది.

    మీ జ్ఞాపకాలలో మీ నాన్నగారి పాటలూ, నవ్వులూ నిండివుండుగాక ఎప్పుడూ!

    ReplyDelete

Post a Comment