Posts

Showing posts from November, 2018

ఆనందాల జాడీ

ఎప్పుడైనా గమనించారా?  కష్టం గుర్తున్నంత వివరంగా సుఖం గుర్తుండదు.  కష్టాలు ఎన్ని గుర్తుంటాయో అన్ని సుఖాలు గుర్తుండవు.  కష్టాలు మన మీద పడేసే ప్రభావం సుఖాలు పడెయ్యవు.  సుఖాలు - 30 సెకన్ల యాడ్ లా, కష్టాలు డాక్యుమెంటరీ లాగా ఎందుకు అనిపిస్తాయి?  సుఖాలు చిన్నగా, కష్టాలు పెద్దగా ఎందుకు కనిపిస్తాయి?  ఈ పరిణామాన్ని 'నెగిటివిటీ బయాస్' ( Negativity Bias ) అంటారట. అంటే ప్రతికూలత పట్ల పక్షపాతం.  అంటే, ఒక నెగిటివ్ సంఘటన/అనుభవం, అదే ఉధృతి గల పాజిటివ్ సంఘటన/అనుభవం మనకు జరిగితే, ఆ ప్రతికూల సంఘటనే మన మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది - ఎక్కువ గుర్తుంటుంది, ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది అని.  ఓ పక్క నుంచొని 'బాగా పాడావమ్మాయి' అని ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే .. ఇంకో వైపు ఒకరు పెదవి విరిస్తే నేను కాంప్లిమెంట్ ని పట్టించుకోకుండా కేవలం ఆ విమర్శ నే గుర్తుంచుకొని పదే పదే నెమరువేసుకోవడం అన్నమాట (ఇది నా వ్యక్తిగత అనుభవం అని మీరు ఊహిస్తే మీరు కరెక్టే. బాగా పాడలేదు అనలేదు కానీ నేనెంచుకున్న పాట ఆ సందర్భానికి సరిపోలేదు అన్నారు)  ఇది మన మెదడు కి బాగా అలవాటేనట. (మన తప్పు కాదన్నమాట! హమ్మయ్య!) 

పురుష సూక్తం

పంతొమ్మిది నవంబరు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అట. ఇది తెలిసాక రెండు రకాల రియాక్షన్స్ వస్తాయి .. 1. 'అబ్బా .. ఈ మధ్య ప్రతి దానికి ఓ దినం తగలడింది' అని 2. 'అబ్బా! ఈ మగాళ్ళకి ఓ రోజెందుకో .. అసలు ఈ ప్రపంచమే వాళ్ళదైతే' అని కొన్ని విషయాలు నా అనుభవం లోకి రాకపోతే నేనూ ఇలాగే రియాక్ట్ అయ్యే దాన్ని. నాకు అసలు మగ, ఆడ అంటూ విడదీసి మాట్లాడటం నచ్చదు. సినిమాల్లో కానీ, ఫ్రెండ్స్ లో కానీ 'బాయ్స్ బెస్ట్ ఆ గర్ల్స్ బెస్ట్ ఆ' అని సరదాగా అన్నా అక్కడి నుంచి లేచొచ్చేస్తాను నేను. అంత విసుగు. కోతి నుంచి మనిషి evolve అవ్వటానికి ఎన్నేళ్లు పట్టిందో తెలియదు కానీ ఈ లింగభేదాల నుంచి లింగ వివక్ష ల నుంచి మనం ఎన్నేళ్లకు బయటపడతాం రా బాబూ అనిపిస్తుంది. (ఇంకా 63 లింగాలు ఉన్నాయిట మనుషుల్లోనే! ఇంక వాటిని అర్ధం చేసుకొని, స్వీకరించి, శాంతి తో కలిసి ఉండేదెప్పుడో! చాలా పనుందండి మనకి!) ఇప్పుడు ఇది రాస్తోంది కూడా 'పురుషులారా ... ఓ పురుషులారా! మీరు ఎంత గొప్పవారు! చెమటోడ్చి... కుటుంబమనే రిక్షా ని కష్టాలనే భారం మోస్తూ .. పరిస్థితులనే ఎత్తు రోడ్డు ఎక్కుతూ .. ఎంత బాగా లాగుతున్నారు' అని చెప

నేను పుట్టాను

Image
పుట్టినరోజంటే తెగ ఎక్సైట్ అయిపోయేవాళ్ళ సంఘానికి మొన్నటి దాకా నేను కేవలం కమిటీ మెంబర్ ని. ఈ రోజు నుంచి స్పోక్స్ పర్సన్ ని కూడా.  మా నాన్నగారన్నట్టు నా పుట్టిన రోజు మర్నాటి నుంచి మళ్ళీ నా పుట్టినరోజు ఎప్పుడు వస్తుందా అని 364 రోజులు ఎదురు చూసే టైపు నేను.   ప్రతి నెల పదిహేడో తారీఖు న ఇంకా నా పుట్టిన రోజుకి కరెక్ట్ గా ఎన్ని నెలలు ఉందో అని లెక్కకట్టి ఇంట్లో వాళ్ళకి విసుగు తెప్పించే తరహా నేను.  ఈ విషయం లో ఎటువంటి గుంభనం, హుందాతనం, సిగ్గు లాంటివి లేకుండా ఇంగ్లీష్ డేట్ ప్రకారం, తిథుల ప్రకారం, నక్షత్రం ప్రకారం .. మూడు రోజులు పుట్టినరోజు జరుపుకునే రకం నేను.  పుట్టిన రోజు ని ఓ రోజు గా కాక ముందొక ఐదారు రోజులు, తర్వాత ఒక ఐదారు రోజులు ..అసలు నవంబరు నెలంతా నాకే గుత్తగా రాసిచ్చినట్టు స్పెషల్ గా ఫీలయిపోయే జాతి నేను.  ఎందుకు నాకింత excitement అంటే నేను చెప్పలేను. I am too excited to analyze! చిన్నప్పుడు పుట్టిన రోజంటే కేక్, స్కూల్ ఫ్రెండ్స్ తో పార్టీ  అన్నట్టే ఉండేది. మేము స్కూల్ నుంచి వచ్చేసరికి డాడ్ హాల్ లో రిబ్బన్స్ గట్రా పెట్టి డెకరేట్ చేసేవారు. కేక్ కట్ చెయ్యడం, డాడ్ కేసెట్ కలెక్షన్ లో

మన 'చేతిలో' పని

Image
అబద్ధానికి అనంతమైన అవతారాలు ఉన్నాయి. వాటిలో ఒకటి 'ఫేక్ న్యూస్' .. నకిలీ వార్త.  సాంప్రదాయ వార్తా మాధ్యమాల లో నకిలీ వార్తల గురించి నేను మాట్లాడను.  మన ఇన్వాల్వ్ మెంట్ ఉన్న, మన అదుపు లో ఉన్న సామాజిక మాధ్యమాల గురించే మాట్లాడతాను.  అది కూడా మన దైనందిన జీవితానికి సంబంధించిన, మన సామరస్యాన్ని, శాంతిని, మనశ్శాంతి ని  ప్రభావితం చేసే విషయాలు... వీటి గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాను.  వెరిఫై చేసుకోకుండా వారు నమ్మి .. పక్క వారికి సరఫరా చేస్తున్న ఈ తప్పుడు సమాచారవాహిని ని విని, కంగారు పడి.. రీసెర్చ్ చేసి .. కాదని తెలుసుకొని .. చివరికి వారిని బ్లాక్ చేసిన అనుభవం తో ఇది రాస్తున్నాను.   మనం రోజూ చదువుతున్న, ఫార్వార్డ్ చేస్తున్న సమాచారం లో ఫేక్ న్యూస్ ల ఉధృతి నన్ను ఆశ్చర్యపరిచింది.  బ్యాంకు, ఏటీఎం వ్యవహారాలు, ఆధార్ కార్డు ఈ ఫేక్ న్యూస్ ఫేవరేట్ టాపిక్స్. మొన్న జరిగిన నోట్ల రద్దు అప్పుడు అయితే ఈ ఫేక్ న్యూస్ లకి పండగే పండగ! (రెండు వేల రూపాయల్లో చిప్పు వార్త గుర్తుందా?)  కొన్ని ఫేక్ న్యూస్ అంత ప్రమాదకరమైన వి కావు.  ఫేస్ బుక్ మీ డేటా అంతా వాడేయబోతోంది... అలా వాడకుండా ఉండాలి అంటే 'ఏయ

డియర్ దైనందినీ

Image
స్కూల్ అయిపోయి ఇంటర్మీడియేట్ లో చేరినప్పుడు డైరీ రాయడం మొదలుపెట్టాను.  ఆత్మ, పునర్జన్మ వంటివి నమ్మినట్లైతే నేనొక మహా ముసలి ఆత్మనని నాకు అనిపిస్తుంది. మా అక్క అప్పుడప్పుడు ఇదే తిట్టు తిడుతుంది కూడా. స్పిరిట్యుయల్ తిట్టు అన్నమాట ... 'ఒసేయ్ ముసలి ఆత్మా!' అనడం.  మిగిలిన చాలా తిట్ల లాగా ఇది ఇంగిలీషు లో బాగుంటుంది వినడానికి. Old Soul. అందుకే నావన్నీ కొంచెం ముసలి హ్యాబిట్స్ అన్నమాట. నేను బాల్యం నుంచి స్ట్రెయిట్ గా వృద్ధాప్యం లోకి అడుగుపెట్టేసానేమో అని నా అనుమానం కూడా.   లేకపోతే డైరీ రాయటం ఏంటి చెప్పండి? 'పదహారేళ్ళ వయసు' కి తగ్గ హాబిట్టేనా? పదహారేళ్ళ పడుచు పిల్ల కనే కలల మీద సినిమాలు తీసే వాళ్లు ఏమనుకుంటారో అనే విచక్షణ కూడా లేకుండా నేను డైరీ రాయడం మొదలు పెట్టాను.  ఓ పది పదకొండేళ్ళు రాసాను.  మొదటి సంవత్సరం మామూలు డైరీ లో రాసాను. తర్వాత ఎవరో ఇచ్చిన డైరీ లో కంటిన్యూ చేసాను. ఆ తర్వాత నుంచి మాత్రం ఒక్కో సంవత్సరం ఒక్కో డైరీ... గీతా ప్రెస్ వాళ్ళు 'గీతా దైనందినీ' అని ఓ డైరీ వేస్తారు. డైరీ కి ఎంత మంచి పేరు పెట్టారు చూడండి! అందులో ప్రతి రోజూ రెండు గీతా శ్లోకాలు ఉంటాయి.