నా టీవీ

టీవీ లో మన దేశం, రాష్ట్రాల కి చెందినవే కాక అంతర్జాతీయ ప్రోగ్రామ్స్ చూడటం నాకు  అలవాటు ... చిన్నప్పుడు దూరదర్శన్  ప్రసారం చేసిన జపాన్ దేశపు సీరియల్  'ఓషీన్'  లాంటి వాటి తో పాటు నేటి అమెరికన్ టీవీ షోల వరకూ. బిబిసి వాళ్ళ షెర్లాక్ హోమ్స్, ప్రైడ్ అండ్ ప్రెజుడీస్, అగాథా క్రిస్టీ 'పాయిరో' (Poirot) సీరియళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను! 

కాకపోతే ఇప్పుడు అమెరికన్ టీవీ షోలు టీవీ లో కాక అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటివాటి లో నే చూస్తుంటాను. కమర్షియల్ బ్రేక్స్ లేకుండా .. ఎన్ని ఎపిసోడ్లు ఏక బిగిన చూడగలిగితే అన్ని ఎపిసోడ్లు (దీన్నే ఇంగ్లీష్ లో binge watching (బిన్జ్ వాచింగ్) అంటారు!) 

అంతర్జాతీయ టీవీ.... (అమెరికన్ టీవీ, బ్రిటిష్ టీవీ) .. ముఖ్యంగా అక్కడి సిట్ కామ్స్ (సిట్యుయేషనల్ కామెడీలని కుదించి ఆ పేరు పెట్టారు) నాకు చాలా ఇష్టం. డిటెక్టివ్, క్రైమ్, పీరియడ్, హిస్టారికల్ .. ఇలా చాలా రకాల షోలు ఉంటాయి వాళ్ళవి. అక్కడ టీవీ సినిమా కంటే పెద్దది. టీవీ లోనే వినూత్నమైన ప్రయోగాలు మొదట చేయబడతాయి. 

అక్కడ షో క్రియేటర్స్ అని వేరే రకం వాళ్ళు ఉంటారు.  వాళ్ళ పని ఓ కొత్త షోలో పాత్రల్ని, వాళ్ళ ప్రపంచాన్ని సృష్టించడమే. (Chuck Lorre, Marta Kaufman, Nigel Lythgoe, Julian Fellowes, Simon Cowell ఈ కోవ కి చెందిన వాళ్ళు) ఎపిసోడ్లు కొన్ని మాత్రమే వాళ్ళు రాస్తారు. వాళ్ళ నుంచి రైటర్స్, డైరెక్టర్స్ సలహాలు తీస్కొని ఎపిసోడ్ కంటెంట్ క్రియేట్ చేస్తారు. 

వాళ్ళు ఒక షో మొదలు పెట్టే ముందే ఈ కథ ఎన్ని ఎపిసోడ్లు అని అనేసుకుంటారు. ఒక్కో సారి కొన్ని ఎపిసోడ్లు మాత్రమే షూట్ చేసి ప్రసారం చేస్తారు. వాటిని సీజన్స్ అంటారు. ఈ ఎపిసోడ్లు సంవత్సరానికి 24 వరకూ ఉంటాయి. మళ్ళీ ఆ షో చూడాలంటే ఇంకో సంవత్సరం ఎదురు చూడాల్సిందే! ఈ ఎదురుచూపులు వాళ్ళకి అలవాటే! ఒక సీజన్ కి ఆదరణ లేకపోతే షో కాన్సెల్ చేసేస్తారు.... నిర్దాక్షిణ్యం గా. 

(కొన్ని సంవత్సరాల తరబడి నిర్విరామంగా ఉన్న డైలీ సీరియళ్లు వాళ్ళకి కూడా లేకపోలేదు. అవి కూడా మెలోడ్రామాటిక్ గా ఉంటాయి అని వాళ్లే ఒప్పుకుంటారు .. జోకులేసుకుంటారు కూడా.)

అక్కడ వాళ్ళు టీవీ షోలకి ఎంత అభిమానం చూపిస్తారంటే ... ఇంటర్నెట్ లో వాటికి ఫాన్ సైట్లు ఉంటాయి. ఫాన్ ఫిక్షన్ అనే ఇంకో తమాషా అలవాటు ఉంది వాళ్ళకి. షో లో వచ్చే సీజన్  ఏం జరగబోతోందో ...ఏం జరిగితే బాగుంటుందో (అయిపోయిన ఎపిసోడ్లలో ఏం జరిగితే బాగుండేదో)... ఊహాగానాలు, వీళ్ళ సొంత స్క్రీన్ ప్లేలు లాంటివి బ్లాగుల్లో, ఇంటర్నెట్ ఫారమ్స్ లో రాసేసుకుంటూ ఉంటారు! 

వాళ్ళకి హాలోవీన్ అనే పండగ ఉంది కదా ... ఆ రోజు విచిత్ర వేషధారణ లో తిరుగుతూ ఉంటారు .. ఆ వేషాల్లో టీవీ పాత్రల వేషాలు కూడా వేస్తారు! అంతగా ప్రజల జీవితాల్లో భాగమయిపోతాయి అక్కడి టీవీ కార్యక్రమాలు! 

అందులో వాళ్ళ తప్పు లేదు ..😉. అవి ఎంత తమాషా/ముఖ్యమైన/నవ్వించే/అలరించే విషయాలను స్పృశిస్తూ ఉంటాయి అంటే నచ్చక మానవు! ఈ దేశం లో ఉండే నాలాంటి చాలా మంది అభిమానులు ఉన్నారు అమెరికన్ టీవీ కి! 

నాకు నచ్చిన కొన్ని షోలు .. నేను మళ్ళీ మళ్ళీ చూసేవి, ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి. 

1. ఫ్రెండ్స్ - నాదొక కొటేషన్ ఉంది .... ప్రపంచం లో రెండే జాతులు ఉన్నాయి ... 'ఫ్రెండ్స్' షో నచ్చినవారు .. 'ఫ్రెండ్స్' షో చూడనివారు అని. ఆ షో అంత ఇష్టం నాకు. ఈ షో కి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇందులో ఉన్న ఆరుగురు ముఖ్య పాత్రలకి పదేళ్ల క్రితమే ఎపిసోడ్ కి ఒక మిలియన్ డాలర్లు చెల్లించే వారు. అంత హిట్ ఈ షో.  1994 నుంచి 2004 వరకూ ఓ పదేళ్ల పాటు .. సంవత్సరానికి 24 ఎపిసోడ్ల చప్పున నడిచిందీ సిట్ కామ్. మన్హట్టన్ లో ఉండే ఆరుగురి మంచి మిత్రుల కథ. ఇది నేను కొన్ని పదుల సార్లు మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకూ చూసేసి ఉంటాను. అన్ని సార్లు చివరి ఎపిసోడ్ చూసి బాధేస్తుంది... I miss them badly! 

2.  క్రిమినల్ మైండ్స్ - సీరియల్ కిల్లర్ల సైకాలజీ ని అర్ధం చేస్కుంటూ వాళ్ళని పట్టుకోవడమే పని గా ఉండే FBI లో ఓ టీం కి వచ్చే కేసులే ఈ షో ఎపిసోడ్లు. ఈ షో ఒకే సారి ఎక్కువ ఎపిసోడ్లు చూడలేం .. కొంచెం గుండె దిటవు చేసుకోవాలి! యదార్ధాల తో సంబంధం ఉన్న కేసులు ఇవి .. అయినా హింస ని ఎంత వరకూ చూపించాలో అంత వరకే చూపిస్తారు. సైకోలని, సేడిస్టులని పట్టుకొనే వాళ్ళ జీవితాలు కూడా ఎలా ఎఫెక్ట్ అవుతాయో ఇందులో చూపిస్తారు. 

3. మాడర్న్ ఫామిలీ - ఈ షో ఇంకా నడుస్తోంది. అమెరికా లో ఉండే ఓ నేటి తరం ఫామిలీ ... వారి జీవితాల్లో జరిగే కామెడీ ... ఈ సీరియల్ లో మొదటి సారి ఓ గే కపుల్ ని చూపించారు. వాళ్ళు ఈ మాడర్న్ ఫామిలీ లో ముఖ్య పాత్రధారులు .. వాళ్ళ సంసారం చూస్తే మనకి చాలా నార్మల్ గా అనిపిస్తుంది .. దంపతుల మధ్య ఉండే పోట్లాటలు, అలకలు, పిల్లల్ని పెంచడం ... అన్నీ మామూలు గా ఉంటాయి .. ఇందులో ఆశ్చర్యం ఏముంది .. వాళ్ళూ మనుషులే కదా అనిపిస్తుంది! 

4. సో యూ థింక్ యూ కెన్ డాన్స్ - ఇదొక డాన్స్ రియాలిటీ షో. కళ ... దాని అత్యంత ప్యూర్ రూపం లో ఈ షో లో కనిపిస్తుంది. డ్రామా అస్సలు ఉండదు. ప్రపంచ నాట్య రీతులన్నీ ...  ఒక్కొక్క వారం చెయ్యాలి సెలెక్ట్ అయినవాళ్లు. ఒకే రీతి లో ట్రెయిన్ అయిన వాళ్ళు ఒక్కో వారం వాళ్ళకి అంత వరకూ పరిచయం లేని ఓ కొత్త నాట్య రీతి లో కేవలం ఏడు రోజుల్లో ట్రెయిన్ అయ్యి చేస్తూ ఉంటే చూడటానికి భలే ఉంటుంది! అక్కడి డాన్సర్లు ఫిట్ నెస్ కి ఎంత విలువ ఇస్తారు .. శరీరాన్ని ఎంత చక్కగా చూసుకుంటారు .. ఇలాంటివి చూస్తే ముచ్చటేస్తుంది. మన దేశం లో మొదలైన ఎన్నో డాన్స్ రియాలిటీ షోలకి, డాన్సర్లకి, ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్లకి ఈ షో నే స్ఫూర్తి! 

5. మాస్టర్ షెఫ్ - ఇది అమెరికన్ షో కాదు .. ఆస్ట్రేలియన్ షో. ఇది కూడా రియాలిటీ షో యే. వంటలకి సంబంధించింది. ప్రొఫెషనల్ అనుభవం లేని ఇంట్లో వంటలు వండుకుంటూ వేరే ఏదో ఉద్యోగం చేస్కుంటూ కుకింగ్ అంటే పాషన్ ఉన్న అమెచ్యూర్ కుక్స్ ని కొంత మందిని సెలెక్ట్ చేసి వారి మధ్య పోటీ పెడతారు. ఇందులో కూడా డ్రామా ఉండదు. పాక కళ ని ఎంత కూలంకషంగా ఈ షో చూపిస్తుందో! ఈ షో లో ఓ విషయం చూసి ఆశ్చర్యపోయా నేను ... ప్రతి వారం గెస్ట్ జడ్జి లు గా షెఫ్ లని పిలుస్తూ ఉంటారు. ఈ పోటీదారులందరికి ఆ షెఫ్ లు తెలియడమే కాదు .. మనం సినీ తారల్ని అభిమానిస్తాం చూడండి .. ఆ లెవెల్లో ఉంటుంది వీళ్ళ అభిమానం! 

6. ది బిగ్ బ్యాంగ్ థియరీ - ఇది కూడా ఇంకా వస్తోంది. అమెరికా లో బాగా చదువుకొనే వాళ్ళని గీక్స్ అనీ, నెర్డ్స్ అనీ వెక్కిరిస్తారు. మనం పుస్తకాల పురుగులు అంటాం చూడండి .. అలా అన్నమాట. వీళ్ళకి పుస్తకాలే తప్ప ప్రపంచం లో ఎలా ఉండాలో తెలియదు అని, వీళ్ళకి అమ్మాయిలు పడరు అని నవ్వుకుంటారు. అలాంటి నలుగురు కుర్ర మేధావుల కథ ఇది. (అందులో ఒకడు భారతీయుడే!) ఇందులో నాకు చాలా విషయాలు ఇష్టం. అమ్మాయి మేధావుల  పాత్రలు (ఏమీ, బెర్నాడెట్ అనే ఇద్దరు ఆడ సైంటిస్ట్ లు) ఇందులో ముఖ్య పాత్రధారులు. సైన్స్ రంగం లో మేధావులు, నోబెల్ గెలిచిన వారు ఇందులో గెస్ట్ స్టార్స్ గా వస్తూ ఉంటారు ... (స్టీఫెన్ హాకింగ్ వస్తారు ఓ ఎపిసోడ్ లో!) 

7. డౌన్ టన్ ఆబీ - ఇది ఓ బ్రిటిష్ టీవీ షో. ఆరు సీజన్ల పాటు వచ్చింది. 1900 ల్లో ఓ ఎస్టేట్ లో జరిగే కథ. రెండో ప్రపంచ యుద్ధ కాలం కూడా కవర్ చేస్తుంది ఈ షో. బ్రిటిష్ వాళ్ళ భేషజపు జీవితం, సర్వెంట్ సిస్టం, యుద్ధం వాళ్ళని మార్చిన తీరు, ఆడవారి జీవితాల్లో వచ్చిన మార్పు, అప్పటి హెయిర్ స్టైల్స్, కార్లు, చెప్పులు, బట్టలు, భావజాలాలు  ... ఒకప్పుడు పరిస్థితి ఇంత భయంకరంగా ఉండేదా అని అనిపిస్తుంది ఈ సీరియల్ చూస్తే! ఈ షో షూట్ చెయ్యడం కోసం ఓ నిజమైన కాజిల్ ని తీసుకున్నారు .. లండన్ కి కొద్ది దూరం లో ఉంటుందట అది. నేను ఈ సీరియల్ మీద వచ్చిన ఓ పుస్తకం కొనేసాను .. ఎప్పటికైనా High Clere Castle ని చూడాలనే ప్లాన్ వేసుకున్నాను! 



8. గేమ్ ఆఫ్ థ్రోన్స్ - దీని గురించి మాట్లాడకపోతే ఎలా? ఇది ఆఖరి సీజన్ ఏప్రిల్ లో వస్తోంది. సంవత్సరంన్నర నుంచి వెయిటింగ్ దీని కోసం! రాచరికపుటెత్తులు ... రణరంగపు జిత్తులు .. చరిత్ర లో నిజంగా జరిగిన జుగుప్సాకరమైన హింస ... వీటిని చూపిస్తుంది ఈ సీరియల్. ఒక పుస్తకం ఆధారంగా తీశారు. పుస్తకం లో ఉన్న హింసే ఎక్కువట .. అది చూపించలేక సీరియల్ లో తగ్గించారట!! ఇప్పటికే ఆఖరి సీజన్ ఎలా ఉండబోతోందో అని అభిమానుల ఊహాగానాలు మొదలయిపోయాయి. నాకు మాత్రం డైరెక్ట్ గా షో చూడటమే ఇష్టం. ఇలాంటివాటి లో పాల్గొనేంత ఓపిక లేదు! 

ఇవి కాక Castle, White Collar, How I met your mother, Lie to me, Glee.. డిస్నీ ఛానల్ లో వచ్చిన 'That's so raven', 'Lizzie Mcguire', 'The Suite Life of Zack and Cody', 'Wizards of Waverly Place' నాకు నచ్చిన టీవీ షోలలో కొన్ని. 


ఈ షోలు రాస్తున్న, డైరెక్ట్ చేస్తున్న, ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్లంటే నాకు చాలా గౌరవం. నేను సోషల్ మీడియా లో ఫాలో అయ్యే వాళ్లలో ఎక్కువ వీళ్ళే ఉంటారు. 

ఓ పుస్తకం చదివితే ఎంత మనసు వికసిస్తుందో ఈ సీరియల్స్ కూడా నాకు ఈ ప్రపంచపు పరిజ్ఞానం తెలుసుకోవడం లో అంతే హెల్ప్ చేశాయి. అమెరికన్ల షోలు ఎన్ని చూసా అంటే హాలోవీన్, థాంక్స్ గివింగ్ లాంటి వాళ్ళ పండగల గురించి తెలిసింది!. బ్లాక్ హిస్టరీ మంత్ లాంటి వాటి గురించి తెలిసింది. వాళ్ళ మాండలికాలు తెలిసాయి (సదరన్ ఆక్సెంట్ లాంటివి). న్యూ యార్క్ కి ఎప్పుడూ వెళ్లకపోయినా అక్కడ రోడ్లని గుర్తుపట్టగలనని నా నమ్మకం 😁

ముఖ్యంగా పాశ్చాత్య దేశాల మీద ఉండే అపోహలు తొలగిపోయాయి. వాళ్ళకి కూడా కుటుంబాలంటే ఇష్టమే. వాళ్ళు లూజ్ క్యారెక్టర్లు కారు. వాళ్ళ దగ్గర డైవోర్సులు ఎక్కువే .. కానీ  అది వాళ్ళు లైట్ తీసుకొనే విషయమేమీ కాదు. 

వాళ్ళ సీరియల్స్ లో కూడా తల్లిదండ్రులు వర్రీ అవుతూనే ఉంటారు .. మిడిల్ క్లాస్ డబ్బు కష్టాలు వాళ్ళకీ ఉంటాయి ... 

ప్రపంచమంతా కుగ్రామంగా మారుతున్న ఈ కాలం లో ఇలాంటి ప్రిజుడిస్ లు తొలగడమే మంచిది కదూ ... వాళ్ళు ఇంకా భారత దేశాన్ని పాములాడించేవాళ్ళ దేశమనుకుంటే మనకి కోపం రాదూ?

Comments

  1. చాలా మంచివ్యాసం. తెలుగుసీరియళ్ళకు పోగా రోజులో మరేదన్నా చూడటానికి తెలుగింటిమగాళ్ళు పెట్టిపుట్టాలి లెండి. ఆందుచేత చదివి ఇలా ఆనందించటమే మేం చేయగలిగిన పని.

    ReplyDelete
  2. అవునండి, ఆసక్తికరమైన వ్యాసం సౌమ్య గారూ.
    "ది బిగ్ బ్యాంగ్ థియరీ" సీరియల్ లో మీరు చెప్పిన భారతీయుడే కాక భారతీయ (తెలుగు) మూలాలున్న ఒక అమ్మాయి కూడా నటించింది. లలితా గుప్తా పాత్రధారిణి పేరు సరయు రావు (ఇప్పుడు సరయు బ్లూ.). అమెరికాలోని తెలుగు ప్రముఖులలో ఒకరైన, అమెరికాలో పలు దశాబ్దాలుగా విస్కాన్సిన్ యూనివర్శిటీలో తెలుగుభాష ప్రొఫెసర్ గా పనిచేసిన డాక్టర్ వెల్చేరు నారాయణరావు గారి కూతురు. ఈ అమ్మాయి తల్లి తెలుగులో ఒక సీనియర్ బ్లాగర్.

    ReplyDelete
    Replies
    1. ee vishayam naaku theliyadandi! Thank you for sharing :)

      Delete


    2. విన్నకోట వాగఱ మరి విశద పరచ
      కుండ తేటతెల్లగచేయు కుండ బద్ద
      లవదు కాని నీరము పారు లక్షణముగ
      విశ్వదాభి జిలేబియ వినవె భామ :)


      జిలేబి

      Delete
  3. టివి గురించి మంచి పరిచయం. అక్కడ దూరంగా ఉండి ఈమాట అనగలిగేరు - "ముఖ్యంగా పాశ్చాత్య దేశాల మీద ఉండే అపోహలు తొలగిపోయాయి. వాళ్ళకి కూడా కుటుంబాలంటే ఇష్టమే. వాళ్ళు లూజ్ క్యారెక్టర్లు కారు. వాళ్ళ దగ్గర డైవోర్సులు ఎక్కువే .. కానీ అది వాళ్ళు లైట్ తీసుకొనే విషయమేమీ కాదు. " - అది మామూలు విషయం కాదు. ఫ్రెండ్స్ గురించి వ్రాసి "Seinfeld" మర్చిపోయారే!

    ReplyDelete
    Replies
    1. thank you, andi! Seinfeld konni episodes choosaanu kani poorthiga follow avvaledu. andukane rayaledu. kani danikunna fan following gurinchi telusu!

      Delete

Post a Comment