Posts

Showing posts from August, 2018

స్రష్టకష్టాలు

అష్టకష్టాల గురించి మనందరికీ తెలుసు ..  కష్టాల బ్యూటీ కాంటెస్ట్ లో అష్టకష్టాలకే కిరీటం తొడగబడుతుంది.  కానీ వాటిని మించిన కష్టాలు కొన్ని ఉన్నాయి .. అవే కళాకారుల కష్టాలు .. కళను సృష్టించే కళా స్రష్టల కష్టాలు .. స్రష్టకష్టాలు. (అసలు కళ ఎందుకు అనేవారు చివరి పేరాగ్రాఫ్ చదివి మళ్ళీ ఇక్కడికి రావచ్చు)  కళ ని జీవనశైలి గా, భుక్తి-ముక్తి మార్గంగా ఎంచుకొన్న వారి గురించే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. (వీకెండ్స్ లో కథక్  క్లాసెస్ కి వెళ్తున్న వారు, చిన్నప్పుడు ఎప్పుడో సంగీతం నేర్చుకుని ఇప్పుడు మర్చిపోయిన వాళ్ళు, ఇంట్లో ఏదో ఒక musical instrument/డాన్స్ గజ్జెలు ఉన్నవారు, సరదా కి అప్పుడప్పుడూ బొమ్మలు వేసుకొనే వారు...  వీళ్ళని hobbyists అంటారు.) స్రష్టకష్టాలు  = అష్టకష్టాలు  + ఇంకొన్ని కష్టాలు  కష్టాల గురించి మాట్లాడుకొనే ముందు క్లుప్తంగా సుఖాల గురించి కూడా మాట్లాడుకుందాం (క్లుప్తంగా ఎందుకంటే కొన్నే ఉంటాయి కాబట్టి 😉) కళ వల్ల తోటివారిలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది. ఆ అమ్మాయి పాటలు బాగా పడుతుంది అనో, వాడు బాగా బొమ్మలు వేస్తాడు అనో స్కూల్ టైం నుంచీ వీరిని ప్రత్యేకంగా introduce చెయ్యడం జరు

నోబెల్ సాధించాలంటే ఏం చెయ్యాలి?

Image
చిన్నప్పుడు ఓ కార్టూన్ నాకు ఓ గొప్ప విషయాన్ని పరిచయం చేసింది.  ఆ కార్టూన్ లో ఓ సైంటిస్ట్ కి బండ రాళ్ళు కొట్టే పని చెయ్యవలసి వస్తుంది. మిగిలిన వాళ్ళు రోజులు రోజులు ఒకే బండ రాయిని సుత్తులతో కొట్టి కొట్టి చిన్న చిన్న ముక్కలు చేస్తూ ఉంటారు. ఈ సైంటిస్ట్ మాత్రం ఆ బండ రాతిని అన్ని వైపులా గమనించి, తడిమి దాని సెంటర్ పాయింట్ ని కనుక్కొని దాని మీద సుత్తి తో చిన్నగా తడతాడు. అంతే. అంత పెద్ద బండ రాయి పొడి పొడి అయిపోతుంది!  నన్ను ఈ కార్టూన్ చాలా ప్రభావితం చేసింది. ఒక పని ని నేను approach చేసే విధమే మార్చేసింది.  నా అనుభవం ప్రకారం hard work is over-rated అండి.  కష్టపడటాన్ని ఎందుకో అనవసరంగా glorify చేసేసారు.  కష్టపడి చదువుకోవాలి. కష్టపడి ఇల్లు కట్టుకోవాలి. కష్టపడి పెళ్లి చేసుకొని కష్టపడి భరించి కష్టపడి షష్టి పూర్తి జరుపుకోవాలి. కష్టపడి పిల్లల్ని పెంచాలి. ఆ పిల్లలకి...  కష్టపడి...  వాళ్ళు కష్టపడే చదువులు చెప్పిస్తే అతి కష్టం మీద ఉద్యోగాలు వస్తాయి.  మళ్ళీ కష్టపడి పెళ్లిళ్ళు  చెయ్యాలి. ఎందుకండీ ఇంత కష్టం?  అంటే చదువుకోవద్దా? ఉద్యోగాలు.. పెళ్లి ... పిల్లలు?  కష్టపడద్దు అ

మార్పుమాలక్ష్మి

శ్రావణ మాసం వచ్చేసింది. అన్నీ ఆడాళ్ళ పండగలే. ఆడాళ్ళు బోల్డు బిజీ. చూడటానికి చాలా బాగుంటుంది.  కొత్త చీరలు, పసుపు పాదాలు, తల్లో పూలు...  కానీ ఆ కొత్త చీరలు చూసే వాళ్ళకి తెలీవు .. ఎన్ని డిస్కౌంట్లు ఉన్నా బడ్జెట్ లో మంచి చీర తెచ్చుకోవడానికి ఆ అతివ ఎంత కష్టపడిందో. పసుపు పాదాలు చూసే వారికి తెలీదు ... టెయిలర్ల చుట్టూ పీకో, ఫాల్, బ్లౌజ్ కోసం, శ్రావణ మంగళవారాల నోముల కోసం కాళ్లరిగేలా ఆ పడతి ఎలా తిరిగిందో.  అసలే బిజీ గా ఉన్న ఆడవాళ్ళ కాలెండర్ లో శ్రావణ మాసం ఇంకో హడావుడికారి.  working women అయినా, house wives అయినా ఈ మాసం చాలా stressful గా ఉంటుంది .. శుక్రవారమే ఇంటెడు పని, ఆరోజే రాని domestic help, పిండి వంటలు, మామూలు పనుల మీద ఈ తమలపాకులు, వక్కలు, పళ్ళు, పూల షాపింగ్, పేరంటాలకి, నోములకి ఎక్కే గడప, దిగే గడప .. పోనీ ఓపిక లేక ఏదైనా తక్కువ చేస్తే గిల్టీ ఫీలింగ్ ..  అయినా ఇష్టం గా చేసేది కష్టంగా అనిపించదు అనుకోండి. పైగా ఈ నెల చేసుకొనే వ్రతాలు,  పూజలు,నోములు అన్నీ వారి 'సౌభాగ్యం' ఉరఫ్ 'అత్తారింటి మేలు/భర్త ఆయురారోగ్య ఐశ్వర్యాలు/ముత్తయిదువతనం' మీద ఆధారపడి ఉన్నాయి మరి!    అద

అంట్లు తోమడం - ఓ అధ్యయనం

ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు నేను అంట్లు తోమాలి. మా ఇంట్లో అంట్లే. మా డొమెస్టిక్ హెల్ప్ పెళ్లి కి వెళ్ళింది. అందుకని. First things first, నాకు పనిమనిషి అనే పదం కంటే డొమెస్టిక్ హెల్ప్ అనటమే ఇష్టం (ఈ టాపిక్ మీద తర్వాత మాట్లాడుకుందాం) మా 'హెల్ప్' రాకపోవటం వల్ల ఆమె చేసే ఇంటెడు పని ని మాలో మేమే పంచుకోవడం లో - నేను ఇష్టం గా తీసుకున్న పని అంట్లు తోమడం. ఎందుకు ఇష్టమో .. చివర్లో చెప్తాను. ఏ పని చేసినా నా షరతుల మీద చెయ్యటం నాకు అలవాటు. 1. నేను రోజుకి ఒక్క సారే తోముతాను. ఎన్ని పడినా ఫర్వాలేదు. 2. పెద్ద కుక్కర్ తోమను. అది తోమాలంటే నీరసం... తోమాక ఆయాసం. అందుకే. 3. నేను తోముతుంటే మధ్యమధ్య లో కొత్త అంట్లు వెయ్యకూడదు. అన్నీ ఒకే సారి వేసేయాలి. 4. మధ్యమధ్యలో ఆ గరిట కావాలి, ఈ ప్లేట్ కావాలి అని అడగకూడదు. అన్నీ అయ్యాకే వాడుకోవాలి. ఇంట్లో వాళ్ళు కాబట్టి ఇన్ని షరతులకీ ఒప్పుకొని పని చేయించుకుంటారు పాపం. ఒక్కోసారి మా 'హెల్ప్' వచ్చే వరకూ కంచాలు, టిఫిన్ ప్లేట్లు throw-out వి వాడటం కూడా కద్దు! మా వాళ్ళు అంత దయార్ద్రహృదయులు 😊 నేను అంట్లు తోమాలంటే పీచు, విమ్ సరిపోవు. Laptop, blue tooth earp

'ఫ్రెలసీ'

ఫ్రెండ్షిప్ డే అయింది కదా కొన్ని రోజుల క్రితం ...  అసలు ఈ ఫ్రెండ్షిప్ డే ఎందుకొచ్చింది లాంటివి నేను చెప్పాల్సిన అవసరం లేదు ..  ఇక్కడ చదువుకోవచ్చు ...  ప్రతి 'రోజు' లాగానే ఎఫ్ ఎం రేడియోల ప్రోగ్రామ్స్..... మాల్స్ లో డిస్కౌంట్స్, వాట్సాప్ లో అవే అవే మెసేజులు ... ఈ టాపిక్ మీద సినిమాల్లో అవే అవే పాటలు ....  సెలెబ్రిటీ స్నేహాల మీద ఆర్టికల్స్ ...   ఇంకో వైపు 'ఈ దినాలు ఏవిటండీ?' అంటూ అవే అవే వాపోవడాలు ...  అందుకే 'హ్యాపీ ఫ్రెండ్షిప్ డే' లోంచి 'డే' తీసేస్తున్నాను నేను ..  హ్యాపీ ఫ్రెండ్షిప్ గురించి మాత్రం మాట్లాడుకుందాం  ఫ్రెండ్షిప్ కి హ్యాపీ గా ఉండే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ అడుగడుగునా స్వేఛ్చ ఉంది. (ఈ గూగుల్ లో చ కి ఛ వత్తు ఇచ్చుకునే స్వేఛ్చ మాత్రం లేదు 😞)   1. స్నేహితుడ్ని ఎంచుకోవడం లో స్వేఛ్చ.. (బలవంతంగా మన మీద పడేసిన రక్తసంబంధాల్లా కాక)  2. ఆ స్నేహం ఎలా ఉండాలో నిర్ణయించుకునే స్వేఛ్చ ... (మా మావయ్య ఫ్రెండ్ ఆదివారాలు ఇంటి కొచ్చి ఒక్క మాట మాట్లాడకుండా న్యూస్ పేపర్ మొత్తం చదువుకుని, కాఫీ తాగి వెళ్ళిపోయేవారు. ఇది వాళ్ళ ఫ్రెండ్షిప

నేను రాసిన ఓ ఉర్దూ ఘజల్

నాకు ఘజల్స్ అంటే చాలా ఇష్టం.   నాకు సంగీతం ఎంత ఇష్టమో సాహిత్యం అంత ఇష్టం ... అందుకే ఈ ప్రక్రియ అంటే అంత అనుబంధం ఏర్పడింది.  మొహసిన్ నఖ్వీ , గాలిబ్, నాసిర్ కాజ్మి ఇలాంటి ఉర్దూ కవులు రాసిన పదాలకి ... జగ్జీత్ సింగ్, గులాం అలీ, మెహదీ హాసన్ వంటి వారి స్వరాలు, గళాలు తోడైనప్పుడు ఒక అందమైన ఘజల్ పుడుతుంది  (ఈ కింది ఘజల్స్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ కి వెళ్ళచ్చు ) దిల్ ధడక్ నే కా సబబ్ యాద్ ఆయా ..  వొ తేరి యాద్ థీ .. అబ్ యాద్ ఆయా  రంజిష్ హీ సహీ ... దిల్ హీ దుఖానే కేలియే ఆ ... ఆ ఫిర్ సే ముఝే ఛోడ్ కే జానే కేలియే ఆ . తుమ్ నహీ ... ఘమ్ నహీ .. షరాబ్ నహీ ... ఏసి తన్ హాయి కా జవాబ్ నహీ ...  వివిధ భారతి లో అప్పుడప్పుడూ ఘజల్స్ వినిపిస్తూ ఉంటారు ..  అలా surprise గా దొరికిన ఒక rare ఘజల్ .. రూపా గాంగూలి పాడిన 'తేరే కరీబ్ ఆకే .. బడీ ఉల్ఝనో( మే హూ .. మే దుష్మనో మే హూ కే తేరే దోస్తో మే హూ' అనే ఘజల్!  ఘజల్ అంటే చేతిలో మందు సీసా ఉండాల్సిందే అంటే నేను ఒప్పుకోను  ఘజలే ఒక మందు సీసా 😉😉 అన్ని ఘజల్స్ విరహం, రాతి గుండె ప్రేయసి, ఒంటరి తనం, మోస పోవటం .. ఇలాంటి వాటి చుట్టూనే ఉండవు .. కొన్ని