ఎవరు చేసిన ఖర్మ ...
మనోళ్ళకి ఆధ్యాత్మిక IQ ఎక్కువ. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత లాంటివి పనికట్టుకు చదవకపోయినా కర్మ సిద్ధాంతాలు, స్థితప్రజ్ఞత్వాలు, పూర్వ జన్మ సుకృతాలు, సంచిత పాపాలు ఇలాంటివి తెలుసు. ఇవి మన డి ఎన్ ఏ లో ఉన్నాయేమో!
మన జీవితం లో ట్రాజెడీ లని ప్రాసెస్ చేసే విషయం లో మన లోని ఈ ఆధ్యాత్మికత బాగా పనికొస్తుంది అనుకుంటాను. ఏదైనా దొరకకపోయినా, చేజారి పోయినా, బాధ కలిగినా, ఎవరైనా పోయినా ... ఎటువంటి ప్రతికూల పరిస్థితి అయినా సరే .. ఆధ్యాత్మికత, వేదాంతం, తాత్వికత లు సందు చివర దొరికే అరటి పళ్ళలాగా అన్ని సీజన్లలో పెద్ద ఖర్చు పెట్టకుండా అందుబాటులో ఉంటూ ఉంటాయి.
మనం జీర్ణం చేసుకున్న ఈ ఆధ్యాత్మికత లో చాలా ముఖ్యమైనది - కర్మ సిద్ధాంతం. మన దేశం లో పుట్టిన పదేళ్ల వాడిని కర్మ సిద్ధాంతం గురించి అడిగితే చెప్తాడని నాకో గుడ్డి నమ్మకం.
అయితే ఎవరి దగ్గర ఏది ఎక్కువ ఉంటుందో, వాళ్ళు ఆ ఆస్తిని విచ్చలవిడిగా విచక్షణ లేకుండా వాడేస్తారని మనిషి చరిత్ర చెప్తుంది.
అమెరికా తన అధికారాన్ని ఇలాగే వాడుతుంది. మనం మనం ఆధ్యాత్మికత ని అలాగే వాడతాం.
అన్నిటికంటే నాకు ironical గా అనిపించేది ... ఎంతో ఉన్నతమైన ఈ ఆధ్యాత్మికత ని తోటి మనిషిని జడ్జ్ చెయ్యడానికి, హీనంగా చూడ్డానికి, స్వార్ధాన్ని కప్పి పుచ్చుకోడానికి వాడటం.
As you sow, so shall you reap అంటుంది కర్మ సిద్ధాంతం. (స్థూలంగా).
మంచి చేస్తే మంచి. చెడు చేస్తే చెడు.
అయితే ఆధ్యాత్మికత కి ఓ రూల్ ఉంది. It's personal. చాలా వ్యక్తిగతమైన విషయం ఇది.
నీ జీవితానికి మాత్రమే ఆపాదించుకోవాలి.
పక్కోళ్ళ జీవితం లో మనం చూసిన ముక్క ని తీస్కొని దానికి ఆపాదించకూడదు.
వాడు ఎంత చెడ్డవాడు .. అయినా వాడికి ఏం కాదు చూడు అంటారు. పెద్దెదో వాడి లైఫ్ అంతా తెలిసిపోయినట్టు. త్రికాలజ్ఞానులు మాత్రమే నిజంగా ఆ చెడ్డవాడు ఎప్పుడు ఎలా కర్మఫలం అనుభవిస్తాడో చెప్పగలరు. (అయినా వాళ్ళు చెప్పరనుకోండి ... అలాంటి వాళ్ళకే త్రికాలజ్ఞానం వస్తుంది ఏవిటో)
నాకు ఇంకా బాధ కలిగించేది ఏంటంటే వికలాంగులను, విధి వంచితులను చూసి 'వాళ్ళు ఏ జన్మలో ఏం చేసారో మరి' అంటారు. అలా కర్మ సిద్ధాంతం భుజం మీద నుంచి జడ్జింగ్ అనే తుపాకీ పేలుస్తారు.
ఇది రివర్స్ calculation. మంచి చేస్తే మంచి. చెడు చేస్తే చెడు. వాడికి చెడు జరిగింది కాబట్టి వాడు ఖచ్చితంగా ఏదో చెడు చేసుంటాడు అని లెక్కగట్టేస్తారు.
ఇలా అన్నప్పుడు రెండు తప్పులు జరుగుతున్నాయి అని నా అభిప్రాయం
1. కర్మ సిద్ధాంతం లో cause-effect ని అర్ధం చేస్కోవడం అంత సులువు కాదని పెద్దవాళ్ళు చెప్తారు. బౌద్ధులు Endless knot (అంతం లేని ముడి) అనే ఓ చిహ్నాన్ని వాడతారు .. అది చూస్తే తెలుస్తుంది ..కర్మ సిద్ధాంతం ఎంత సూక్షమైనదో.
దీని ఆది, అంతం ఎక్కడున్నాయి చెప్పండి? ఇలా సగం సగం అర్ధం చేసుకున్న సిద్ధాంతాలతో మనం జడ్జి చెయ్యడం మొదటి తప్పు.
2. రెండోది, ఎంత గొప్ప జ్ఞానమైనా, సిద్ధాంతమైనా, వేదాంతమైనా మానవత్వానికి, ప్రేమకి అతీతమైనది కాదు. వాడి కర్మ ఫలం వాడు అనుభవిస్తున్నాడని పెదవి విరిచేస్తే compassion, empathy, సానుభూతి .. వీటికి స్థానం ఏది?
ఒక్కోసారి మంచి చేసే వాళ్ళకి మంచి ఫలితాలే రావు అని మనం చూస్తుంటాం. ఈ సిద్ధాంతాన్ని దానికి ఆపాదించేసి 'ఇంకెందుకు మంచి చెయ్యడం' అని దారి తప్పేస్తూ ఉంటాం కూడా.
సమాజం లో జరిగే చాలా వివక్షలని జస్టిఫై చేసుకోడానికి కూడా కర్మ సిద్ధాంతాన్ని వాడేశారు.
బానిసలు, బాల విధవలు, అంటరానివాళ్ళు, నిరుపేదలు, శారీరక మానసిక వికలాంగులు, రోగిష్టులు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, అవకాశాలు రాని ఆర్టిస్టులు, అర్ధాయుష్కులు, రెక్కాడినా డొక్కాడని వాళ్ళు ... వీళ్ళందరూ 'పూర్వజన్మ లో యేవో పాపాలు చేసిన వారే' అనేసారు. మళ్ళీ ఇదో వివక్ష! అదృష్టవంతులు vs దురదృష్టవంతులు. పూర్వ జన్మల్లో మేం మంచి చేసాం తెలుసా అని ఆధ్యాత్మికత ని కూడా ఈగో బూస్ట్ గా వాడేసేవాళ్ళు. ఎవరు చేసిన ఖర్మ వాళ్లే అనుభవించాలి అనే పీనల్ కోడ్ ముసుగు తొడుక్కున్నారు ఇంకొంత మంది స్వార్ధపరులు.
కానీ కొంత మంది సానుభూతి తో, మానవతా దృక్పథం తో వారి కర్మ సంచితాలు, పూర్వజన్మ సు/దుష్కృతాలు బాలన్స్ షీట్ వెయ్యకుండా వాళ్ళ బాధల్ని అర్ధం చేసున్నారు. కొంత మంది వారి జీవితాలని మార్చే సంస్కరణలు తీసుకొచ్చారు. తీసుకొస్తున్నారు.
కర్మయోగులంటే వాళ్ళు. ఎవరి కర్మ కి వాళ్ళని వదిలెయ్యని వాళ్ళు.

Endless Knot |
మన డి ఎన్ ఏ కి ఆధ్యాత్మికత ఉంది అనడానికి సాక్ష్యం మనం నిత్యం వేసే ఈ endless knot ముగ్గు |

Comments
Post a Comment