పుట్టినరోజంటే తెగ ఎక్సైట్ అయిపోయేవాళ్ళ సంఘానికి మొన్నటి దాకా నేను కేవలం కమిటీ మెంబర్ ని. ఈ రోజు నుంచి స్పోక్స్ పర్సన్ ని కూడా.
మా నాన్నగారన్నట్టు నా పుట్టిన రోజు మర్నాటి నుంచి మళ్ళీ నా పుట్టినరోజు ఎప్పుడు వస్తుందా అని 364 రోజులు ఎదురు చూసే టైపు నేను.
ప్రతి నెల పదిహేడో తారీఖు న ఇంకా నా పుట్టిన రోజుకి కరెక్ట్ గా ఎన్ని నెలలు ఉందో అని లెక్కకట్టి ఇంట్లో వాళ్ళకి విసుగు తెప్పించే తరహా నేను.
ఈ విషయం లో ఎటువంటి గుంభనం, హుందాతనం, సిగ్గు లాంటివి లేకుండా ఇంగ్లీష్ డేట్ ప్రకారం, తిథుల ప్రకారం, నక్షత్రం ప్రకారం .. మూడు రోజులు పుట్టినరోజు జరుపుకునే రకం నేను.
పుట్టిన రోజు ని ఓ రోజు గా కాక ముందొక ఐదారు రోజులు, తర్వాత ఒక ఐదారు రోజులు ..అసలు నవంబరు నెలంతా నాకే గుత్తగా రాసిచ్చినట్టు స్పెషల్ గా ఫీలయిపోయే జాతి నేను.
ఎందుకు నాకింత excitement అంటే నేను చెప్పలేను. I am too excited to analyze!
చిన్నప్పుడు పుట్టిన రోజంటే కేక్, స్కూల్ ఫ్రెండ్స్ తో పార్టీ అన్నట్టే ఉండేది. మేము స్కూల్ నుంచి వచ్చేసరికి డాడ్ హాల్ లో రిబ్బన్స్ గట్రా పెట్టి డెకరేట్ చేసేవారు. కేక్ కట్ చెయ్యడం, డాడ్ కేసెట్ కలెక్షన్ లో 'Man machine' 'ABBA' లాంటి ఆల్బమ్స్ ఉండేవి .. వాటికి గంతులేసే వాళ్ళం. ఇదే బర్త్డే అంటే!
రెండో క్లాసు లో బర్త్డే పార్టీ కి నేను క్లాసు లో ఫ్రెండ్స్ ని కొంతమందిని పార్టీ కి పిలిచాను. మిగిలిన వాళ్ళు మేము కూడా రావచ్చా అంటే వాళ్ళకి వద్దు అని ఎలా చెప్పాలో తెలియక రమ్మన్నాను. మొత్తం క్లాసు క్లాసంతా పార్టీ కి వచ్చేసారు! మా వాళ్ళు పాపం పది పదిహేను మంది వరకూ ప్రిపేర్ అయ్యారు. మళ్ళీ బయటికి వెళ్లి అన్నీ తీసుకురావాల్సి వచ్చింది.
ఇప్పుడు అది తలుచుకుంటే embarrassed గా అనిపిస్తుంది.
ఆ వయసు దాటాక ఇప్పటి దాకా బర్త్డే కి నేనెవ్వరికీ పార్టీ ఇవ్వలేదు. ఇదేమీ పెద్ద principles.... 'ఉసూల్ .. ఆదర్శ్' లాంటి వాటి వల్లేమీ కాదు. కుదరక.
ఒకప్పుడు నా పుట్టినరోజు ప్లాన్లు బ్రహ్మాండంగా ఉండేవి .. అన్నీ డబ్బు తో కూడుకున్నవే. అవి ఆ స్కేల్ లో కుదరనప్పుడు నేను disappoint అయ్యేదాన్ని అని చెప్పుకోడానికి సిగ్గు పడట్లేదు. కానీ నెమ్మదిగా (చాలా నెమ్మదిగా .. ఓ ఇరవై ఏళ్ళు పట్టింది) కొన్ని విషయాలు అర్ధం అయ్యాయి. మనకు కావాల్సినవి కాదు ... మనకు అవసరమైనవి జీవితం ఇస్తుంది.
Life gives you what you NEED. Not what you WANT.
అది అర్ధం చేసుకుంటే ప్రతి పుట్టినరోజు భలే ఆనందంగా జరుపుకోవచ్చు అని తెలిసింది! అలాగే జరిగింది కూడా. జీవితమే నాకు బోల్డు surprise birthday treats ఇచ్చింది.
ఓ పుట్టిన రోజుకి ఢిల్లీ లో నా షార్ట్ ఫీల్ 'హోమ్ స్వీట్ హోమ్' కి అవార్డు తీసుకోవడం ఓ మంచి మెమరీ.
ఇంకో సంవత్సరం నా పుట్టినరోజు కార్తీక సోమవారం నాడు వచ్చింది. మా సీతమ్మ ఆంటీ (ఈ ఆంటీ గురించి విశదంగా ఇంకో పోస్టులో రాస్తా) ఆధ్వర్యం లో మా ఇంటి మేడ మీద ఉసిరి మొక్క కింది ఆవిడే బోల్డు వండి అందర్నీ పిలిచి బ్రహ్మాండంగా జరిగేలా చేశారు! నా పుట్టినరోజని నేను ఆవిడకి ముందెప్పుడూ చెప్పనేలేదు .. అది విధి ఆడిన వినోదభరితమైన నాటకం!
పోయిన సంవత్సరం నా తిథుల పుట్టినరోజు నాడే 'పెళ్ళివారమండి' షార్ట్ ఫిల్మ్ కి అవార్డు తీసుకున్నాం!
I am really grateful for such blessings!
నేను ప్లాన్ చేసుకున్నా ఇంత అందంగా ప్లాన్ చేస్కోలేనేమో అనిపించింది నాకు.
ఈ సంవత్సరం పాండిచేరి కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాను. కుదర్లేదు. కానీ ఇప్పుడే న్యూస్ లో చూసాను ... సైక్లోన్ గజా పుదుచ్చేరి చేరుతోంది, ఆ ప్రాంతం లో హై అలెర్ట్ ప్రకటించారు అని.
సో నేనూ, జీవితం మా విధులు పంచేసుకున్నాం ... ఎక్సైట్ అవ్వడం నా వంతు .. ఎగ్జిక్యూట్ చెయ్యడం దాని వంతు.
నాకు ఈ విషయం లో సిగ్గు లేదని ముందే చెప్పేసాను కాబట్టి ..
HAPPY BIRTHDAY TO ME!

![]() |
| కళ్ళల్లో ఉత్సాహం 😆 |

| CHINH INTERNATIONAL KIDS FILM FESTIVAL - 2008 Early Education Category - Gold 'HOME SWEET HOME' |
ఇంకో సంవత్సరం నా పుట్టినరోజు కార్తీక సోమవారం నాడు వచ్చింది. మా సీతమ్మ ఆంటీ (ఈ ఆంటీ గురించి విశదంగా ఇంకో పోస్టులో రాస్తా) ఆధ్వర్యం లో మా ఇంటి మేడ మీద ఉసిరి మొక్క కింది ఆవిడే బోల్డు వండి అందర్నీ పిలిచి బ్రహ్మాండంగా జరిగేలా చేశారు! నా పుట్టినరోజని నేను ఆవిడకి ముందెప్పుడూ చెప్పనేలేదు .. అది విధి ఆడిన వినోదభరితమైన నాటకం!
![]() |
| మెనూ : కొబ్బరి అన్నం, టమాటా పచ్చడి, అవియల్, పూరి, మిర్చి బజ్జి, ఆలూ బోండా, ఆవడలు, బొబ్బట్టు, పాయసం, దద్ధ్యోదనం అలియాస్ కర్డ్ రైస్ |
పోయిన సంవత్సరం నా తిథుల పుట్టినరోజు నాడే 'పెళ్ళివారమండి' షార్ట్ ఫిల్మ్ కి అవార్డు తీసుకున్నాం!
![]() |
| ITSFF 2017 BEST COMEDY - Pellivaramandi |