పురుష సూక్తం
పంతొమ్మిది నవంబరు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అట.
ఇది తెలిసాక రెండు రకాల రియాక్షన్స్ వస్తాయి ..
1. 'అబ్బా .. ఈ మధ్య ప్రతి దానికి ఓ దినం తగలడింది' అని
2. 'అబ్బా! ఈ మగాళ్ళకి ఓ రోజెందుకో .. అసలు ఈ ప్రపంచమే వాళ్ళదైతే' అని
కొన్ని విషయాలు నా అనుభవం లోకి రాకపోతే నేనూ ఇలాగే రియాక్ట్ అయ్యే దాన్ని.
నాకు అసలు మగ, ఆడ అంటూ విడదీసి మాట్లాడటం నచ్చదు.
సినిమాల్లో కానీ, ఫ్రెండ్స్ లో కానీ 'బాయ్స్ బెస్ట్ ఆ గర్ల్స్ బెస్ట్ ఆ' అని సరదాగా అన్నా అక్కడి నుంచి లేచొచ్చేస్తాను నేను. అంత విసుగు.
కోతి నుంచి మనిషి evolve అవ్వటానికి ఎన్నేళ్లు పట్టిందో తెలియదు కానీ ఈ లింగభేదాల నుంచి లింగ వివక్ష ల నుంచి మనం ఎన్నేళ్లకు బయటపడతాం రా బాబూ అనిపిస్తుంది. (ఇంకా 63 లింగాలు ఉన్నాయిట మనుషుల్లోనే! ఇంక వాటిని అర్ధం చేసుకొని, స్వీకరించి, శాంతి తో కలిసి ఉండేదెప్పుడో! చాలా పనుందండి మనకి!)
ఇప్పుడు ఇది రాస్తోంది కూడా 'పురుషులారా ... ఓ పురుషులారా! మీరు ఎంత గొప్పవారు! చెమటోడ్చి... కుటుంబమనే రిక్షా ని కష్టాలనే భారం మోస్తూ .. పరిస్థితులనే ఎత్తు రోడ్డు ఎక్కుతూ .. ఎంత బాగా లాగుతున్నారు' అని చెప్పటానికి కాదు.
కొన్ని మాట్లాడుకోవాల్సిన విషయాలు మాట్లాడుకోవటం కోసం.
మా మంచి ఫ్రెండ్ ఒకబ్బాయి ఉండేవాడు. మన దేశం లో ఫ్రెండ్స్ మధ్య కూడా చుట్టరికాలు వచ్చేస్తాయి కదా ... మగాళ్లు ఫ్రెండ్స్ అయితే ఒకరినొకరు 'బాబాయి' అని పిలుచుకున్నట్లు మమ్మల్ని అక్కా అని పిలిచేవాడు. చాలా ఏళ్ళ పరిచయం తర్వాత మాకు ఓ సారి ఓ విషయం చెప్పాడు. తన చిన్నప్పుడు అతనికంటే పెద్దమ్మాయి అతన్ని లైంగికంగా వేధించింది అని. మేము షాక్ అయ్యాము. ఇలా అబ్బాయిలకి కూడా జరుగుతుందా అని.
కొన్నేళ్ల తర్వాత ఇంకో అబ్బాయి .. ఈ అబ్బాయి కి కూడా మేము అక్కలమే.... ఓ రాత్రి బస్ లో వేరే ఊరికి వెళ్తూండగా ఓ అంకుల్ వయసు వాడితో జరిగిన చేదు అనుభవం చెప్పాడు. అప్పటికి ఇతను ఇరవైల్లో ఉన్నాడు ... చిన్నవాడు కూడా కాదు!
'ఇలాంటి అనుభవాలు అబ్బాయిలకి జరగవనుకోవడం నీ అమాయకత్వం' అని మీరు అనచ్చు.
కానీ నా డౌటు వేరు ... అమ్మాయిలకి మానం, పరువు, సిగ్గు, భయం, సపోర్ట్ లేకపోవడం, అర్ధం చేసుకోకపోవడం అనే ఫాక్టర్స్ ఉండటం వల్ల వాళ్ళు చెప్పుకోలేకపోవచ్చు. కానీ వీళ్ళకి ఏంటి ప్రాబ్లమ్? ఇది మగాళ్ల ప్రపంచం కదా? మరి ఈ సమస్యల గురించి మాట్లాడరేంటి?
ఒక సారి ఓ క్రియేటివ్ మీటింగ్ జరుగుతోంది. మేము రాయబోయే ఏదో కథ గురించి డిస్కషన్ నడుస్తోంది. ఆ సందర్భం లో మేము ఇలా మగవాళ్ళకి కూడా జరుగుతాయి అని అన్నప్పుడు ఎంతో అనుభవం ఉన్న మహిళలు తెల్లబోవడం చూసాం. అదే డిస్కషన్ లో ఉన్న మగవాళ్ళు సైలెంట్ అయిపోవడం చూసాం!
ఇది నిజంగా మగాళ్ల ప్రపంచమే అయితే వాళ్ళకి అంతా న్యాయం జరగాలి... వాళ్ళకి ఎటువంటి సామజిక సమస్యా ఉండకూడదు. అలా లేదెందుకు?
ఎందుకంటే లింగవివక్ష ఆడవారి సమస్య మాత్రమే కాదు అని.
ఈ పితృస్వామ్య వ్యవస్థ వల్ల మగాళ్ళకి ఒరిగింది ఏమీ లేదు.
అమ్మాయిలు ఇలానే ఉండాలి అనే అచ్చు తయారు చేసిన ఈ పితృస్వామ్య ఫాక్టరీ నుంచే 'మగ' అచ్చు కూడా తయారయింది. దాని లో ఇమడలేకపోయిన మగాళ్ళు చచ్చారే పాపం. (అక్షరాలా. ఆత్మహత్యల్లో మగవారి సంఖ్య ఆడవారికంటే ఎక్కువుంటోందిట! మగ వాళ్ళ ఆయుర్దాయం కూడా ఆడవారి తో పోలిస్తే తక్కువే!)
వీరుడు, ధీరుడు తప్ప మిగిలిన characterizations వాళ్ళని బతకనివ్వని ఈ వ్యవస్థ లో మగాళ్ళకి ఏడ్చే స్వాతంత్రం కూడా లేదు!
అమ్మాయిలు, అబ్బాయిలు సైకిల్ చక్రాలైతే ఓ చక్రానికి బొత్తిగా గాలి తీసేసి ఇంకో చక్రానికి పేలిపోయేంత గాలి కొట్టేస్తోంది ఈ వ్యవస్థ. అందుకే ఈ బండి మీద సవారీ అంత ఇబ్బందిగా ఉంటుంది.
సో ... మగవాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి. ముందు ఈ స్పృహ కలిగించి .. వాటి గురించి మాట్లాడుకొని ... వాటిని అందరి దృష్టికి తెస్తోంది ఈ 'రోజు'.
ఇది మంచి ఉద్దేశం కదా. అందుకే -
1. లైంగికంగా వేధించబడి 'మగాడివి .. లైట్ తీస్కో' అని సలహా ఇవ్వబడిన మగవారికి
2. స్త్రీ సమానత్వాన్ని నమ్మినందుకు, ఇంట్లో 'ఆడ' పనులు చేసినందుకు, భార్య చెప్పిన మంచి మాటలు విన్నందుకు/ఆమెని మంచికి సపోర్ట్ చేసినందుకు 'వాడేం మగాడ్రా?' అనిపించుకున్న మగవారికి
3. domestic abuse .. అంటే గృహ హింస అనుభవిస్తున్నా 'ఇదో సమస్య కాదు' అని జోక్ గా తీసిపారేయించుకున్న మగవారికి
4. ఇంట్లో పోరు పడలేక పెళ్లి చేసుకొని .. ఆ కుటుంబాన్ని పోషించేందుకు తనకిష్టం లేని ఉద్యోగాన్ని చేస్తూ, తమ కలల్ని మర్చిపోలేక మర్చిపోయిన మగవారికి
5. బట్ట తల, బాన పొట్ట, పొట్టి, సన్నం అంటూ బాడీ ఇమేజ్ ని దెబ్బ తీసే కామెంట్లు వేయించుకుంటున్న మగవారికి
6. కన్నీళ్లు దాచుకోవడం అలవాటైపోయిన మగవారికి
7. మీ వ్యక్తిత్వాన్ని చూపించద్దని 'be a man' అనిపించుకున్న మగవారికి
8. 'మగాడు' కాబట్టి లేనిపోని బాధ్యతల్ని/ఆరోపణల్ని మోపేయబడిన మగవారికి
నా వైపు నుంచి పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు.

పురుషుల కోణం నుండి బాగా చెప్పారు. అన్నీ బాగున్నాయి, ముఖ్యంగా పైన 3 and 6 👌. థాంక్స్.
ReplyDeleteThanks andi
Deleteహర్షణీయమైన వ్యాసం. ఆలోచించదగ్గ విషయాలను సూటిగా చెప్పారు. అభినందనలు. ఇది మగవాళ్ళప్రపంచమూ కాదు ఆడవాళ్ళప్రపంచమూ కాదు.
ReplyDeleteకేవలం అవకాశవాదుల ప్రపంచం. ఇక్కడంతా కృత్రిమమే. స్త్రీ అనగానే సౌందర్యమూ సౌకుమార్యమూ గురించీ, పురుషుడు అనగానే తెలివితేటలూ బలమూ గురించీ వెంటనే విశేషణాలు వెదికే సామాజికమనస్తత్త్వం చాలా చిరాకు తెప్పిస్తుంది. కానీ సమాజం మెల్లగానే ఐనా గుణాత్మకమైన మార్పును పొందుతోందని ఆనందించవచ్చునా అంటే అనునిత్యం ఆ ఊహే తప్పనే టట్లుగా అనేక ఉదాహరణలు మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. కొంతలోకొంత మనవిద్యావ్యవస్థ కూడా ఈవిషయంలో సరిగా మారవలసి ఉంది. అంతవరకూ ఏడ్చేస్వాతంత్ర్యం కూడా లేని మగవాళ్లనీ అలోచనాస్వాతంత్యం కూడా లేని ఆడవాళ్లనీ చూస్తూ సానుభూతి చూపటంతప్ప ఏం చేయగలమా అని అలోచించాలి.
Avunandi
Delete