Posts

Showing posts from December, 2018

కథాలాపం

స్కూల్ లో కొత్త సంవత్సరం టెక్స్ట్ బుక్స్ రాగానే హిందీ, ఇంగ్లీష్, తెలుగు టెక్స్ట్ లు  వరస పెట్టి చదివేసే దాన్ని నేను. (సైన్స్, మ్యాథ్స్  పుస్తకాలు సంవత్సరం చివరికి కూడా కొన్నప్పటి లాగే కొత్తగానే ఉండేవి ... అది వేరే సంగతి. ) ఫస్ట్ క్లాస్ నుంచి ఇదే అలవాటు.   ముఖ్యంగా ఇంగ్లీషు టెక్స్ట్ లు. నావి చదవడం అయిపోయాక అక్కవి. అక్క దాని టెక్స్ట్ లో కథలు చదివి explain చేసేది... నన్నూ అమ్మని కూర్చోబెట్టి! 'ప్రైడ్ అండ్ ప్రెజుడీస్' గురించి అక్క ద్వారానే ఫస్ట్ విన్నాను నేను.  పోయెట్రీ కంటే ఫిక్షన్ వైపే ఎక్కువ ఇంట్రస్ట్ ఉండేది.  అలాగే షార్ట్ స్టోరీస్ .. చిన్న కథలనే రచనా ప్రక్రియ ని పరిచయం చేసినవి కూడా స్కూల్ పుస్తకాలే!  ఇప్పటికీ నేను వదలలేని రచయితలని మొదట పరిచయం చేసింది స్కూల్ టెక్స్ట్ బుక్కులే ... డికెన్స్, టాల్స్టాయ్, జేన్ ఆస్టెన్, ఓ హెన్రీ, ఆస్కార్ వైల్డ్, ఆర్థర్ కానన్ డోయల్, మపాసా...  నాకు ఓ ప్రాబ్లెమ్ ఉంది. కథ ని కథ లాగా చదవలేను. బాగా మనసుకి పట్టించేస్కుంటూ ఉంటాను.  అలా నా జీవితం లో పెద్ద మార్పుల్ని తీసుకొచ్చిన చిన్న కథలని ఈ రోజు గుర్తుచేసుకుంటున్నాను.  1. God sees the truth, b

నాటకాల జగతి

Image
తాడేపల్లిగూడెం లో మా పక్కింటి మల్లాది సూర్యనారాయణ మాస్టారు 'పాప దిద్దిన కాపురం' అనే నాటకం లో ఓ తొమ్మిదేళ్ళ  నన్ను టైటిల్ రోల్ లో తీసుకున్నప్పుడు నాకు రంగస్థలం తో మొదటి సారి పరిచయం ఏర్పడింది.  కట్నం పేరుతో మా వదిన ని వేధిస్తున్న మా అమ్మ, ఆవిడ ఫ్రెండు గురించి అమెరికా లో మా అన్న కి ఫోన్ చేసి చెప్పి వాళ్ళ ఆట కట్టించే పాత్ర నాది. మైకు ఎక్కడున్నా నీ వాయిస్ క్యాచ్ చేస్తుందమ్మా అని వాళ్ళు ఎంత చెప్పినా చాదస్తంగా మైకు దగ్గరకు వెళ్లి డైలాగులు చెప్పడం బాగా గుర్తు నాకు😄 చిన్నప్పటి నుంచి స్టేజి మీద పాడటం అలవాటు కాబట్టి స్టేజి ఫియర్ ఉండేది కాదు నాకు. డైలాగులు కూడా బాగా గుర్తుపెట్టుకోగలను. పైగా నాటకం లో నాకు రెండు డ్రెస్ ఛేంజులు! (తెర వెనక అక్క నా డ్రెస్ పట్టుకొని  నుంచొని ఉంటే అమ్మ గబగబా మార్చేసింది) ఈ నాటకం అనుభవాన్ని చాలా ఎంజాయ్ చేసాను.  పురుష పాత్రలు లేకపోవడం గమనించారా?  తాడేపల్లిగూడెం లోనే ఆదర్శ బాల మందిర్ అని స్కూల్ ఉండేది... పమ్మి వీరభద్రరావు గారని ఆ స్కూల్ హెడ్ మాస్టర్. సాహిత్య/నాటక రంగం వారికి ఈ పేరు తెలిసి ఉండచ్చు. ఆయన  ఓ మ్యూజికల్ డాన్స్ డ్రామా డైరెక్ట్ చేశారు. అందులో

ఆజ్ .. కుఛ్ టూటీ ఫూటీ సీ హూ మేఁ

కంటి ముందు కనిపిస్తున్న కల వైపు శరవేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంటే ... ఆకస్మికంగా కాళ్ళకి ఏదో అడ్డుపడి పడిపోతే ఎంత షాక్ కి గురవుతామో కదా. అలాంటిదే ఓ ఘటన జరిగింది కొన్ని రోజుల క్రితం.  వివరాలు అనవసరం. ఇలాంటి కష్టం వచ్చినవాళ్లలో నేను ప్రథమురాల్ని ఏమీ కాదు.  ప్రతి ఆటంకం మన మంచికే ఏదో సంకేతం తీసుకువస్తుంది అనే జ్ఞానం కూడా ఉంది.  కానీ ఇవన్నీ స్ఫురించక ముందు ఓ దశ ఉంటుంది ...  ఆ దశ చాలా చీకటి గా ఉంటుంది. ఇలా ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరగాలి? అసలు దీన్నించి కోలుకోగలనా? అనవసరంగా కలలు కన్నానా? నాలో నేననుకున్న సామర్ధ్యం లేదా? ప్రపంచం లో నా విలువలకి విలువ లేదా? నేను ఒంటరినైపోయానా? కలల్ని వదిలేయవలసిందేనా? వదిలేసి ఉండగలనా?  ఒక్కో ప్రశ్న ముందు ప్రశ్న కంటే భయం కలిగించే విధంగా ఉంటుంది. ఆ దశ లో రాసిందే ఈ కవిత.  తెలుగు లిపి:  ఆజ్ .. కుఛ్ టూటీ ఫూటీ సీ హూ మేఁ  ఖుద్ సే కుఛ్ వాదే( కియే థే మేనే  దిల్, దిమాగ్, జెహెన్, రూహ్ ... ఇన్ కో క్యా జవాబ్ దూ? కోయి ఔర్ హోతా తో మనాతీ  పర్ ఆజ్ ఖుద్ సే హీ రూఠీ రూఠీ సీ హూ మేఁ  ఆజ్ .. కుఛ్ టూటీ ఫూటీ సీ హూ మేఁ  సప్నే దేఖే హీ నహీ ఉన్ కో ప్యార్ భీ

'చలన' చిత్రాలు

Image
పోయిన వారం రెండు అద్భుతమైన సినిమాలు చూసాను. (లీగల్ గా .. హాట్ స్టార్ లో)  కోకో, ఫెర్డినాండ్ .. రెండూ యానిమేటెడ్ సినిమాలే.  ఈ సినిమాల గురించి మాట్లాడుకునే ముందు నాకూ యానిమేటెడ్ సినిమాలకూ ఉన్న అనుబంధం గురించి చెప్పాలి.  జీవితం లో కొన్ని గొప్ప విలువలని, ప్రపంచాన్ని గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలని, మానవత్వం, మనిషి చరిత్ర, నైజం, ప్రకృతి, వన్యప్రాణులు, ప్రేమ, పెళ్లి.. వీటిని ఎలా అర్ధం చేసుకోవాలి అనే విషయాలని నాకు యానిమేటెడ్ సినిమాలే నేర్పించాయి.  ఈ సినిమాలు ఆల్రెడీ చూసే అలవాటు ఉన్నవాళ్లు ఇవి పిల్లలకి మాత్రమే కాదని ఒప్పుకుంటారు, నాలాగా.  ఒక్కొక్క సినిమా ఒక్కొక్క భ్రమ/హింసాత్మకత/ముతక అలవాటు ని పటాపంచలు చేసే విధంగా ఉంటుంది. ఒక్కొక్క సినిమా కథ ది ఒక్కొక్క దేశం. ఆ దేశ భాష, సంస్కృతి ని పరిచయం చేసే విధంగా ఉంటాయి ఇవి. అన్నిటిలోకి కామన్ .... మంచి సంగీతం, సరదా జోకులు, బోల్డు wisdom!  జెనరల్ గా యానిమేటెడ్ సినిమా అంటే ఫెయిరీ టేల్స్ అంటే పాత కాలం నాటి జానపద కథలు తీసేవాళ్ళు. తర్వాత రకరకాల నేపథ్యాల తో కేవలం ఈ సినిమాలకే కథ రాసుకొని తీస్తున్నారు. కొన్ని పిల్లల పుస్తకాలని కూడా సినిమాలు గా తీశారు.