Posts

Showing posts from 2025

'ప్రియమైన ఆవార్ గీ' - బహుమతి పొందిన నా కథ

Image
ఉదయిని అనే ఆన్లైన్ సాహిత్య పత్రిక వారు ఉగాది కి కథల పోటీ నిర్వహిస్తే అందులో పాల్గొన్నాను.  ఎన్నాళ్ళ నుంచో నాకిష్టమైన పాటలు వింటున్నప్పుడల్లా వాటికో ప్రేమ లేఖ రాస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఉండేది. అలా పుట్టిందే 'ప్రియమైన ఆవార్ గీ'.   ఈ కథ రాయడానికి నాకు ఎక్కువ సమయం పట్టింది. ఇప్పటి దాకా రాసిన కథల తో పోలిస్తే. కథా శిల్పం తో నేనొక రకంగా ఇందులో experiment చేసాను అని చెప్పచ్చు. మామూలు కథ లాగ కాక ఓ ఘజల్ పల్లవి చరణాల తో దీన్ని అల్లడం జరిగింది. ఘజల్ ని, కథని కలిపి చేసిన ఈ ప్రయత్నం  నాకు సంతృప్తినిచ్చింది అనే చెప్పాలి (పొగరు అనుకోకపోతే).  250 పై చిలుకు కథలు వచ్చాయట. వాటిలో బహుమతి పొందిన ఒక కథ గా ఎంపిక అవ్వడం నిజంగా ఆనందాన్నిచ్చింది. ఈ పోటీ లో గెలిచిన కథలని పక్షానికి కొన్ని చొప్పున పబ్లిష్ చేస్తున్నారు. నేను ఇప్పటి వరకూ చదివిన కథల్లో ఝాన్సీ పాపుదేశి గారి 'మన్నుబోసే కాలం', అయోధ్య రెడ్డి గారి 'రెండు స్వప్నాల నడుమ గోడ' కథలు నాకు చాలా బాగా నచ్చాయి. మొదటి బహుమతి పొందిన కథ నా సెన్సిబిలిటీస్ కి అందలేదేమో అనుకుంటున్నాను.  ఈ కథ ప్రచురించి ఇప్పటికి రెండు మూడు రోజులైంది. బ్లాగు ...

ఈనాడు ఆదివారం లో నా కథ - సతీ సావి 'త్రి' సూత్రాలు

Image
ఓ రాత్రి రేడియో లో 'ఉమ్మడి కుటుంబం' సినిమా లోని సతీ సావిత్రి స్టేజీ నాటకం సీన్, పాట వినపడింది. అది వింటుండగా సతీ సావిత్రి కథ మీద దృష్టి పడింది. నాకనిపించింది ఏంటంటే, సావిత్రి లాంటి స్త్రీ ఏది నమ్మితే దానికి అదే విధంగా నుంచుంటుంది అని. అక్కడ భర్త ప్రాణం ఆమె ఆశయం. ఇంకో ఆశయం ఉంటే అక్కడ కూడా ఆమె వ్యక్తిత్వం అలాగే గుబాళించేది! మనసు చివుక్కుమనే విషయం ఇంకోటేంటంటే సతీ సావిత్రి ని ఓ ఎగతాళి ధ్వని లోనే వాడటం. ఆ దృష్టి కోణం కూడా మారాలనిపించింది. ఈ సబ్జెక్ట్ మీద కథ రాయాలనిపించింది. అదే ఈ కథ.  సతీ సావి 'త్రి' సూత్రాలు